India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYDలోని ప్రభుత్వ సిటీ కళాశాల(అటానమస్)లో తాత్కాలిక అతిథి అధ్యాపకుల నియామకానికి అర్హులైన అభ్యర్థులు ఈనెల 6వ తేదీ ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూకి హాజరు కావాలని ప్రిన్సిపల్ ఆచార్య పి.బాల భాస్కర్ తెలిపారు. బయో టెక్నాలజీ విభాగంలో ఖాళీగా ఉన్న 2 పోస్టులకు పోస్టు గ్రాడ్యుయేషన్‌లో 55 శాతం మార్కులున్న అభ్యర్థులు అర్హులని, పీహెచ్‌డీ, ఎం.ఫిల్, నెట్, స్లెట్ అదనపు అర్హతలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు.
హోమ్ ఓటింగ్ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా, హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో హోమ్ ఓటింగ్‌కు అర్హులైన 121 మందిలో 112 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. సికింద్రాబాద్ పరిధిలోని 385 మంది అర్హుల్లో 65 మంది తొలి రోజునే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పూర్తి పారదర్శకంగా అధికారులు హోం ఓటింగ్ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు.
ఓయూ పరిధిలో మే 16 నుంచి డిగ్రీ వన్ టైమ్ ఛాన్స్ పరీక్షలు ప్రారంభంకానున్నట్లు కంట్రోలర్ ప్రొఫెసర్ రాములు తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ, ఇతర డిగ్రీ కోర్సులు చదివి ఫెయిలైన పూర్వ విద్యార్థులకు పరీక్ష రాసుకునేందుకు ఒక్క అవకాశం ఇచ్చిన విషయం విదితమే. వన్ టైమ్ ఛాన్స్ పరీక్షకు 15 వేల మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. వచ్చే వారం నుంచి హాల్ టికెట్లు జారీ చేయనున్నట్లు కంట్రోలర్ చెప్పారు. SHARE IT
సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంలో గెలిచిన పార్టీనే కేంద్రంలో అధికారం చేపడుతుందనే సెంటిమెంట్ ఉంది. 1998 నుంచి ఇలాగే జరుగుతోంది. ఈసారి ఇక్కడ సిట్టింగ్ MP కిషన్ రెడ్డి (BJP), దానం నాగేందర్ (INC), పద్మారావు గౌడ్ (BRS) పోటీ పడుతున్నారు. ముగ్గురూ బలమైన నేతలే కావడంతో పోరు రసవత్తరంగా ఉండనుంది. ఇక్కడ 12 సార్లు కాంగ్రెస్, 5 సార్లు BJP, ఓసారి తెలంగాణ ప్రజా సమితి పార్టీ గెలిచింది. ఈసారి సికందర్ ఎవరో మీ కామెంట్?
లోక్‌సభ ఎన్నికల అనంతరం మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టుపై కార్యాచరణ చేపట్టనున్నట్లు HYD మెట్రో రైల్ ఎండీ NVS రెడ్డి తెలిపారు. రెండో దశపై ఇప్పటికే DPRను సిద్ధం చేసినట్లు చెప్పారు. ఎన్నికల తర్వాత కేబినెట్ అనుమతి కోసం DPRను అందజేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం కేంద్రం ఆమోదంతో మెట్రో రెండో దశ పనులు ప్రారంభమవుతాయన్నారు. LB నగర్-శంషాబాద్ విమానాశ్రయం వరకు పనులను చేపట్టనున్నట్లు తెలిపారు.
HYDలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి చెందింది. SI శ్రీలత వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా మోరంచపల్లికి చెందిన సాయి అశ్రితరెడ్డి(22) మాదాపూర్‌లోని ప్రైవేటు హాస్టల్లో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. గురువారం బాచుపల్లిలోని తన స్నేహితురాలి వద్దకు వచ్చి తిరుగు ప్రయాణంలో ర్యాపిడో బుక్ చేసుకుంది. రాత్రి 12.30 గంటల సమయంలో JNTU సిగ్నల్ వద్దకు రాగానే లారీ ఢీకొని మృతి చెందింది.
చర్లపల్లి రైల్వే స్టేషన్ త్వరలో నూతన హంగులతో ప్రజలందరికీ అందుబాటులోకి రానుందని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలియజేశారు. ఈ మేరకు ఎలివేషన్ డిజైన్ సంబంధించిన ఫొటోను విడుదల చేశారు. ఇప్పటికే శరవేగంగా నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని, సకల హంగులతో నిర్మించినట్లు పేర్కొన్నారు. ఓ వైపు ఎలివేషన్, మరోవైపు ఫకాడే, పార్కింగ్ లాంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.
దేశంలోని అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజిగిరిలో అభ్యర్థుల గెలుపోటములకు పురుషుల ఓట్లే కీలకం కానున్నాయి. మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 37,79,596 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 19,45,624 కాగా.. మహిళా ఓటర్లు 18,33,430 మంది ఉన్నారు. నియోజకవర్గంలో మహిళా ఓట్ల కంటే పురుషుల ఓట్లు 1,12,194 అధికంగా ఉన్నాయి.
బర్త్‌డే సందర్భంగా కేక్ తెచ్చుకోవడానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందిన ఘటన HYD షాద్‌నగర్‌లో జరిగింది. పోలీసుల వివరాలు.. రతన్ కాలనీకి చెందిన బిజ్వి సందీప్ (16) బర్త్‌డే సందర్భంగా స్నేహితులతో కలిసి కేక్ కట్ చేయాలని గురువారం రాత్రి బయటికి వెళ్లాడు. కేశంపేట బైపాస్ చౌరస్తాలో రోడ్డు దాటుతుండగా జడ్చర్ల వైపు వెళ్తున్న వాహనం అతడిని ఢీకొంది. దీంతో సందీప్ అక్కడికక్కడే మృతి చెందాడు.
HYD జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు ఈ నెల 5 నుంచి 26 వరకు వేసవి సెలవులు ప్రకటిస్తూ ప్రిన్సిపల్ డాక్టర్ నరసింహారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మూడో ఏడాది వారికి మాత్రం ఈ నెల 6 నుంచి జూన్ 1 వరకు సెలవులు ఉంటాయని వివరించారు. వారు ఇంటర్న్‌షిప్ చేసేందుకు వీలుగా అదనంగా వారం రోజులు ఇచ్చినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.