India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD నగరంలోని NIMS ఆస్పత్రిలో వైద్య సేవల లిస్టును అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు చర్మ సంబంధ వ్యాధులు, జీర్ణాశయ సంబంధ వ్యాధులు, మహిళా సంబంధిత వ్యాధులకు వైద్యం అందిస్తామని తెలిపారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ అవుట్ పేషెంట్ సేవలు సైతం సోమవారం నుంచి శనివారం వరకు అందిస్తామన్నారు. మిగతా అవుట్ పేషెంట్ సేవల లిస్టును పట్టికలో చూడొచ్చు.
HYD చిలకలగూడ PS పరిధిలో ప్రమాదం జరిగింది. బంగ్లాపై నుంచి పడి ఇంటర్ స్టూడెంట్ మృతి చెందారు. SI జ్ఞానేశ్వర్ కథనం ప్రకారం.. మెట్టుగూడకు చెందిన రాపోలు సురేశ్‌కు ఇద్దరు కూతుళ్లు, ఇంటర్ చదువుతున్న ఒక కుమారుడు రాహుల్ (17) ఉన్నారు. రాహుల్ తన నలుగురు ఫ్రెండ్స్‌తో కలసి భవనంపైకి వెళ్లి పార్టీ చేసుకున్నారు. ప్రమాదవశాత్తు 5వ ఫ్లోర్ నుంచి ఒకటో ఫ్లోర్‌లో పడి తీవ్రగాయాలతో చనిపోయాడు. కేసు నమోదైంది.
శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఇంటెలిజెన్స్ అధికారులకు ఓ ఆగంతకుడు బాంబు పెట్టామని లేఖ పంపాడు. మెయిల్ చూసిన అధికారులు భద్రత సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎయిర్ పోర్ట్‌లో తనిఖీలు చేసిన సిబ్బంది అది ఆకతాయి పని అని తేల్చారు. మెయిల్ పంపిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఒక్కసారిగా సిబ్బంది తనిఖీలు చేయడంతో ప్రయాణికులు కాస్త కంగారు పడ్డారు.
మేడ్చల్ మండలం డబిల్‌పూర్ గ్రామంలోని హనుమాన్ గుట్టపై ఉన్న సీతారాముల ఆలయంలో దుండగులు <<13461450>>విగ్రహాలను ధ్వంసం<<>> చేసిన విషయం తెలిసిందే. కాగా విషయం తెలుసుకున్న RSS, విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. పోలీసులు వచ్చి ఘటనా స్థలంలో పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎత్తిపోతల ద్వారా HYD నగరానికి గోదావరి జలాల తరలింపు ప్రక్రియ మొదలుకానుంది. బుధవారం నుంచి ఎల్లంపల్లి రిజర్వాయర్ నుంచి అత్యవసర పంపింగ్‌తో నగరానికి రోజూ 168 ఎంజీడీల వాటర్‌ను తరలించనున్నారు. ఈ సందర్భంగా ఏడు పంపులను అధికారులు సిద్ధం చేసి ట్రయల్ రన్ పూర్తి చేశారు. బుధవారం నుంచి పూర్తి స్థాయిలో ఎమర్జెన్సీ పంపింగ్‌కు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
HYD రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులకు అడుగులు వేగంగా పడుతున్నాయి. ఉత్తర, దక్షిణ భాగాలుగా నిర్మించే దీనికి అయ్యే మొత్తం వ్యయంపై అధికారులు ఒక అంచనాకు వచ్చారు. 2 భాగాలు కలిపి మొత్తం 350 కిలోమీటర్ల మేర నిర్మాణం కానున్నట్లు లెక్కగట్టారు. తొలుత నిర్మాణం చేపట్టే ఉత్తర భాగం రహదారికి ఆగస్టు రెండో వారంలో టెండర్లకు వెళ్లాలని నిర్ణయించారు. దక్షిణ భాగం అలైన్‌మెంట్‌పై NHAI అధికారులు చర్చలు జరుపుతున్నారు.
హైదరాబాద్ మెట్రో రైల్ భవన్‌కి ఎంపీ రఘునందన్ ఈరోజు వచ్చారు. బేగంపేట్‌లోని మెట్రో స్టేషన్‌లో మెట్రో రైల్ ఎండీ NVS రెడ్డిని ఎంపీ రఘునందన్ రావు కలిసి వినతిపత్రం అందజేశారు. మియాపూర్ నుంచి పటాన్‌చెరుకు, అక్కడి నుంచి సంగారెడ్డికి మెట్రో రైల్‌ను విస్తరించాలని మెట్రో రైలు ఎండీని మెదక్ ఎంపీ రఘునందన్ రావు కోరారు. దీనికి ఎండీ NVS రెడ్డి సానుకూలంగా స్పందించారు.
GHMC పారిశుద్ధ్య విభాగం ఏడాదికోసారి నగరంలోని రోడ్లపై చెత్త డబ్బాలను ఏర్పాటు చేస్తోంది. అందుకు దాదాపు రూ.3కోట్లు వెచ్చిస్తోంది. ఏర్పాటు చేశాక నిర్వహణను అధికారులు గాలికొదిలేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ వద్ద డబ్బాల్లోని చెత్తను ఎవరూ తొలగించలేదు. కొన్నేళ్లుగా ఇలానే వ్యర్థాలను ఉంచారు. GHMC, రాంకీ సంస్థలు నువ్వంటే నువ్వని చెప్పుకొంటూ బాధ్యతను విస్మరిస్తున్నాయి.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు GHMCలో విలీనం చేస్తారా.. లేదా అనే విషయమై స్థానిక ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఓ వైపు కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు అంటూ ఓటర్ల జాబితా సవరణకు అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు త్వరలో విలీనం అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలు చేశాయి. అయితే ఎన్నికల ప్రక్రియ చేపట్టేందుకు కంటోన్మెంట్ బోర్డు యంత్రాంగం సిద్ధమవుతోంది. దీంతో స్థానికంగా అర్థంకాని పరిస్థితి నెలకొంది.
HYD నార్త్ జోన్ డీసీపీగా సాధన రష్మీ పెరుమాళ్ బదిలీపై వస్తున్నారు. ప్రస్తుతం నార్త్‌జోన్ డీసీపీగా పనిచేస్తున్న రోహిణి ప్రియదర్శిని నిజామాబాద్ డిచ్‌పల్లి 7వ బెటాలియన్‌కు బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో ప్రస్తుతం హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా పనిచేస్తున్న సాధన రష్మీ పెరుమాళ్ నార్త్ జోన్ డీసీపీగా బదిలీ అయ్యారు. త్వరలో ఆమె బాధ్యతలు చేపట్టనున్నట్లు పోలీస్ సిబ్బంది తెలిపారు.
Sorry, no posts matched your criteria.