India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD ప్రాంతీయ రింగ్ రోడ్డు (RRR) పొడవు పెరిగింది. ఉత్తర భాగంలో 2.95 కి.మీ. మేర పెంచాలని తాజాగా అధికారులు నిర్ణయించారు. కాగా తాజా ఎలైన్‌మెంట్‌తో RRR ఉత్తర, దక్షిణ భాగాలు కలిపి 10.28 కి.మీ. పెరిగింది. దీంతో రెండు భాగాల విస్తీర్ణం 350.79 కి.మీ.కు చేరింది. అయితే గతంలో 340.51 కి.మీ. నిర్ణయించగా ఉత్తర, దక్షిణ భాగాల అనుసంధానం కోసం ఈ మార్పు అవసరమైందని అధికారులు తెలిపారు. ఈ మేరకు భూ సేకరణ చేయనున్నారు.
ఆదాయం పెంపు దిశగా జీహెచ్‌ఎంసీ మరో ముందడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో మరో 100 రోడ్లకు వాణిజ్య హోదా ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. గత సర్కారు 2021లో జీవో నెం.102 ద్వారా 118 రోడ్లకు వాణిజ్య హోదా ఇచ్చింది. పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న అధికారులు.. మరో వంద రోడ్లకు ఆ హోదా ఇవ్వొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి 100 అడుగులు, అంతకన్నా ఎక్కువ వెడల్పున్న రోడ్లకు ఇచ్చారు.
పందేలు ఓ ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన శంకర్‌పల్లి PS పరిధిలో జరిగింది. చెందిప్పకు చెందిన సురేందర్(45) ఈనెల 1న గ్రామానికి చెందిన ఇద్దరు స్నేహితులతో కలిసి సురేందర్ బయటకు వెళ్లారు. ఈ క్రమంలో సరదాగా మాట్లాడుకున్న స్నేహితులు పురుగు మందు తాగితే రూ.లక్ష ఇస్తామని సురేందర్‌తో పందెం కాశారు. దీంతో నిజంగానే పురుగు మందు తాగిన సురేందర్ ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
వికారాబాద్ జిల్లా యాలాల మండల పరిధిలో ఎదురుగా వస్తున్న మినీ డీసీఎం.. బైకును ఢీకొట్టడంతో జగ్గప్పకు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. అయితే గాయాలతో పడి ఉన్న తండ్రికి కొడుకు బ్రూస్లీ ధైర్యం చెప్పాడు. ‘నేనున్న.. నీకేం కాదు నాన్న’ అంటూనే కుటుంబీకులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. స్థానికులతో కలిసి తండ్రిని ఆస్పత్రికి తరలించే సమయంలో జగ్గప్ప తల నుంచి రక్తం రావడంతో బట్టతో అదిమి పట్టుకొని ఆసుపత్రికి తీసుకెళ్లాడు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు తెలిపారు. బీఈడీ మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫలితాలను విడుదల చేశామని చెప్పారు. ఫలితాలను ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
జలమండలి పరిధిలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై గతంలో నిర్వహించిన డయల్ యువర్ ఎండీ కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తున్నట్లు జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. శనివారం సాయంత్రం 4 నుంచి 5:30 గంటల వరకు సమస్యలను తెలుసుకుంటామన్నారు. మంచినీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణ ఇతర సమస్యలపై 23442881, 23442882, 23442883 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు.
రాష్ట్రంలో నెలకొన్న భూ వివాదాల పరిష్కారానికి త్వరలో రెవెన్యూ ట్రైబ్యునల్ ఏర్పాటుచేయనున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం హడావిడిగా, అధ్యయనాలు ఏవీ లేకుండా ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చిందని, దీనివల్ల ఎన్నో సమస్యలు ఉత్పన్నమయ్యాయని ఆరోపించారు. శుక్రవారం సచివాలయంలో ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి, సునీల్‌కుమార్, మధుసూదన్‌లతో మంత్రి భేటీ అయ్యారు.
అక్రమ మురుగు కనెక్షన్లపై జలమండలి దృష్టి సారించింది. KPHBలో తనిఖీలు ముమ్మరం చేసి లులు మాల్‌కు కనెక్షన్ లేదని గుర్తించి నోటీసులు జారీ చేశారు. లులు మాల్‌కు ముందు మంజీరామాల్-మంజీరా మెజిస్టిక్ హోమ్స్‌కు కలిపి ఒకటే ఏస్టీపీ ఉండేది. వేరుగా కనెక్షన్ తీసుకోవాలని మంజీరామాల్‌కు గతంలో జలమండలి అధికారులు తాఖీదులు ఇచ్చారు. ఇలా ఒకే కనెక్షన్‌తో ఏళ్లుగా జలమండలి రెవెన్యూ తగ్గిందని మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన గచ్చిబౌలి పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మనోజ్(24) కొత్తగూడ నీలం మెన్స్ పీజీలో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం బైకుపై వెళ్తూ మరో బైకును ఢీకొట్టాడు. ఇద్దరు కిందపడగా మనోజ్ తలకు గాయాలై మృతి చెందాడు. మరో బైకుపై ఉన్న సాయి(23)కి గాయాలుకాగా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్లే విశాఖ రైలు పలుమార్లు ఆలస్యంగా రావడం పట్ల ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. విశాఖ రైలు సమయపాలన పాటించేలా రైల్వే అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేశారు. ఒక్కోసారి రెండు గంటలకు పైగా ఆలస్యం జరుగుతుందని, అలాంటివి మరోసారి పునరావృతం కాకుండా చూడాలని కోరారు.
Sorry, no posts matched your criteria.