RangaReddy

News May 2, 2024

RR: జాతీయ రహదారికి రైతుబంధు.. క్లారిటీ.!

image

HYD నుంచి శ్రీశైలం వెళ్లే జాతీయ రహదారిలో కడ్తాల్, అమనగల్లు ప్రాంతంలో రోడ్డుకు సైతం రైతుబంధు వస్తుందన్న అంశం పై అధికారులు స్పందించారు. రైతుల భూమి నుంచి జాతీయ రహదారి నిర్మించిన సమయంలో భూములు కట్ కాకపోవడంతో, పలువురికి రైతుబంధు అందుతుంది. అయితే రహదారి సర్వే చేస్తామని, రోడ్డు ఉన్న భూమి రైతుల పేరిట ఉంటే తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమనగల్లు తహసీల్దార్ లలిత తెలిపారు.

News May 2, 2024

HYD: రైలులో అపరిశుభ్రంగా ఉందా..? కాల్ చేయండి

image

HYD నగరం సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని రైళ్లలో నీటి కొరత ఏర్పడటం, బెడ్స్ పాడైపోవడం, కొచ్ శుభ్రంగా లేకపోవడం, ఎలుకలు, బొద్దింకలు ఉండటం, మరుగుదొడ్లలో నీరు రాకపోవడం లాంటి సమస్యలు ఏర్పడితే తమకు కాల్ చేసి తెలిపితే తగు చర్యలు తీసుకుంటామని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు నోట్ విడుదల చేస్తూ నెంబర్లను తెలిపారు. ఫోటోలో ఉన్న నెంబర్లకు కాల్ చేసి తెలపాలన్నారు.

News May 1, 2024

ఎల్బీనగర్: విద్యుత్ సమస్యలు ఏర్పడితే కాల్ చేయండి

image

ఎల్బీనగర్ పరిధిలోని సరూర్ నగర్, కొత్తపేట, ఎల్బీనగర్, గ్రీన్ హిల్స్, బండ్లగూడ, హయత్ నగర్, ఆటోనగర్, శాంతినగర్ కరెంటు సంబంధిత సమస్యలు ఏర్పడితే సంబంధిత అధికారికి తెలియజేయాలని విద్యుత్ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు అధికారుల నెంబర్లను తెలిపి, అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. స్థానికంగా వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

News May 1, 2024

పార్లమెంటు ఎన్నికలు మనకు ఫైనల్స్: సీఎం

image

త్వరలో రానున్న పార్లమెంటు ఎన్నికలు మనకు ఫైనల్స్ లాంటివని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శేర్లింగంపల్లి తారా నగర్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. రిజర్వేషన్లు తొలగించేందుకు బీజేపీ కుట్ర పన్నుతుందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్, బీజేపీలకు ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు

News May 1, 2024

HYD: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. డబుల్ బెడ్ రూం సర్వీసు రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో ఎంబీఏ విద్యార్థి మృతి చెందాడు. మృతుడు శివానంద్‌ను MBA విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. అతివేగంగా ప్రయివేట్ బస్సును వెనుక నుంచి బైకుతో ఢీ కొట్టడంతో చనిపోయినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News May 1, 2024

HYD: వడదెబ్బ తగిలి టీచర్ మృతి

image

వడదెబ్బతో టీచర్ మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో బుధవారం చోటుచేసుకుంది. బషీరాబాద్ మండలంలోని టాకితాండాలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న రాణి.. తాండూర్‌లోని నెంబర్ 1 పాఠశాలలో ఎలక్షన్ శిక్షణ తరగతులకు హాజరయ్యింది. తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో బస్‌స్టాప్ వద్ద కుప్పకూలి పడిపోయింది. స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News May 1, 2024

ఈనెల 6న తాండూరుకు ప్రియాంకా గాంధీ

image

ఈనెల 6న తాండూర్ పట్టణానికి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి రానున్నట్లు తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఈనెల 6న జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల ఇన్‌ఛార్జ్ మహేశ్ పాల్గొన్నారు.

News May 1, 2024

దిశా కేసులో సిర్పూర్ కార్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు స్టే

image

దిశా కేసులో సిర్పూర్ కర్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. సిర్పూర్ కర్ కమిషన్ నివేదికపై హైకోర్టు సింగిల్ బెంచ్‌ను పలువురు అధికారులు ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల అనంతరం సిర్పూర్ కర్ కమిషన్ నివేదికపై స్టే విజయసేన్ రెడ్డి బెంచ్ విధించింది. పోలీసుల పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది.

News May 1, 2024

HYD: మఫ్టీలో పోకిరీలపై షీ టీం నిఘా!

image

HYD మెట్రో, MMTS రైళ్లు, ప్రదర్శనలు, వినోద కార్యక్రమాల్లో మఫ్టీలోని షీ టీమ్స్ నిఘా కళ్లు పోకిరీలను వెంటాడుతున్నాయి. నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని 7 జోన్లలో 14 బృందాలు మఫ్టీలో నిత్యం పహారాకాస్తున్నాయి. ఉదయం, సాయంత్రం, రాత్రివేళల్లో మఫ్టీలో ఉంటున్న ఈ బృందాలు దూరంగా ఉండి ఆకతాయిల చేష్టలను వీడియో రికార్డ్ చేస్తున్నాయి. కుటుంబ సభ్యుల సమక్షంలో ఆకతాయిలకు మానసిక నిపుణులతో కౌన్సిలింగ్ అందిస్తున్నారు.

News May 1, 2024

షాద్‌నగర్: రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని మృతదేహం

image

రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన ఘటన లింగారెడ్డిగూడ సమీపంలో చోటుచేసుకుంది. లింగారెడ్డిగూడా సమీపంలోని మజీద్ వెనకాల మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుని వయస్సు సుమారు 55 నుంచి 60 ఏళ్లు ఉంటుందని తెలిపారు. మృతుడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.