India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రెండవ రోజు ఇంటర్మీడియట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 185 సెంటర్లలో 71,684 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా..70,431 మంది విద్యార్థులే హాజరయ్యారని అధికారులు తెలిపారు. 1,253 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. పరీక్షలు పూర్తైన అనంతరం ఆన్సర్ పేపర్లను స్ట్రాంగ్ రూమ్స్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో మన హైదరాబాద్ కల్చర్ వేరు. ఊర్లో 10 ఎకరాలు ఉంటే గొప్ప. ఇక్కడ 100 గజాల్లో సొంతిళ్లు ఉన్నా గొప్పే. ఉన్నదాంట్లో సంతోషంగా ఉండేది హైదరాబాదీలే అనిపిస్తది. పండుగలు, పబ్బాలకు బలగం ఏకమవుతుంది. కుల, మత భేదం లేకుండా దోస్తానా కోసం జాన్ ఇస్తరు. మాస్‌కు కేరాఫ్ ధూల్‌పేట గల్లీలైతే, క్లాస్‌కు కేరాఫ్‌గా IT కారిడార్. ఏకంగా లక్షల మందికి మన HYD ఉపాధినివ్వడం విశేషం.
We Proud to Be A Hyderabadi
HYDలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. స్థానికుల వివరాలు.. సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తరుణి సూపర్ మార్కెట్ వెనకాల రాత్రి ఘర్షణ జరిగింది. మద్యం మత్తులో స్నేహితుడు నగేశ్‌ను నర్సింగ్ అనే వ్యక్తి కర్రతో కొట్టి చంపేశాడు. ఈ సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని గాంధీకి తరలించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
BHEL జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మిస్తున్న కారణంగా ఈనెల 8న నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని HMWSSB అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎర్రగడ్డ, SRనగర్, HBకాలనీ, మూసాపేట, జగద్గిరిగుట్ట, కూకట్‌పల్లి, అశోక్‌నగర్, RCపురం, లింగంపల్లి, చందానగ, మదీనాగూడ, మియాపూర్, గంగారం, జ్యోతినగర్, బీరంగూడ, శ్రీనగర్, అమీన్‌పూర్, నిజాంపేట్‌లో అంతరాయం ఉంటుందన్నారు.
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు ఇంటర్మీడియట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 185 పరీక్ష కేంద్రాలలో జనరల్‌తో పాటు ఒకేషనల్ విద్యార్థులతో కలిపి 83,829 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని అధికారులు తెలిపారు. 1,863 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారన్నారు. పరీక్షలు పూర్తైన అనంతరం ఆన్సర్ పేపర్లను స్ట్రాంగ్ రూమ్స్‌కు తరలించినట్లు తెలిపారు.
HYDలో బీర్ సీసాలపై పాత ధరలే దర్శనమిస్తున్నాయని ఓ కస్టమర్ తెలిపారు. నాగోల్‌లోని వైన్ షాపులో బుధవారం బీఎస్ పాటిల్ అనే వ్యక్తి 2 బీర్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. MRP మాత్రం రూ.210గా ఉంది. ఇటీవల పెంచిన ధరల ప్రకారం రూ.250కి అమ్మినట్లు పేర్కొన్నారు. లేబుల్స్‌పై పాత ధరలు ఉండటం ఏంటని నిలదీస్తే వైన్స్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని వాపోయారు. మీప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేయండి.
రంగారెడ్డి జిల్లాలో ఎండలు మండుతున్నాయి. మొయినాబాద్ మండలంలో మంగళవారం అత్యధికంగా 39.2℃ ఉష్ణోగ్రత నమోదైంది. అటు కేశంపేట, ఫరూక్‌నగర్ 39.1, ఇబ్రాహింపట్నం, శంకర్‌పల్లి 39, యాచారం 38.9, తలకొండపల్లి 38.8, బాలాపూర్ 38.7, షాబాద్ 38.6, మహేశ్వరం 38.3, చేవెళ్ల 38.1, అబ్దుల్లాపూర్‌మెట్ 38.1, షంషాబాద్ 37.9, కందుకూర్ 37.5, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, సరూర్‌నగర్, హయత్‌నగర్, కడ్తాల్, మాద్గుల్లో 37℃గా నమోదయ్యాయి.
మలక్‌పేటలో శిరీష హత్య కేసులో మరో కోణం వెలుగుచూసింది. భర్త వినయ్ సోదరి సరిత హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. మత్తు మందు ఇచ్చి మర్డర్ చేసినట్లు నిర్ధారించారు. ఇది తెలిసి వినయ్ మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించాడు. గుండెపోటుతో చనిపోయిందని చిత్రీకరించాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
నగర శివారులో భూగర్భజలాలు తగ్గడంతో వాటర్ ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. ఇటువంటి సమయంలో శంకర్‌పల్లి, జన్వాడ, పూర్ణనంద ఆశ్రమం రోడ్, బాచుపల్లి తదితర ప్రాంతాల్లో బోర్లువేసి కొందరు నీటిని తోడేస్తున్నారు. దీనివలన ఆయా ప్రాంతాల్లో లో ప్రెషర్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే, వట్టినాగులపల్లి, ఖానాపూర్ గ్రామాల్లో ఏకంగా 25 బోర్లను అధికారులు సీజ్ చేశారు.
ఇంటర్ పరీక్ష రాసే విద్యార్థులకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. చింతల్ బస్టాండ్ నుంచి రిడ్జ్ టవర్స్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సైతం ఈ ట్రాఫిక్‌లో చిక్కుకోవడం గమనార్హం. సంబంధిత అధికారులు ట్రాఫిక్‌ను ఎప్పటికప్పుడు క్లియర్ చేసేలా చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. ఎగ్జామ్ సమయంలో ప్రధాన సర్కిళ్ల వద్ద ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.