RangaReddy

News December 15, 2024

గ్రూప్ 2 ఎగ్జామ్: HYDలోని లైబ్రరీలు ఖాళీ

image

గ్రూప్ 2 ఎగ్జామ్‌తో HYDలోని లైబ్రరీలు, స్టడీ హాల్స్ వెలవెలబోయాయి. ఎప్పుడూ విద్యార్థులతో కళ కళలాడే చిక్కడపల్లి లైబ్రరీ ఖాళీగా దర్శనమిచ్చింది. రేపు కూడా పరీక్ష ఉంది. తమ సొంత జిల్లాలోనూ సెంటర్లు‌ ఉండడంతో అభ్యర్థులు ఒకరోజు ముందే ప్రయాణమయ్యారు. ఈ ప్రభావంతో అశోక్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్ తదితర కోచింగ్ సెంటర్ల వద్ద హడావిడి తగ్గింది. సోమవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగనుంది.

News December 15, 2024

ఆదివారం: HYDలో పెరిగిన చికెన్ ధరలు!

image

హైదరాబాద్‌లో ఆదివారం వస్తే చాలు ప్రజలు మాంసం షాపులకు క్యూ కడుతారు. ఈ డిమాండ్‌కు తగ్గట్టుగానే చికెన్ ధరలు పెంచారు. శనివారం రూ. 164(విత్ స్కిన్) నుంచి రూ. 196(స్కిన్‌లెస్) చొప్పున విక్రయించారు. ఆదివారం కిలో చికెన్ రూ.178(విత్ స్కిన్), రూ. 203(స్కిన్‌ లెస్‌)గా ధరలు నిర్ణయించారు. హోల్ సేల్ షాపుల్లో ఇదే ధరలు ఉన్నా.. రిటైల్ షాపుల్లో రూ. 5 నుంచి రూ. 15 ఎక్కువే ఉండొచ్చు. మీ ఏరియాలో ధరలు ఏవిధంగా ఉన్నాయి.?

News December 15, 2024

HYD గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచన

image

గ్రూప్‌-2కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. HYD‌లో 101, రంగారెడ్డి 90, మేడ్చల్‌ జిల్లాలో 116 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. వికారాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 30 సెంటర్లు ఉన్నాయి. ఇప్పటికే అభ్యర్థులను అధికారులు అప్రమత్తం చేశారు. ‘8:30AM నుంచే సెంటర్లలోకి అనుమతి. 10AMకు పరీక్ష. 9.30AMకి గేట్లు మూసివేస్తారు. నిమిషం ఆలస్యమైన లోపలికి అనుమతించారు.’ అని అధికారులు స్పష్టం చేశారు. ALL THE BEST
SHARE IT

News December 15, 2024

బిగ్‌బాస్ 8 ఫైనల్‌.. HYDలో భారీ బందోబస్తు

image

HYD వేదికగా నేడు బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్‌ జరగనుంది. గత సీజన్‌లో ఫైనల్ రోజు జరిగిన గొడవలను దృష్టిలో ఉంచుకొన్న పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ సెట్టింగ్ చుట్టూ 53 తాత్కాలిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని యాజమాన్యానికి పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రం ప్రత్యేకంగా 300 మందితో బందోబస్తు నిర్వహించాలని వెస్ట్ జోన్‌ పోలీసులు నిర్ణయించారు.

News December 14, 2024

చిలుకూరులో CM రేవంత్ రెడ్డి.. భారీ బందోబస్తు

image

చేవెళ్ల నియోజకవర్గంలో CM రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. శనివారం ఉదయం చిలుకూరు గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, MLA కాలే యాదయ్య ఆయనకు స్వాగతం పలికారు. పాఠశాల ఆవరణలో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలను రేవంత్ రెడ్డి ఆసక్తిగా తిలకించారు. CM రాకతో మొయినాబాద్ మండల వ్యాప్తంగా, సభ వద్ద పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు.

News December 13, 2024

HYD: జూ పార్క్ 13వ గవర్నింగ్ బాడీ సమావేశం

image

సచివాలయంలో జూపార్క్స్ అథారిటి ఆఫ్ తెలంగాణ 13వ గవర్నింగ్ బాడీ సమావేశం మంత్రి కొండా సురేఖ నిర్వహించారు. అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్ (హెచ్ఎఎఫ్ఎఫ్), చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఏలుసింగ్ మేరు, సీసీఎఫ్లు ప్రియాంక వర్గీస్, భీమా నాయక్, రామలింగం, డైరక్టర్ జూ పార్క్స్ సునీల్ ఎస్, హేరామత్, అధికారులు పాల్గొన్నారు.

News December 13, 2024

HYD: రాజీ పడితే ఇద్దరూ గెలుస్తారు: SHO

image

కొట్టుకుంటే ఇద్దరిలో ఒక్కరు మాత్రమే గెలుస్తారు. కానీ రాజీ పడితే ఇద్దరు గెలుస్తారని నానుడి. వివిధ కేసుల్లో కక్షిదారులుగా ఉన్నవారు రేపు జరిగే నేషనల్ లోక్ అదాలత్‌లో రాజీ పడదగిన కేసులను రాజీ చేసుకోగలరని హయత్‌నగర్ SHO నాగరాజు గౌడ్ సూచించారు. నేషనల్ లోక్ అదాలత్‌‌లో కేసులు రాజీ చేసుకోవడానికి ఎలాంటి ఖర్చు ఉండదన్నారు.

News December 13, 2024

HYD: అగ్నివీర్ల ట్రైనింగ్‌పై ప్రశంసలు

image

సికింద్రాబాద్ EME కేంద్రాన్ని సీనియర్ కల్నల్ కమాండెంట్ సిదాన సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ రకాల ట్రైనింగ్, అడ్మినిస్ట్రేషన్‌లను పరిశీలించారు. అనంతరం అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, బేసిక్ స్టాండర్డ్స్ మిలిటరీ ట్రైనింగ్, అగ్ని వీర్లకు అందిస్తున్న ట్రైనింగ్ విధానాన్ని ప్రశంసించారు. కార్యక్రమంలో వివిధ స్థాయి మిలిటరీ అధికారులు పాల్గొన్నారు.

News December 13, 2024

వికారాబాద్: ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు పరిశీలన 

image

ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన కార్యక్రమాన్ని ఈనెల చివరి వరకు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ ఆదేశించారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలనపై సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాలతో ప్రజాపాలన సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించడం జరిగిందన్నారు.  

News December 13, 2024

గుండుమల్: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్

image

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ రుచికరమైన భోజనం అందించాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు. శుక్రవారం కొడంగల్ నియోజకవర్గం గుండుమల్‌లోని జిల్లా పరిషత్ పాఠశాలతో పాటు ఆదర్శ పాఠశాలకు వెళ్లి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి సిబ్బందితో మాట్లాడుతూ.. విద్యార్థులందరికీ భోజనంతోపాటు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలని తెలిపారు.