India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
2023-24 ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం శని, ఆదివారాలు (ఈనెల 30, 31 తేదీల్లో) తమ కార్యాలయాలు పని చేస్తాయని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) వెల్లడించింది. ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించేందుకు వీలుగా సంబంధిత బ్యాంకు శాఖలు పనిచేసేలా చూడాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇప్పటికే బ్యాంకులకు సూచించింది.
కాచిన నూనెలతో మళ్లీ వంటలకు వినియోగిస్తే
మెదడుకు ముప్పు తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలేయ, క్యాన్సర్తోపాటు ఇతర వ్యాధులకు దారితీసే అవకాశముందని స్పష్టం చేశారు. అమెరికన్ సొసైటీ ఫర్ బయో కెమిస్ట్రీ అండ్ మాలిక్యులర్ బయాలజీ వార్షిక సమావేశంలో ఈ అధ్యాయానికి సంబంధించిన నివేదికను వెల్లడించారు. ఈ పరిశోధనల్లో నూనెకు, మెదడు ఆరోగ్యానికి మధ్య ఉన్న సమస్యల గురించి వెల్లడైంది.
GHMC పరిధిలోని 4 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ కొత్త వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ప్రతినిధులు, MLAల బలం అవసరమని భావిస్తోంది. ఇప్పటికే చేరికలు ప్రారంభం కాగా.. ఈ నియోజకవర్గాల పరిధిలో మరికొంతమంది MLAలను పార్టీలో చేర్చుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం ఐదుగురు MLAలు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, ఎన్నికల ముందు మరికొందరు చేరే అవకాశం ఉందని సమాచారం.
వ్యభిచార గృహంపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేసిన ఘటన ఉప్పల్ PS పరిధిలో జరిగింది. ఎస్ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. సురేష్ అనే ఆర్గనైజర్ విజయపురి కాలనీలో ఇల్లును అద్దెకు తీసుకున్నాడు. అక్కడ ఓ మహిళ(30)తో వ్యభిచారం నడిపిస్తున్నాడు. కస్టమర్ వ్యభిచార గృహంలో ఉండగా.. మల్కాజిగిరి SOT పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఆర్గనైజర్ సురేశ్ పరారీలో ఉన్నాడు. ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాండూరులో నకిలీ RMP డాక్టర్‌గా చెలామణి అవుతూ, ఓ మహిళను నగ్నంగా వీడియోలు తీసిన కేసులో నిందితుడు అహ్మద్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. అహ్మద్‌ను తన క్లినిక్‌కు వచ్చే మహిళలతో అసభ్యంగా ప్రవర్తించేవాడని, ఈ క్రమంలో ఓ మహిళతోనూ అసభ్యంగా వ్యవహరించి వీడియో తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేశాడన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అహ్మద్‌ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
గ్రేటర్ HYD, ఉమ్మడి RR జిల్లాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. శుక్రవారం మూసాపేటలో గరిష్ఠంగా 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కుత్బుల్లాపూర్‌లో 42 డిగ్రీలు, ఖైరతాబాద్ 41.5, హయత్ నగర్ 41.7, చందానగర్ 41.5, శేరిలింగంపల్లి 41.2, యూసుఫ్ గూడలో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి నేడు కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారు. బంజారాహిల్స్‌లోని మేయర్ క్యాంప్ ఆఫీస్‌లో సాయంత్రం 6 గంటలకు CM రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షీ సమక్షంలో హస్తం కండువా కప్పుకోనున్నారు. ఇదిలా ఉంటే ఆమెతోపాటు మరికొందరు కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నేతలు సైతం పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ పార్టీ మారే నేతలు ఎవరనేది గ్రేటర్ రాజకీయల్లో సర్వత్రా ఉత్కంఠగా మారింది.
ఎయిర్‌గన్ తలకు పెట్టి బెదిరించిన ఇద్దరిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం ACP వెంకటేశ్వరరావు కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 27న మీర్‌చౌక్ PS పరిధి ఎతేబర్ చౌక్‌లోని పెట్రోల్ బంకులో భక్షి అలీ, జాహి అనే ఇద్దరు సిబ్బందితో గొడవపడ్డారు. ఈ క్రమంలోనే తమ వద్ద ఉన్న ఎయిర్‌గన్ తీసి చంపేస్తామని బెదిరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు ACP తెలిపారు.
పార్టీ మార్పు అంశంపై BRS రాజేంద్రనగర్ MLA క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో జరిగిన చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి హాజరుకాకపోవడంతో ప్రకాశ్ గౌడ్ పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరిగింది. సాయంత్రం ఈ వ్యవహారంపై ఆయన స్పందించారు. ‘మార్చి 31న మనవరాలి పెళ్లి ఉంది. పనుల్లో బిజీగా ఉండడంతో రాలేకపోయాను. అంతమాత్రాన ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం తగదు’ అంటూ ప్రకాశ్ గౌడ్ హెచ్చరించారు.
KTR ప్రధాన అనుచరుడు అలిశెట్టి అరవింద్ కాంగ్రెస్‌లోకి వెళుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. తన రాజకీయ గురువుగా భావించే KK సైతం పార్టీని వీడటంతో అరవింద్ కూడా హస్తం వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమం నుంచి BRS పార్టీ, KTR వెంట నడిచిన అలిశెట్టి ప్రస్తుతం రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆయన అనుచరులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.