India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD ఖైరతాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈరోజు నుంచి కొత్త రూల్స్ అమలు కానున్నాయి. గేట్ నంబర్-4 నార్త్ ఈస్ట్ గేటు ద్వారా లోపలికి సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ రానుంది. మంత్రులు, సీఎస్, డీజీపీతో సహా ఇదే గేటు నుంచి లోపలికి రానున్నారు. ఇక ఐఏఎస్, ఐపీఎస్, ఇతర వీఐపీలకు సౌత్ ఈస్ట్ గేట్-2 ద్వారా ఎంట్రీ ఉండనుంది. ఇంకా మరమ్మతులు పూర్తి కాని వెస్ట్ గేట్-3 అలాగా ఉండనుండగా ఈస్ట్ గేట్-2ను మూసివేయనున్నారు.
బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ఫోన్ కాల్స్ ద్వారా బెదిరిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశామని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. మహమ్మద్ వసీం అనే వ్యక్తి 10 సంవత్సరాలుగా దుబాయ్‌లో ఉండి రాజాసింగ్‌కు కాల్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. ఈరోజు ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో హైదరాబాద్ అతడిని పట్టుకున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలో ఉన్న 9 విశ్వవిద్యాలయాలకు శాశ్వత ఉపకులపతుల నియామకం మరికొంత ఆలస్యం కానుంది. గత నెల 21వ తేదీతో 10 వర్సిటీల వీసీల పదవీకాలం ముగిసింది. దీంతో ఐఏఎస్ అధికారులను ఇన్ఛార్జ్ వీసీలుగా ప్రభుత్వం నియమించింది. 15వ తేదీలోపు కొత్త వీసీలను నియమించకుంటే ఇన్ఛార్జుల పదవీకాలం పొడిగిస్తూ మరోసారి ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది.
HYD తార్నాకలోని ICMRకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) కింద ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసై పని అనుభవం ఉండాలి. పోస్టును అనుసరించి రూ.18,000 నుంచి రూ.1,12,400 జీతం ఉంటుంది. జూన్ 16లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు https://www.nin.res.in/employement.html వెబ్సైట్ చూడండి. SHARE IT
రాష్ట్రంలో జరుగుతున్న ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల విషయమై PRTU తెలంగాణ హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో కమిషనర్ శ్రీదేవసేనని పలువురు కలిశారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయులకు నిలిచిపోయిన పదోన్నతులు, బదిలీలు జరిపి న్యాయం చేయాలని కోరారు. దేవసేన స్పందిస్తూ రేపు స్వయంగా తానే అడక్వేట్ జనరల్‌ని కలిసి సాధ్యాసాధ్యాలపై చర్చించి వారికి సాధ్యమైనంత మేరకు న్యాయం జరిగేలా చూస్తా అని హామీ ఇచ్చారు.
HYD, రాచకొండ, సైబరాబద్ కమిషనరేట్ల పరిధిలో షీ టీమ్స్ నిఘా పెంచాయి. బస్టాప్‌లు, పార్కులు, కాలేజీలు, స్కూళ్లు ఇతర ప్రాంతాల్లో యువతుల వెంట పడుతూ వారిని వేధిస్తున్న పోకిరీలను పోలీసులు మఫ్టీలో ఉంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. ముందుగా వారు చేస్తున్న ఆకతాయి చేష్టలను పోలీసులు వీడియో తీసి ఆ తర్వాత పట్టుకుని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. యువతులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు.
బక్రీద్ పర్వదినాన వెలువడి వ్యర్థాలను రోడ్లపై వేయకూడదని GHMC అధికారులు సూచించారు. ఈ మేరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మెయింటైనింగ్ కన్వీనర్ మహమ్మద్ అలీ పిలుపునిచ్చారు. హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛ నగరంగా మారుస్తూనే , పండగలను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించుకోవాలని కోరారు. ఉప్పల్, నాంపల్లి, మలక్‌పేట్, నాచారం ప్రాంతాల్లో ప్రత్యేక NGOS స్వచ్ఛతకు కృషి చేస్తున్నాయన్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 11,922 బడి బస్సులు ఉండగా… ఇప్పటివరకు 8,917 బస్సులు మాత్రమే ఫిట్నెస్ ధ్రువీకరణ పొందాయి. మరో 3,005 బస్సులకు సామర్ధ్య నిర్ధారణ కాలేదని DTC చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. 15 ఏళ్ల సర్వీస్ దాటిన బస్సులు ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్లపై తిరగరాదని స్పష్టం చేశారు. ఇలాంటి బస్సుల్లో పిల్లలను తీసుకెళ్తే వెంటనే సీజ్ చేసి యాజమాన్యాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
విహార యాత్రకు వెళ్లిన యువకుడు మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. కర్ణాటకలోని చిక్ మంగళూరు జిల్లా తరికెరె తాలూకా హెబ్బె జలపాతం వద్ద సెల్ఫీ తీసుకుంటూ కాలుజారి నీటిలో పడి శ్రవణ్ (25) అనే యువకుడు సోమవారం మరణించాడు. అతడు HYD వాసిగా పోలీసులు గుర్తించారు. శ్రవణ్ తన స్నేహితులతో కలిసి వెళ్లగా వాటర్ ఫాల్స్‌లోకి జారి పడినప్పుడు తలకు బండరాయి తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించేలోగా మరణించాడు.
HYD అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇన్ని రోజులు ఎన్నికల కోడ్ ఉండడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. కోడ్ ఎత్తివేయడంతో ప్రస్తుతం పనులు షురూ అయ్యాయి. GHMC పరిధిలోని సుమారు వందకు పైగా కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి అధికారులు టెండర్లు పిలిచారు. వీటితో పాటు పారిశుద్ధ్యం, బహుళ అంతస్తుల పార్కింగ్ కాంప్లెక్స్, సీఆర్ఎంపీ, ఎస్సాఆర్డీపీ, ఎస్ఎన్డీపీ పనులపై దృష్టి సారించారు.
Sorry, no posts matched your criteria.