RangaReddy

News May 7, 2024

HYD: ‘గడిచిన 24 గంటల్లో రూ.15,70,000 నగదు సీజ్’

image

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా HYDలో ఏర్పాటు చేసిన వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల ద్వారా గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.15,70,000 నగదు సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. రూ.7,57,711 విలువ గల ఇతర వస్తువులు, 127.58 లీటర్ల మద్యాన్ని పట్టుకుని సీజ్ చేసి, 11 మందిపై కేసులు నమోదు చేశామని, 9 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

News May 7, 2024

HYD: ఇంగ్లీష్ అండ్ ఫారన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో పీజీ

image

HYD తార్నాకలోని ఇంగ్లీష్ అండ్ ఫారన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఏడాది పాటు ఈ కోర్స్ కొనసాగుతుందని పేర్కొన్నారు. మే 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. యూనివర్సిటీకి వచ్చి ఆఫ్ లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చని, మిగతా వివరాలకు https://www.efluniversity.ac.in సంప్రదించాలని పేర్కొన్నారు.

News May 7, 2024

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 1,332 కేసులు నమోదు

image

ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 1,332 కేసుల్లో రూ.9,39,42,041 కోట్ల నగదుతో సహా మొత్తం రూ.41,81,11,904 విలువ చేసే బంగారు ఆభరణాలు, మద్యం సీసాలు, డ్రగ్స్ సీజ్ చేశారు. వీటిలో 8652 గ్రాముల బంగారం, 48,900 గ్రాముల వెండి, 48,810 లీటర్ల మద్యం పట్టుబడింది. రూ.50 లక్షలకు పైగా విలువ చేసే గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

News May 7, 2024

BREAKING: HYD: అల్వాల్‌లో MURDER

image

HYD అల్వాల్‌లో దారుణ హత్య ఘటన ఈరోజు వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. అల్వాల్ పరిధి భారతినగర్‌లో అర్ధరాత్రి బావమరిది యుగంధర్‌ను బావ సుబ్రహ్మణ్యం బండరాయితో కొట్టి చంపాడు. రక్తపు మడుగులో ఉన్న యుగంధర్ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి పరిశీలించి కేసు నమోదు చేశారు. సుబ్రహ్మణ్యం పరారీలో ఉండగా అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

News May 7, 2024

HYD: తెలంగాణలో కొడంగల్ ఒక్కటే ఉందా?: లక్ష్మారెడ్డి

image

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎల్బీనగర్ ప్రాంతానికి ఏం చేయలేదని BRS మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి రోడ్ షో ప్రోగ్రాంలో అన్నారు. కానీ.. కొడంగల్ ప్రాంతానికి రూ.3,500 కోట్లు కేటాయించారని, తెలంగాణలో కొడంగల్ ఒక్కటే ఉందా..? అని ప్రశ్నించారు. చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్ సంతోషిమాత టెంపుల్ నుంచి భవానీనగర్, విద్యుత్ నగర్, హనుమాన్ నగర్, ఇంద్రనగర్‌లో రోడ్ షో నిర్వహించారు.

News May 7, 2024

HYD: బాలికపై లైంగిక దాడి.. నిందితుడికి 20 ఏళ్ల జైలు

image

బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల శిక్షతోపాటు జరిమానా విధిస్తూ సోమవారం RR జిల్లా పోక్సో స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది. కోర్టు APP తెలిపిన వివరాలు.. HYD మీర్‌పేట్ PS పరిధిలో గతంలో ఓ బాలికను కొందరు అపహరించి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. అనంతరం ప్రధాన నిందితుడు చనిపోగా సహకరించిన కృష్ణకు కోర్టు శిక్ష విధించింది. 

News May 7, 2024

HYD: మరింత మెరుగ్గా పోల్ క్యూ రూట్ యాప్

image

పోల్ క్యూ రూట్ యాప్‌ను ఈసారి మరింత మెరుగ్గా అందుబాటులోకి తెస్తామని జీహెచ్ఎంసీ చెబుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ యాప్‌ను దాదాపు 1.5 లక్షల మంది ఉపయోగించారు. పోలింగ్ కేంద్రానికి దారి తెలుసుకోవడంతోపాటు అక్కడ ఓటర్లు ఎంతమంది బారులు తీరారనే వివరాలను పొందారు. దానికి తగ్గట్టుగా ఏ సమయంలో వెళ్తే త్వరగా ఓటు వేయొచ్చనే అంచనాతో ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు.

News May 7, 2024

HYD: రంగంలోకి దిగిన రేవంత్ రెడ్డి..!

image

రాజధాని పరిధిలోని మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఒక్కరే ముందుండి శ్రేణుల్లో జోష్ నింపుతూ సమరానికి సై అంటున్నారు. ఇప్పటికే నాలుగైదు సార్లు సర్వేలు చేయించారు. ఈనివేదికల ఆధారంగా సీఎం రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లతో శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. BRSను ఓడించి 3స్థానాల్లోనూ కాంగ్రెస్ గెలిచేలా వ్యూహాలు రచించారు.

News May 7, 2024

HYD: మోదీ రాక.. ట్రాఫిక్ ఆంక్షలు

image

ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో నేడు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం రాత్రి 7:50 గంటల మధ్య ప్రధాని బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. బుధవారం ఉదయం 8:35 నుంచి 9:10 గంటలకు ఇదే మార్గంలో బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆ సమయాల్లో ఈ మార్గంలో వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.

News May 7, 2024

HYD: రేవంత్‌రెడ్డి ఆటో డ్రైవర్లను మోసం చేశారు: కొండా 

image

సీఎం రేవంత్‌రెడ్డి ఆటో డ్రైవర్లను మోసం చేశారని బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. HYD శంషాబాద్‌‌లో సోమవారం భారతీయ మజ్దూర్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఎంపీగా గెలవగానే ఆటో డ్రైవర్లను ఆదుకుంటానని, ఆటో డ్రైవర్లకు బ్యాంకు రుణాలతో పాటు ఆవాస్‌ యోజన పథకం కింద సొంతింటి కల సాకారం చేస్తానని హామీ ఇచ్చారు.