India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD CCSలో పని చేస్తున్న ఇన్‌స్పెక్టర్ సీహెచ్.సుధాకర్ ఈరోజు రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఓ వ్యక్తిపై నమోదైన కేసుకు సంబంధించి అతడికి అనుకూలంగా విచారణ చేసేందుకు రూ.15 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారని తెలిపారు. అందులో మొదట విడతగా రూ.5 లక్షలు తీసుకోగా ఈరోజు మరో రూ.3 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్నామని వెల్లడించారు.
వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన ఈరోజు HYD పంజాగుట్ట పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పంజాగుట్టలోని ఓ ప్రముఖ హోటల్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు వెళ్లి దాడులు చేశారు. నిర్వాహకురాలు సూర్యకుమారి సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.89వేల నగదు, 18 సెల్‌ఫోన్లు సీజ్ చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
రేపు ప్రపంచ రక్త దాన దినోత్సవం సందర్భంగా ఈరోజు HYD ఖైరతాబాద్‌లోని సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ బ్లడ్ బ్యాంక్ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అన్ని కేంద్రాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్‌లను నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు.
HYD, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మరో 2 గంటలు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు వెళ్లాలని అధికారులు సూచించారు. SHARE IT
సివిల్ సర్వీసెస్ పరీక్షలకు(2025) సన్నద్ధమయ్యే అభ్యర్థులకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ HYD రాజేంద్రనగర్‌లోని ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి పేర్కొన్నారు. పూర్తి వివరాలకు https://studycircle.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో చూడాలన్నారు. SHARE IT
రాత్రి సమయంలో హయత్ నగర్ శివారు రాచకొండ కమిషనరేట్ పరిసర ప్రాంతాల్లో ధార్ అనే భయంకరమైన ముఠా సంచరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఈ గ్యాంగ్ ఐదుగురికి పైగా దొంగల ముఠాగా ఏర్పడి శివారు ప్రాంతాల్లో రాత్రి దొంగతనాలు చేస్తారు. ఇంట్లోకి ప్రహరీ ద్వారా ప్రవేశించి డోర్ కొట్టి ఇంట్లో వారిని హత్య చేసి మరీ దోచుకెళ్తారని పోలీసులు చెప్పారు. నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జేఎన్‌టీయూ ప్రవేశాల విభాగంలో జరుగుతున్న మొదటి ఫేజ్ ఈ-సెట్ ధ్రువ పత్రాల పరిశీలన బుధవారంతో ముగిసింది. చివరి రోజు మొత్తం 480 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 450 మంది హాజరయ్యారని ప్రవేశాల విభాగం డైరెక్టర్ డాక్టర్ కృష్ణమోహన్ రావు తెలిపారు. రెండో ఫేజ్ ధ్రువపత్రాల పరిశీలన వచ్చే నెల 17 నుంచి మొదలవుతుందన్నారు. మొదటి ఫేజ్ సీట్ల కేటాయింపు తర్వాత మిగిలిన సీట్ల భర్తీ రెండో ఫేజ్‌లో జరుగుతుందన్నారు.
ఓ బాలికను లైంగికంగా వేధించి, చివరికి బెదిరింపులతో తన వాంఛను తీర్చుకున్న వ్యక్తిని నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ చంద్రశేఖర్ కథనం ప్రకారం..నారాయణగూడ PS పరిధిలో 7వ తరగతి చదువుతున్న ఓ బాలికను హిమాయత్ నగర్ నివాసి ప్రియదర్శి కుమార్ సైగల్ కొంత కాలంగా లైంగికంగా వేధించాడు. మూడు సార్లు అత్యాచారం చేశాడు. ఈ విషయమై బాలిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ప్రియదర్శికుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఫాస్ట్ బౌలర్ల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ప్రత్యేకంగా టాలెంట్ హంట్ నిర్వహిస్తోందని కార్యదర్శి దేవ్‌రాజ్ తెలిపారు. ఈ నెల 22న ఉప్పల్ స్టేడియంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టాలెంట్ హంట్‌ను నిర్వహించనున్నామని చెప్పారు. ఆసక్తి గల క్రికెటర్లు వచ్చే శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి తమ పేర్లను హెచ్‌సీఏ అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని చెప్పారు.
హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో వర్షాకాలం నేపథ్యంలో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. వర్షాకాలం నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముందస్తు చర్యలపై చర్చించారు. డీఆర్ఎఫ్ సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.