India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు GHMCలో విలీనం చేస్తారా.. లేదా అనే విషయమై స్థానిక ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఓ వైపు కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు అంటూ ఓటర్ల జాబితా సవరణకు అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు త్వరలో విలీనం అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలు చేశాయి. అయితే ఎన్నికల ప్రక్రియ చేపట్టేందుకు కంటోన్మెంట్ బోర్డు యంత్రాంగం సిద్ధమవుతోంది. దీంతో స్థానికంగా అర్థంకాని పరిస్థితి నెలకొంది.
HYD నార్త్ జోన్ డీసీపీగా సాధన రష్మీ పెరుమాళ్ బదిలీపై వస్తున్నారు. ప్రస్తుతం నార్త్‌జోన్ డీసీపీగా పనిచేస్తున్న రోహిణి ప్రియదర్శిని నిజామాబాద్ డిచ్‌పల్లి 7వ బెటాలియన్‌కు బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో ప్రస్తుతం హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా పనిచేస్తున్న సాధన రష్మీ పెరుమాళ్ నార్త్ జోన్ డీసీపీగా బదిలీ అయ్యారు. త్వరలో ఆమె బాధ్యతలు చేపట్టనున్నట్లు పోలీస్ సిబ్బంది తెలిపారు.
HYD, RR, MDCL,VKB జిల్లాలలోని పలు ప్రాంతాల్లో కరెంట్ కోతలతో ఇబ్బంది పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. రాత్రి బంజారాహిల్స్, చందానగర్, ఎల్బీనగర్, జవహర్‌నగర్ తదితర చోట్ల కరెంట్ కోతలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సమస్యల పరిష్కారానికి TGSPDCL అధికారులు కంట్రోల్ రూమ్ నంబర్లను అందుబాటులోకి తెచ్చారు. HYD, RR, MDCL ప్రజలు పై ఫొటోలోని నంబర్లు, VKB ప్రజలు 9493193177 నంబర్‌లో సంప్రదించండి.
SHARE IT
సికింద్రాబాద్ రైల్వే SPగా చందనాదీప్తి నల్గొండ నుంచి బదిలీపై వస్తున్న విషయం తెలిసిందే. 1983 వరంగల్‌లో జన్మించిన ఆమె ఏపీలో 10th, ఇంటర్ వరకు చదివారు. ఢిల్లీ IITలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు. ఆమె తండ్రి సూచనలతో HYDలో కోచింగ్ తీసుకొని IPS ర్యాంకు సాధించారు. మొదట ఆమె నల్గొండ ప్రొబేషనరీ ఆఫీసర్‌గా, ఆ తర్వాత తాండూరు ASPగా, NZB OSDగా, మెదక్ SPగా, HYD నార్త్ జోన్ DCPగా, నల్గొండ SPగా పనిచేశారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సోమవారం రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. శంకర్‌పల్లి మండలం ప్రొద్దటూరులో అత్యధికంగా 73.3మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. శంకర్‌పల్లిలో 71మిల్లీ మీటర్లు, మొయినాబాద్ మండలం రెడ్డిపల్లిలో 61మిల్లీ మీటర్లు, మేడిపల్లి పరిధి మున్సిపల్ ఆఫీస్ వద్ద 39మిల్లీ మీటర్లు, ఘట్‌కేసర్ మండలం సింగపూర్ టౌన్‌షిప్ వద్ద 34 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
భయంకరమైన ధార్ గ్యాంగ్ ఘటనలు మరవకముందే గ్రేటర్ HYDలో మరో ముఠా కలకలం రేపుతోంది. యూపీ షామ్లి జిల్లాకు చెందిన భవారియా గ్యాంగ్ రోడ్లపై ఒంటరిగా వెళ్లేవారినే టార్గెట్ చేస్తూ దాడి చేసి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతోంది. తాజాగా సిటీ పరిధిలో ఒకేరోజు 4 చైన్ స్నాచింగ్‌లు చేశారు. నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్లతో ఉన్న బైక్‌లపై వచ్చి చైన్ స్నాచింగ్‌లు చేస్తూ పోలీసులకే సవాల్ విసురుతున్నారు. జర జాగ్రత్త!
శ్రీ అఖిల భారత కూచిపూడి నాట్యకళా మండలి ఆధ్వర్యంలో ప్రఖ్యాత నాట్యగురువు పెనుమర్తి మృత్యుంజయశర్మ శిష్యురాలు పవిరళ అచ్చుత్ దీపిక తనయ ప్రీతిక సవిరళ కూచిపూడి రంగప్రవేశాన్ని చేసింది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కూచిపూడి శాస్త్రీయ నృత్యంపై మక్కువతో కూచిపూడి రంగప్రవేశాన్ని ఆగ్రేసర వర్తనశోభతో విరాజిల్లింపజేసి అందరి ప్రశంసలందుకుంది. HYD రవీంద్రభారతిలో ప్రముఖులు ఆమె కూచిపూడి రంగప్రవేశాన్ని కొనియాడారు.
HYD హిమాయత్‌నగర్‌లోని టీటీడీ బాలాజీ భవన్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం 19వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పుష్పయాగం వైభవంగా జరిగింది. ఉదయం నుంచి రాత్రి వరకు వేలాది మంది భక్తులు తరలివచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈనెల 12వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు సోమవారం రాత్రి 9 గంటలకు జరిగిన ధ్వజారోహణం కార్యక్రమంతో ముగిశాయి.
రెవెన్యూ శాఖలో అధికారాల వికేంద్రీకరణ జరపాలని తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ (టీజీటీఏ) నాయకులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరారు. HYD నాంపల్లిలోని టీజీటీఏ కార్యాలయంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రాములు ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం సోమవారం జరిగింది. అనంతరం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిసి సమస్యలు, పదోన్నతులపై వినతిపత్రం సమర్పించారు.
తెలంగాణ ప్రభుత్వ భాషా, సాంస్కృతిక శాఖ, సిగ్మా అకాడమీ ఆఫ్ ఫొటోగ్రఫీ సంయుక్త ఆధ్వర్యంలో ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ రంగాల్లో 6 నెలల పాటు ‘ఆఫ్, ఆన్‌లైన్’లో ఉచితంగా డిప్లొమా కోర్సుకు శిక్షణ ఇస్తున్నామని సిగ్మా అకాడమీ ఆఫ్ ఫొటోగ్రఫీ ఛైర్మన్ ఎంసీ.శేఖర్ సోమవారం తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు సెల్ నంబర్లు 80080 21075, 70956 92175లో సంప్రదించి ఈ నెల 30లోపు పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.
Sorry, no posts matched your criteria.