India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల వ్యాప్తంగా బక్రీద్ పండుగ ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మూడు రోజులపాటు పొట్టేళ్ల కొనుగోళ్లు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రధాన పట్టణాలు, మండల కేంద్రాల్లో నాలుగు రోజుల నుంచే పొట్టేళ్ల విక్రయాలు ఊపందుకోగా.. మరో రెండు రోజుల పాటు జరగనున్నాయి. ఒక్కో పొట్టేలు బరువుకు అనుగుణంగా రూ.10 వేల నుంచి రూ.22 వేల వరకు అమ్ముతున్నారు.
త్యాగానికి ప్రతీకైన ఈద్-ఉల్-అజ్ హ (బక్రీద్) పర్వదినాన్ని ఇస్లామిక్ కాలమానిని హిజ్రీ క్యాలండరు ఆఖరి నెల జిల్ హిజ్జాలోని పదో తేదీన ముస్లింలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ పండగను పురస్కరించుకుని సోమవారం ముస్లింలు ప్రత్యేక నమాజు చేసేందుకు HYD, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల వ్యాప్తంగా ఈద్గాలు, మసీదులు, మదర్సాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు చేయనున్నారు.
HYD ఖైరతాబాద్‌లో గణేశ్ ఉత్సవ వేడుకలను ఎప్పటిలాగే ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలోనే నిర్వహించనున్నట్లు సమితి ఛైర్మన్ సింగరి రాజ్ కుమార్ ప్రకటించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. 60 ఏళ్లుగా తామే వేడుకలు చేస్తున్నామని, ఖైరతాబాద్ శ్రీగణేశ్ ఉత్సవ సమితి పేరిట ఉన్న వారితో తమకు సంబంధం లేదన్నారు. MLA దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి సమక్షంలో ఈరోజు సాయంత్రం 5 గంటలకు కర్ర పూజ చేస్తామని తెలిపారు.
బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మీ సోమవారం ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. దైవభక్తి, త్యాగ నిరతికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారని అన్నారు. అల్లా అనుగ్రహం తెలంగాణ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆమె ఈ సందర్భంగా ఆకాంక్షించారు. భిన్న సంస్కృతులకు నిలయమే మన హైదరాబాద్ అని కొనియాడారు.
బక్రీద్ సందర్భంగా సెలవు కావడంతో నేడు (సోమవారం) ప్రజావాణి ఉండదని జీహెచ్ఎంసీ ఇన్‌ఛార్జ్ కమిషనర్ ఆమ్రపాలి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆమె కోరారు. అలాగే HYDలోని ప్రసిద్ధ సాలార్‌జంగ్ మ్యూజియానికి కూడా సెలవు ఉంటుందని పరిపాలన అధికారి నాగేశ్వరరావు తెలిపారు.
లయబద్ధమైన నాట్యాంశాలకు వైవిధ్యభరితంగా నర్తించిన కవల కళాకారులు పావులూరి రవీనా, రిషిత ఆహుతులను రంజింపజేశారు. ఆదివారం HYD తెలుగు వర్సిటీలోని ఆడిటోరియంలో ప్రముఖ నాట్య గురువు పసుమర్తి రామలింగ శాస్త్రి శిష్యులు రవీన, రిషిత భరతనాట్యంలో అరంగేట్రం చేశారు. పుష్పాంజలి, గణేష పంచరత్నం, జతిస్వరం, శబ్దం, పాదవర్ణం, కీర్తనం, తిల్లాన, మంగళం తదితర అంశాల్లో నర్తించి ఆకట్టుకున్నారు.
గ్రేటర్ HYDలో భయంకరమైన ధార్ గ్యాంగ్ వరుస చోరీలకు పాల్పడుతోంది. తాజాగా హయత్‌నగర్‌లో ఒకేసారి 5 ఇళ్లల్లో చోరీలకు పాల్పడింది. దివ్యాంగులు, భిక్షగాళ్లు, పని మనుషుల్లా నటిస్తూ వస్తారని, రెక్కీ నిర్వహించి రాత్రవగానే ఇళ్లలోకి చొరబడతారని పోలీసులు తెలిపారు. అడ్డొచ్చిన వారిని చంపేసేందుకు సైతం వెనకాడరని హెచ్చరించారు. కాలనీల్లో భద్రతా సిబ్బంది నియామకం, సీసీ కెమెరాల ఏర్పాటు వంటివి చేసుకోవాలన్నారు. SHARE IT
గ్రేటర్‌లో 9,103 కిలోమీటర్ల మేర రహదారులున్నాయి. 1,302 కిలోమీటర్ల మేర వరద ప్రవాహ వ్యవస్థ ఉంది. అభివృద్ధి చెందిన నగరాల్లో రహదారులకు ఇరువైపులా వరద నీటి ప్రవాహ వ్యవస్థ ఉంటుంది. కానీ, HYD నగరంలో ఆ పరిస్థితి లేదు. ఇటీవలే గంటసేపు కురిసిన వానకు వర్షపు నీరు రోడ్ల పై నిలిచింది. వరద ఏరులై పారుతోందని, ఇబ్బందులు తప్పడం లేదన్న వివిధ కారణాలతో దాదాపుగా 158 ఫిర్యాదులు అందాయి.
హైదరాబాద్ CCSలో భారీగా బదిలీలు జరిగాయి. ఏకంగా 12 మంది ఇన్‌స్పెక్టర్లను మల్టీ జోన్-2కు బదిలీ చేస్తూ CP శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే రిపోర్ట్ చేయాలని అందులో పేర్కొన్నారు. బదిలీ అయిన ఇన్‌స్పెక్టర్ల వివరాలు: శివ శంకర్, రఘుబాబు, అప్పలనాయుడు, భూక్య రాజేశ్, సీత రాములు, హుస్సేన్ ధీరావత్, సత్యం, నాగేశ్వర్ రెడ్డి, ధీరావత్ కృష్ణ, కొత్త సత్యనారాయణ, SA ఇమన్యూల్, బిట్టు క్రాంతికుమార్.
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం డీఈఈసెట్-2024కు ఈనెల 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. HYD, RR, MDCL జిల్లాల్లోనూ జూలై 10న ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. దరఖాస్తు చేసే విద్యార్థుల వయస్సు సెప్టెంబర్ 1 నాటికి 17 ఏండ్లు పూర్తై ఉండాలన్నారు.
Sorry, no posts matched your criteria.