India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతుంది. వికారాబాద్ జిల్లాలో ఇప్పటివరకు పోలీసులు ఇతర శాఖల అధికారులు సంయుక్త తనిఖీల్లో రూ.2,62,96,691 పట్టుబడింది. ఇందుకు సంబంధించి 95 కేసులు నమోదయ్యాయి. మద్యం సరఫరాకు సంబంధించి 148 కేసులు నమోదు కాగా.. రూ.10.83 లక్షల విలువచేసే 3,359 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు. వీటితో పాటు 338 గ్రాముల బంగారం, 5.12 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు.
చేవెళ్ల పార్లమెంట్‌లోని 7 నియోజకవర్గాల్లో మొత్తం 29,38,370 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లలో 18 నుంచి 39 ఏళ్లలోపు యువ ఓటర్లు మొత్తం 15,20,890 మంది ఉండగా.. 40-49 ఏళ్ల వయస్సు ఓటర్లు 6,07,268 ఉన్నారు. 50-59 ఏళ్ల వయస్సు ఓటర్లు 3,62,074, 60-69 ఏళ్ల వయస్సు ఓటర్లు 2,13,014, 70-79 వయస్సు ఓటర్లు 1,02,115, 80-89 ఏళ్ల వయస్సు ఉన్న ఓటర్లు 26,226 ఉండగా.. 90-99 ఏళ్ల వయస్సు ఓటర్లు 4,531 మంది ఉన్నారు.
ఉమ్మడి రంగారెడ్డిలో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రత 44 డిగ్రీలు దాటాయి. దీంతో జనం బయటకు రావడానికి జంకుతున్నారు. ఎండ తీవ్రతకు నార్సింగి నుంచి అప్పా జంక్షన్‌కు వెళ్లే ఔటర్ రింగ్ రోడ్డు నిర్మానుష్యంగా మారింది. మేడ్చల్ జిల్లా కీసరలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. కుల్కచర్ల మండలం పుట్టపహాడ్‌లో 44.3 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో 44.0 డిగ్రీలుగా నమోదైంది.
కాటేదాన్, బాబూల్ రెడ్డి నగర్లో ఓ గిడ్డంగిలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందడంతో శంషాబాద్ ఎక్సైజ్, టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేశారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు నల్లమందు స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. తనిఖీలో రూ.కోటి 60లక్షల విలువ చేసే నల్ల మందును గుర్తించారు. ఇద్దరిని అరెస్టు చేసి ఎన్డిపిఎస్ చట్టం కింద కేసు నమోదు చేసిన్నట్లు పోలీసులు తెలిపారు.
ఆటో ప్రయాణికులను దోచుకుంటున్న నలుగురు ముఠా సభ్యులను మీర్‌చౌక్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మూడు మొబైల్ ఫోన్లు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. చాంద్రాయణగుట్టకు చెందిన అబ్దుల్ ఖాజా ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కంచన్‌బాగ్‌కు చెందిన మహ్మద్ ఇంతియాజ్, ఫతేనగర్‌కు చెందిన ఎండి నవాజ్, షాహిన్ నగర్‌కు చెందిన గులాం హసన్ కలిసి ప్రయాణికులను దోచుకుంటున్నారు.
భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామంటూ సచివాలయం సమీపంలోని 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ముందు ఈనెల 4న ‘ఛలో నెక్లెస్‌రోడ్ ” పేరిట ఓ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్వహించనుందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈనెల 4న నిర్వహించే కార్యక్రమం విజయవంతం అయ్యేలా చూడాలని ఈ సందర్భంగా సిఎం రేవంత్ పార్టీ నేతలను కోరారు.
HYD దిల్‌సుఖ్‌నగర్ వద్ద ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ విద్యాసంస్థలు డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, పెయింటింగ్, మేకింగ్ కోర్సులు చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు స్కాలర్‌షిప్ పరీక్ష మే 19న జరుగుతుందని, ఆసక్తి గలవారు, విద్యాసంస్థలో సంప్రదించాలని సూచించారు.
HYD సిటీ సివిల్ కోర్టులో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కోర్టులో పనిచేసే ఉద్యోగులు రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బెయిల్‌కు సంబంధించిన పేపర్లు ఇవ్వడానికి లంచం డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. ఇద్దరు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గ్రేటర్ HYDలో పిల్లల ఆరోగ్య రక్షణ కోసం వ్యాక్సినేషన్ చేస్తున్నట్లు వైద్య అధికారులు తెలిపారు. గ్రేటర్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి బుధవారం చిన్నారులకు వ్యాక్సిన్లను ఉచితంగా పంపిణీ చేస్తారు. ప్రతి శనివారం అంగన్వాడీ కేంద్రాలు, నిలోఫర్ వంటి ప్రసూతి, చిన్నపిల్లల దవాఖానల్లో ప్రతిరోజు వ్యాక్సిన్లు, టీకాలను ఉచితంగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
HYD, ఉమ్మడి RRలో సామాజిక మాధ్యమాల్లో ప్రచార కార్యక్రమాలను అణువణువు పరిశీలించడానికి మీడియా మానిటరింగ్ బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో కలెక్టర్, అదనపు కలెక్టర్, పోలీస్ సిబ్బంది, సామాజిక మాధ్యమాల నిపుణుడు, మీడియా రిపోర్టర్, సీనియర్ సిటిజన్,జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి సభ్యులుగా ఉంటారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌కు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వ్యక్తికి నోటీసులు జారీచేసి చర్యలు తీసుకుంటారు.
Sorry, no posts matched your criteria.