RangaReddy

News May 11, 2024

HYD: గడిచిన 24 గంటల్లో రూ.6,89,05,563 సొత్తు సీజ్

image

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా HYDలో ఏర్పాటు చేసిన వివిధ ఎన్ఫోర్స్‌మెంట్ బృందాల ద్వారా గడిచిన 24 గంటల్లో రూ.34,28,500 నగదు సీజ్ చేసినట్లు HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. రూ.6,54,77,063 విలువ గల ఇతర వస్తువులు, 126.70 లీటర్ల మద్యాన్ని పట్టుకుని సీజ్ చేసి, 9 మందిపై కేసులు నమోదు చేసి ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

News May 11, 2024

HYD: యజమాని మృతి.. విశ్వాసం చాటుకున్న పెంపుడు కుక్క

image

ఓ పెంపుడు కుక్క తన విశ్వాసం చాటుకుంది. HYD మేడ్చల్ పరిధి కిష్టాపూర్‌లో ఉండే కొడతల వెంకటేశ్ (45) శుక్రవారం గుండెపోటుతో మరణించాడు. అయితే యజమాని చనిపోవడంతో పెంపుడు కుక్క వెంకటేశ్ అంత్యక్రియల్లో పాల్గొని అక్కడే ఉండిపోయింది. అంత్యక్రియలు చేసిన చోట తిరుగుతూ స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ శునకాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.       

News May 11, 2024

HYD: BRSను లేకుండా చేయాలని కాంగ్రెస్, BJP ప్లాన్: KTR

image

తెలంగాణ గొంతుకైనా BRSను లేకుండా చేయాలని కాంగ్రెస్, BJP కలిసి ప్లాన్ వేశాయని మాజీ మంత్రి KTR ఆరోపించారు. HYD యూసుఫ్‌గూడలో ఈరోజు నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, BJP కలిసి ముందు BRSను లేకుండా చేయాలని, ఆ తర్వాత మనం గొడవపడదామని బండి సంజయ్ అన్న ఓ వీడియోను ఆయన సభలో చూపించారు. ఆ పార్టీలు తెలంగాణకు చేసిందేమీ లేదని, కానీ ఎన్నికలు రాగానే ఢిల్లీ, గుజరాత్ నుంచి నేతలు వస్తున్నారన్నారు.

News May 11, 2024

రంగారెడ్డి: పోలింగ్ నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు: కలెక్టర్

image

ఈసీ మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక శనివారం ఆదేశించారు. చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళలు, యువత, దివ్యాంగులను పోలింగ్‌లో భాగస్వామ్యం చేసేలా, ఆ సందేశం స్పష్టంగా తెలిసేలా మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి సదుపాయాలను సరిచూసుకోవాలన్నారు.

News May 11, 2024

చేవెళ్ల ప్రాంతంతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది: ప్రియాంకా గాంధీ

image

చేవెళ్ల ప్రాంతంతో నాకు ప్రత్యేక అనుబంధం ఉందని AICC ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి మద్దతుగా తాండూరులో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. చేవెళ్ల ప్రాంతం ఇందిరాగాంధీకి ప్రేమను పంచిందని తెలిపారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వానికి ప్రజలు సహకరించారని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేలా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

News May 11, 2024

HYD: 10 ఎంపీ సీట్లు తప్పక గెలుస్తున్నాం: అమిత్‌ షా

image

మిగులు బడ్జెట్‌ రాష్ట్రం ఇప్పుడు అప్పులపాలైందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ అప్పులు చేసినట్లే కాంగ్రెస్‌ కూడా చేస్తోందని ఆరోపించారు. శనివారం HYDలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఈ పదేళ్లలో తెలంగాణకు రూ.లక్షల కోట్ల నిధులు ఇచ్చామని, తెలంగాణలో 10 ఎంపీ సీట్లు తప్పక గెలుస్తున్నాం. 11 చోట్ల విజయావకాశాలు ఉన్నాయి’’ అని అన్నారు.

News May 11, 2024

HYD: రిజర్వేషన్ల రద్దుకు BJP కుట్ర: CM రేవంత్‌రెడ్డి

image

దేశం సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలనే లక్ష్యంతో బీజేపీ ఈ ఎన్నికల్లో ముందుకెళ్తోందని ఆరోపించారు. రిజర్వేషన్ల రద్దు ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. శనివారం HYD పటాన్‌చెరులో కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. 50 వేల మెజారిటీతో నీలం మధును గెలిపించాలని కోరారు.

News May 11, 2024

హైదరాబాద్ తెలంగాణకు వెన్నెముక: KCR

image

హైదరాబాద్.. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, ఇక్కడ మరిన్ని పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి పెంచాలి కానీ ఉన్న కంపెనీలు పోయేలా కాంగ్రెసోళ్లు చేయొద్దని KCR అన్నారు. పలు పరిశ్రమలు HYD నుంచి తరలివెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. KCRను తిట్టడం బంద్ చేసి తెలంగాణ అభివృద్ధిపై కాంగ్రెసోళ్లు దృష్టి సారించాలన్నారు. ప్రజలకు పనులు చేసి చూపించాలన్నారు. కరెంట్ కోతలతో ఇబ్బంది పెట్టొద్దన్నారు.

News May 11, 2024

HYD: KCRలాగానే రేవంత్ రెడ్డి ప్రమాదకారి: కిషన్ రెడ్డి

image

KCRలాగానే రేవంత్ రెడ్డి కూడా ప్రమాదకారి అని సికింద్రాబాద్ ఎంపీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. HYDలో ఆయన ఈరోజు మాట్లాడారు. అధికారం కోసం KCR, రేవంత్ రెడ్డి ఎంతకైనా తెగిస్తారని ఆరోపించారు. అబద్ధాలు ఆడడంలో ఇద్దరు నాయకులు ఆరితేరారన్నారు. గతంలో కాంగ్రెసోళ్ల అసమర్థత వల్లే పాకిస్థాన్‌కు అడ్డుకట్ట వేయలేకపోయారని, చివరకు సర్జికల్ స్ట్రైక్స్ గురించి ప్రూఫ్స్ అడిగే స్థాయికి రేవంత్ రెడ్డి దిగజారాడన్నారు.

News May 11, 2024

HYDలో కరెంట్ కట్.. KCR ఫైర్

image

HYDలో కరెంట్ కోతల విషయమై కాంగ్రెస్ ప్రభుత్వంపై KCR మండిపడ్డారు. ఈరోజు తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. మొన్న వర్షం కురిస్తే కొన్ని ప్రాంతాల్లో 6 నుంచి 8 గంటలు కరెంట్ కట్ చేశారని, చందానగర్‌లోనైతే 24 గంటలు కరెంట్ కట్ చేస్తే ప్రజలు సబ్‌స్టేషన్‌కి వెళ్లి ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఐటీ కేంద్రమైనా HYD బ్రాండ్ ఇమేజ్‌ను కాంగ్రెసోళ్లు చెడగొట్టొద్దని కోరారు.