India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నేడు HYD బన్సీలాల్‌పేట్, చిలకలగూడ-44, చార్మినార్, షేక్‌పేట్, ఖైరతాబాద్‌లో-43.8 గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిప్పులుగక్కుతున్న మండుటెండల్లోనూ HYD నడిబొడ్డున చార్మినార్, అబిడ్స్, గుల్ మోహర్ బజార్ తదితర ప్రాంతాల్లో కార్మికులు తోపుడుబండ్లపై కొరియర్ సర్వీస్ పనిలో చెమటోడుస్తున్నారు. పొట్టకూటి కోసం పట్టణానికి వచ్చిన తమకి, ఎండలోనూ పనిచేయక తప్పడం లేదంటూ పలువురు అభిప్రాయపడ్డారు.
ఆరు గ్యారంటీల పేరిట ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు ఓటుతోనే బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి KTR పిలుపునిచ్చారు. ఈరోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధి అన్నానగర్‌లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. కంటోన్మెంట్‌లో నివేదిత, మల్కాజిగిరిలో రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరారు. హామీలు అమలు చేయకముందే.. చేసినట్లు మెట్రో పిల్లర్లకు బ్యానర్లు కట్టడం ఏంటని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు.
దేశంలోనే అతి పెద్దదైన మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఓ మినీ ఇండియా లాంటిది. దాదాపు 40 లక్షల వరకు ఓటర్లు ఉన్న పార్లమెంట్ స్థానంలో BRS, కాంగ్రెస్, BJP మధ్య రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. కార్నర్ మీటింగ్స్, గడపగడపకు ప్రచారం, రోడ్డు షోలతో ముందుకు వెళ్తున్నారు. BRS నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీతామహేందర్ రెడ్డి, బీజేపీ నుంచి ఈటల రాజేందర్ బరిలో ఉండగా ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో మహిళలు, బాలికలు, అమ్మాయిలను ఇబ్బంది పెడుతూ.. వెంబడించే పోకిరీల భరతం పడతామని షీ టీం పోలీసులు అన్నారు. కేవలం 15 రోజుల్లోనే 133 మంది ఆకతాయిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారందరికీ కౌన్సిలింగ్ అందించారు. మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చని సీపీ తరుణ్ జోషి తెలిపారు. మహిళలను వేధించే పోకిరీలను వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
పెళ్లి పేరుతో ఓ యువతిని మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన HYD వనస్థలిపురం PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికంగా ఉండే ఓ సంస్థలో యువతితోపాటు యువకుడు పనిచేస్తూ ఆమెతో స్నేహపూర్వకంగా మెలిగాడు. ఆమెను పెళ్లి చేసుకుంటా అని చెప్పి లోబరుచుకున్నాడు.ఆ సమయంలో కొన్ని ఫొటోలు తీశాడు. పెళ్లి గురించి ఆమె అడగగా నిరాకరించి, ఫొటోలు వైరల్ చేస్తా అని బెదిరించడంతో PSలో ఫిర్యాదు చేసింది.
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడటం, ప్రజలకు మరింత భద్రత కల్పించడంలో ఇదొక భాగమని అన్నారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్‌ల వద్ద పకడ్బందీ భద్రత చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
ప్రధాని మోదీపై కాంగ్రెస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బంజారాహిల్స్‌లోని లేక్ వ్యూ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బూత్ కార్యకర్తల సమావేశంలో దానం నాగేందర్ మాట్లాడుతూ.. మహిళలకు మంగళసూత్రం ఎంత విలువైనదో, భార్య వదిలిపెట్టిపోయిన మోదీకి ఏం తెలుసు అంటూ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీపై మోదీ దుష్ప్రచారం మానుకోవాలని అన్నారు.
HYD మల్కాజిగిరి వసంతపురి కాలనీకి చెందిన నవీన్ కుమార్ అనే వ్యక్తికి ఏకంగా రూ.1,75,173 కరెంటు బిల్లు వచ్చిందని వాపోయాడు. జీరో బిల్లు రావాల్సిన అతడికి రూ.లక్షల్లో బిల్లు రావడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఈ విషయమై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసేందుకు వెళితే వారు స్పందించడం లేదని బాధితుడు తెలిపాడు. అంతకుముందు రెండు నెలల్లో ఒకసారి రూ.600, మరోసారి రూ.1,438 బిల్లు వచ్చినట్లు తెలిపారు.
ఓ మహిళ మృతదేహం కలకలం సృష్టించిన ఘటన HYD బాలాపూర్ PS పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలాపూర్ ఉస్మాన్ నగర్ చెరువులో 30-40 ఏళ్ల వయసు గల ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం కుళ్లిన స్థితిలో ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి పరిశీలించి, ఆమె ముస్లిం మహిళగా అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
BRS సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని అంబర్‌పేట్ MLA కాలేరు వెంకటేశ్ అన్నారు. శనివారం గోల్నాకలో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అసత్య ప్రచారంతో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ప్రజల్లో మార్పు మొదలైందని, కాంగ్రెస్ వద్దు.. BRS కావాలంటున్నారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో BRS వైపే ప్రజలు ఉన్నారని అన్నారు.
Sorry, no posts matched your criteria.