India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజధానిలో మాజీ CM KCR పోరుబాటకు సర్వం సిద్ధమైంది. మల్కాజిగిరి BRS MP అభ్యర్థి లక్ష్మారెడ్డికి మద్దతుగా దుండిగల్ కమాన్ వద్ద ప్రచార సభ ఏర్పాటు చేయగా.. కాసేపట్లో KCR రానున్నారు. CM రేవంత్ సిట్టింగ్(MP) స్థానం ఇదే కావడంతో అందరిచూపు మల్కాజిగిరిపై పడింది. దీనికితోడు BRS నుంచి బయటకెళ్లిన ఈటల(BJP), సునీత(INC) ప్రత్యర్థులుగా ఉన్నారు. వారిపై KCR స్పందన ఏంటనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది.
HYDలో నిన్న కురిసిన గాలివాన 11 మందిని బలితీసుకొంది. బహదూర్‌పురాలో కరెంట్ పోల్ తగిలి షాక్‌తో ఫక్రూ(40) చనిపోయారు. బేగంపేట నాలాలో రెండు మృతదేహాలు కొట్టుకొచ్చాయి. బాచుపల్లిలో గోడకూలి ఏకంగా ఏడుగురు ప్రాణాలు విడిచారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. అబ్దుల్లాపూర్‌మెట్‌లో పంక్చర్ షాప్‌లో ఉన్న వ్యక్తి కరెంట్ షాక్‌తో చనిపోయారు. అకాల వర్షానికి ఒక్కరోజే 11 మంది చనిపోవడం HYDలో ఇదే తొలిసారి.
రాజధాని పరిధిలోని మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల ఎంపీ స్థానాల్లో BRSను గెలిపించేందుకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లతో హోరెత్తిస్తున్నారు. నేడు KCR బస్సు యాత్ర కూడా నగరానికి చేరనుండడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ పెంచేలా నేతలకు KTR సూచనలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో HYDలో 17 సీట్లను BRS గెలవగా దాని ప్రభావం ఏ మేరకు ఉంటుందో వేచి చూడాలి.
HYDలోని అనేక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి రోడ్లపై నీరు నిలిచింది. దీంతో ఎక్కడికక్కడ వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. పలుచోట్ల కనీసం రోడ్లపై నడవలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్ రంగంలోకి దిగారు. నీరు నిలిచిన ప్రాంతాలను పరిశీలించి, త్వరత్వరగా చర్యలు చేపట్టాలని కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
HYD, RR, MDCL,VKB జిల్లాల పరిధిలో వర్ష బీభత్సం, ఈదురు గాలులకు రాత్రి అనేక చోట్ల కరెంట్ స్తంభించి పోయింది. కరెంట్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు నేలకొరిగాయి. పలు చోట్ల కరెంట్ తీగలు తెగిపడ్డాయి. అనేక చోట్ల విధ్వంసకర పరిస్థితి ఏర్పడింది. విషయాన్ని తెలుసుకున్న విద్యుత్ శాఖ ఇంజినీర్లు, లైన్ మెన్, సిబ్బంది, అధికారులు అర్ధరాత్రి నిద్రహారాలు మాని ప్రజలకు కరెంట్ పునరుద్ధరించడంలో నిమగ్నమయ్యారు.
HYDలో కురిసిన వర్షం, ఈదురుగాలులకు దాదాపు 480 ఫీడర్ ఏరియాల్లో కరెంట్ సమస్యలు ఏర్పడ్డాయి. నగరంలో 4000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ కాస్త రాత్రి ఒక్కసారిగా..1000 మెగావాట్లకు పడిపోయింది. దాదాపుగా 300 ఫీడర్ ఏరియాల్లో అధికారులు మరమ్మతులు చేపట్టి సమస్యలకు చెక్ పెట్టారు. మిగతా ప్రాంతాల్లోనూ కరెంట్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు కొనసాగుతున్నాయి. ఇదే పరిస్థితి 2021లో ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.
దేశంలోని లోక్‌సభ స్థానాల్లో చేవెళ్ల వైవిధ్యమైందని బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. చేవెళ్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందగా, మరికొన్ని చోట్ల కనీస సౌకర్యాలు లేవన్నారు. ఐటీ, రియల్ రంగాల్లో దూసుకెళ్తున్న ప్రాంతాలు కొన్నైతే, వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్న గ్రామాలు కొన్ని ఉన్నాయన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి తనకో విజన్ ఉందని అన్నారు.
మల్కాజిగిరి దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న పార్లమెంట్ నియోజకవర్గం అని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇదో మినీ ఇండియా అని, భిన్న ప్రాంతాల వారున్నారన్నారు. రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు, అన్ని రంగాల్లో మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. మెట్రో విస్తరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడుతానని తెలిపారు.
HYD అల్వాల్‌లో <<13198573>>బావ యుగేంధర్(40)ను<<>> బావమరిది సుబ్రహ్మణ్యం హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికుడైన ఎం.యుగేంధర్.. గతంలో పలు నేరారోపణలతో జైలుకెళ్లి వచ్చాడు. ఈ క్రమంలో భార్య జానకి, కుమార్తెను వేధిస్తున్నాడు. తాగొచ్చి భార్యపై దాడి చేయడంతో ఆమె తన తమ్ముడు సుబ్రహ్మణ్యానికి చెప్పింది. దీంతో అక్కను నిత్యం వేధిస్తున్నాడని కక్ష పెంచుకున్న బావమరిది బావను బండరాయితో మోది హత్య చేశాడు.
HYDలో కురిసిన వర్షానికి చాలా ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. వర్షం పరిస్థితులపై కమిషనర్ రోనాల్డ్ రాస్ అధికారులతో సమీక్షించారు. రోడ్లపై నిలిచిపోయిన నీటిని చెట్ల కొమ్మలను వెంటనే తొలగించాల్సిందిగా ఆదేశించారు. కంట్రోల్ రూమ్‌కి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించి చర్యలు చేపట్టాలన్నారు. దాదాపు 75 ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచినట్లు అధికారులు గుర్తించారు.
Sorry, no posts matched your criteria.