India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజధానిలో చిన్నపాటి వర్షానికే చెరువుల్లా మారుతున్న రోడ్ల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపించబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో దీనిపై అధికారులు కార్యాచరణ రూపొందించారు. దీనికి సంబంధించిన పనులను పురపాలక శాఖ ఆధ్వర్యంలో బల్దియా అధికారులు మొదలుపెట్టి పూర్తి చేయబోతున్నారు. వర్షాలతో చెరువులుగా మారే ప్రాంతాల్లో దానికి సమాంతరంగా పెద్దసంపు తవ్వి నీటిని అందులోకి మళ్లించే ఏర్పాటు చేయనున్నారు.
యువతిని వేధిస్తున్న యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధుబాబు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం బోనకల్లు మండల కేంద్రానికి చెందిన గండమాల రాహుల్, HYDకు చెందిన ప్రనీశ్ స్నేహితులు. తన సోదరుడికి స్నేహితుడు కావడంతో ప్రనీశ్ సోదరి కొంతకాలం క్రితం రాహుల్‌తో సెల్ఫీ దిగింది. దీన్ని అదనుగా తీసుకుని రాహుల్ ఆ యువతికి అసభ్యకరమైన మెసేజ్‌లు పెడుతున్నాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.
ఫాస్ట్ బౌలర్ల కోసం HYD క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా టాలెంట్ హంట్ చేపడుతోంది. ఈ నెల 22న HYD ఉప్పల్ స్టేడియంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనుంది. ఆసక్తి గల క్రీడాకారులు తమ పేర్లను HCA అధికారిక వెబ్సైట్ http://www.hycricket.inలో నమోదు చేసుకోవాలని అసోసియేషన్ వివరించింది.
బక్రీద్ పండుగ సందర్భంగా HYDలో సందడి నెలకొంది. పాతబస్తీతో పాటు రాజేంద్రనగర్, పీడీపీ చౌరస్తా, నౌ నంబరు, ఉప్పర్‌పల్లి, సులేమాన్ నగర్, శాస్త్రిపురం, మైలార్‌దేవ్‌పల్లి, జూపార్క్ రోడ్, గోల్డెన్ హైట్స్, మౌలాలి, చెంగిచర్ల మేకల మండి, దేవరయాంజల్ తదితర ప్రాంతాల్లో వేల సంఖ్యలో గొర్రెలు, పొట్టేళ్లు అమ్మకానికి తీసుకొచ్చారు. బక్రీద్ నేపథ్యంలో ముస్లిం సోదరులు గొర్రెలను కుర్బానీ ఇస్తారు. మంచి గిరాకీ ఉంటుంది.
ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సిలింగ్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల అమలులో పలు అవకతవకలు జరిగాయని, జీఓ నంబర్ 550ని సక్రమంగా అమలు చేయకపోవడంతో 262 మంది విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు దక్కకుండా పోయాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. గుజ్జ కృష్ణ, టీ.రాజ్ కుమార్‌తో శనివారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి ఆయన వినతి పత్రం అందజేశారు.
✓గచ్చిబౌలి: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం విక్రమార్క
✓KCR పై కుట్రలను సహించబోము :BRSV
✓HYD: రూ.1.83 కోట్ల విలువైన మద్యం సీసాలు ధ్వంసం
✓ఈ నెల 17న ప్రజావాణి లేదు:GHMC కమిషనర్
✓రేపటి నుంచి రవీంద్రభారతిలో పెయింటింగ్ ఎగ్జిబిషన్
✓ఉప్పల్:చంద్రబాబు ప్రమాణ స్వీకారం మొక్కు తీర్చుకున్న నేతలు
✓HYD: నిజాం కాలేజీ స్టూడెంట్ ఆత్మహత్యాయత్నం
ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఎస్ఎల్‌వీ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ గురువర్యులు చింత నాగార్జున శిష్య బృందం కర్ణాటక గాత్ర కచేరి, కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. కర్ణాటక గాత్ర కచేరీలో చూడమ్మా సతులారా, భో శంభో, వేంకటేశుడు, తరతరాల తిరుమల, స్వాగతం కృష్ణ, గోదావరి అంశాలను కళాకారులు ఆలపించారు. నాగజ్యోతి శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు.
ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. వికారాబాద్‌కు చెందిన రవి HYDతార్నాకలోని ఓయూ హాస్టల్‌లో ఉంటూ నిజాం కాలేజీలో చదువుతున్నాడు. ఈ క్రమంలో ఈరోజు హాస్టల్ బిల్డింగ్ పై నుంచి అతడు దూకగా శబ్దం విన్న తోటి విద్యార్థులు వెంటనే వచ్చి రవిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. తలకు గాయమైందని, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
HYD ఖైరతాబాద్‌లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈనెల 17న ఉండదని GHMC ఇన్‌ఛార్జ్ కమిషనర్ ఆమ్రపాలి ఈరోజు తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించినందున ప్రజావాణి ఉండదని ఆమె స్పష్టం చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆమె కోరారు.
తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతి శాఖ సౌజన్యంతో పికాసో ది స్కూల్ ఆఫ్ ఆర్ట్ విద్యార్థుల పెయింటింగ్ ఎగ్జిబిషన్ రేపటి నుంచి మూడు రోజుల పాటు HYD రవీంద్రభారతిలో జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరుకానున్నారని నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి గల వారందరూ ఇందులో పాల్గొని ఎగ్జిబిషన్ చూడాలని కోరారు.
Sorry, no posts matched your criteria.