RangaReddy

News May 2, 2024

ఉప్పల్‌లో SRH VS RR.. మెట్రో గుడ్ న్యూస్

image

HYD మెట్రో రైలు శుభవార్త చెప్పింది. ఈరోజు రా.1 గంట వరకు మెట్రో సేవలను అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకుంది. రాత్రి 12:15 గంటలకి చివరి ట్రైన్ ప్రారంభమై 1:10 గంటలకి గమ్యస్థానం చేరుకుంటుందని పేర్కొంది. ఉప్పల్ స్టేడియం, NGRI స్టేషన్లలో మాత్రమే ప్రవేశానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. ఉప్పల్ మార్గంలో మిగతా స్టేషన్ల‌లో ట్రైన్ దిగేవారికి అనుమతి ఉంటుందని, ఎక్కడానికి వీలు ఉండదని సృష్టం చేసింది.

News May 2, 2024

HYD: ట్యాంక్‌బండ్‌లో దూకిన యువకుడు.. కాపాడిన DRF

image

ట్యాంక్‌బండ్‌లో ఓ యువకుడి ప్రాణాలను GHMC DRF సిబ్బంది కాపాడారు. గురువారం ఉదయం అప్పర్‌ ట్యాంక్‌బండ్ మీదకొచ్చిన వంశీ అనే యువకుడు‌ నీళ్లలోకి దూకాడు‌. మునిగిపోతున్న‌ అతడిని గమనించిన DRF సిబ్బంది అప్రమత్తమయ్యారు. హుటాహుటినా ట్యాంక్‌బండ్‌లోకి దిగి అతడిని బయటకు తీసుకొచ్చారు. లేక్ పోలీసులకు అప్పగించారు. వ్యక్తిగత సమస్యల కారణంగా సూసైడ్‌కు యత్నించినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News May 2, 2024

HYD: కాంగ్రెస్‌ వైపే ప్రజలు: విజయారెడ్డి

image

ప్రజలంతా కాంగ్రెస్‌కు అండగా నిలవాలని, తమ పార్టీకి ఓటేసి గెలిపించాలని ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, కార్పొరేటర్ విజయారెడ్డి కోరారు. గురువారం కాంగ్రెస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్‌కు మద్దతుగా ఆమె ప్రచారం చేశారు. కాంగ్రెస్ గెలిస్తేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. BRS నేతలు ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని, తప్పకుండా గెలుస్తామని అన్నారు.

News May 2, 2024

సికింద్రాబాద్‌లో ఆయనదే రికార్డు..!

image

సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో BJP సీనియర్ నేత బండారు దత్తాత్రేయ 4 సార్లు గెలిచి రికార్డు సృష్టించారు. అంతే కాకుండా ఎన్నికలు, ఉప ఎన్నికలు కలిపి ఇక్కడ నుంచి ఎక్కువ సార్లు పోటీ చేసింది కూడా ఆయనే. 1991లో తొలిసారి గెలవగా 1998, 1999, 2014లో గెలిచి కేంద్ర మంత్రిగా పని చేశారు. 1984, 1996, 2004, 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1999లో వాజ్‌పేయి హయాంలో కేంద్ర సహాయ మంత్రిగా పని చేశారు.

News May 2, 2024

హైదరాబాద్‌లో గన్‌ కలకలం

image

హైదరాబాద్‌లో నాటు తుపాకీ కలకలం రేపింది. జీడిమెట్ల‌లో గురువారం సైబరాబాద్ SOT పోలీసులు తనీఖీలు చేపట్టారు. ద్విచక్రవాహనదారుడిని ఆపి సోదాలు చేయగా రివాల్వర్‌తో పాటు 3 బులెట్లు లభ్యమయ్యాయి. నిందితుడు జీడిమెట్ల అయోధ్యనగర్‌‌లో నివాసం ఉంటున్న విశాల్(మధ్యప్రదేశ్‌ వాసి)గా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొన్నారు. ARMS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 2, 2024

ఇది భాగ్యలక్ష్మి అమ్మవారి భాగ్యనగరం: BJP

image

‘ఇది భాగ్యలక్ష్మి అమ్మవారి భాగ్యనగరం’ అంటూ @BJP4Telangana ట్వీట్‌ చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బుధవారం రాత్రి HYD MP అభ్యర్థి మాధవీ లతకు మద్దతుగా లాల్‌దర్వాజా BJP బహిరంగ సభలో ‌పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో‌లను షేర్ చేసిన బీజేపీ తెలంగాణ తన అధికారిక సోషల్ మీడియా ‘X’లో‌ ‘Hyderabad ❌ Bhagyanagar ✅’ అని రాసుకొచ్చింది. దీనిపై మీ కామెంట్?

News May 2, 2024

HYD: B.Tech చేసిన వారికి ఉద్యోగాలు

image

బాలానగర్ వద్ద ఉన్న HAL(హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్) ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ.. అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపింది. ఎలక్ట్రానిక్, మెకానిక్ విభాగాలలో B.Tech ఇంజినీరింగ్ చేసిన వారు అర్హులు. ఆన్‌లైన్ ద్వారా ఆసక్తి గలవారు మే 8 వరకు https://www.hal-india.co.inవెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
SHARE IT

News May 2, 2024

HYD: అమ్మాయి‌ పేరుతో నగ్న చిత్రాలు.. ARREST

image

అమ్మాయిల పేరుతో మోసగిస్తున్న యువకుడిని CYB సైబర్‌క్రైమ్‌ అరెస్టు చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. వనస్థలిపురానికి చెందిన దినేశ్‌.. బెట్టింగ్‌, ఆన్‌లైన్‌ గేమ్‌లకు అలవాటుపడ్డాడు. ఈజీ మనీ కోసం డేటింగ్‌ యాప్‌‌లో యువతి ఫొటోలు పెట్టి అకౌంట్ తెరిచాడు. యువకులతో అమ్మాయిలా చాటింగ్ చేస్తూ, నగ్న చిత్రాలు పంపుతూ డబ్బులు వసూలు చేశాడు. మోసపోయిన ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు దినేశ్‌‌ను అరెస్ట్ చేశారు.

News May 2, 2024

హైదరాబాద్‌‌లో CM రేవంత్ రెడ్డి మార్క్

image

HYDలో CM రేవంత్ రెడ్డి మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌కు ఆకర్షితులై ఇప్పటికే 12 మంది BRS కార్పొరేటర్లు‌ హస్తం కండువా కప్పుకొన్నారు. తాజాగా‌ వనస్థలిపురం BJP కార్పొరేటర్‌ వెంకటేశ్వర్ రెడ్డి రేవంత్ సమక్షంలో‌ పార్టీలోకి చేరారు. MP ఎన్నిక‌ల్లో రాజధానిలోని 4 స్థానాల్లో విజయమే లక్ష్యంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్న CM చేరికలపైనా దృష్టి పెట్టారు.

News May 2, 2024

RR: జాతీయ రహదారికి రైతుబంధు.. క్లారిటీ.!

image

HYD నుంచి శ్రీశైలం వెళ్లే జాతీయ రహదారిలో కడ్తాల్, అమనగల్లు ప్రాంతంలో రోడ్డుకు సైతం రైతుబంధు వస్తుందన్న అంశం పై అధికారులు స్పందించారు. రైతుల భూమి నుంచి జాతీయ రహదారి నిర్మించిన సమయంలో భూములు కట్ కాకపోవడంతో, పలువురికి రైతుబంధు అందుతుంది. అయితే రహదారి సర్వే చేస్తామని, రోడ్డు ఉన్న భూమి రైతుల పేరిట ఉంటే తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమనగల్లు తహసీల్దార్ లలిత తెలిపారు.