RangaReddy

News April 30, 2024

షాద్ నగర్: సీఎంని సన్మానించిన రవి శర్మ

image

తెలంగాణలోని నిరుపేద బ్రాహ్మణులను ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని CM రేవంత్ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర యువ బ్రాహ్మణ చైతన్య సమాఖ్య ఆధ్వర్యంలో, షాద్ నగర్ అర్చక పురోహిత సమాఖ్య అధ్యక్షుడు రవిశర్మ.. CM రేవంత్ రెడ్డిని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రేవంత్ రెడ్డిని శాలువాతో సన్మానించారు. వారు మాట్లాడుతూ.. ప్రతి దేవాలయంలో బ్రాహ్మణ యువతకు ప్రాధాన్యత కల్పించాలని కోరానన్నారు.

News April 30, 2024

వికారాబాద్: జిల్లాలో ‘TODAY TOP NEWS’

image

✏టెన్త్ ఫలితాలు.. వికారాబాద్ జిల్లా లాస్ట్
✏టెన్త్‌లో సత్తా చాటిన విద్యార్థులను సన్మానించిన ఆయా నియోజకవర్గాల నేతలు
✏జాగ్రత్త.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
✏కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు మాదిగలు ఓటు వేయవద్దు:మందకృష్ణ
✏పోస్టల్ బ్యాలెట్ సద్వినియోగం చేసుకోవాలి:కలెక్టర్
✏రేపు తాండూరుకు ఎమ్మెల్యే రాజాసింగ్‌
✏ధారూరులో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి
✏గండీడ్: వెన్న చెడ్ మోడల్ స్కూల్లో 99% రిజల్ట్.. అభినందించిన కలెక్టర్

News April 30, 2024

రేపు ఈ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం

image

రేపు కూకట్ పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు కూకట్ పల్లి కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. ఆ తర్వాత రాత్రి 8.30 గంటలకు శేరిలింగంపల్లి కార్నర్ మీటింగ్‌కు హాజరవుతారు. పార్లమెంట్ ఎన్నికల్లో నేపథ్యంలో శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు.

News April 30, 2024

కొడంగల్: టెన్త్ ఫలితాలు.. సత్తా చాటిన గురుకుల విద్యార్థులు

image

10వ తరగతి పరీక్షా ఫలితాల్లో కొడంగల్ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. 67 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 97 శాతం ఉత్తీర్ణతతో 65 మంది పాసైనట్లు ప్రిన్సిపల్ బలరాం తెలిపారు. పాఠశాలకు చెందిన హరిచంద్ 10/10, సునీల్ 9.8/10 జీపీఏ సాధించి టాపర్లుగా నిలిచారు. విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్, సిబ్బంది అభినందించారు.

News April 30, 2024

ఓయూ సెలవులు రద్దు: రిజిస్ట్రార్

image

ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటించిన వేసవి సెలవులను రద్దు చేస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ వెల్లడించారు. హాస్టల్ మరమ్మతులు, విద్యార్థులు తమ తల్లిదండ్రులతో గడపాలనే ఉద్దేశంతో ప్రతియేటా వేసవి సెలవులు ఇస్తామని గుర్తు చేశారు. ఈ వేసవి సెలవులు కూడా ఆ నేపథ్యంలోనే ప్రకటించామని అన్నారు. పోటీ పరీక్షలు ఉన్న నేపథ్యంలో సెలవులు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News April 30, 2024

HYD: ORR బయట శాటిలైట్ టౌన్ షిప్స్!

image

HYD నగరం ORR బయట శాటిలైట్ టౌన్ షిప్స్ నిర్మాణం పై HMDA కసరత్తు చేస్తోంది. ఈ మేరకు రెండు ప్రాజెక్టులకు సంబంధించి దరఖాస్తులను HMDA స్వీకరించింది. RR జిల్లా దామర్లపల్లి-533 ఎకరాలు, నందిగామ పరిధి చేగురులో 100 ఎకరాల్లో షిప్స్ నిర్మాణానికి దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియను ఎన్నికల అనంతరం వేగవంతం చేయనున్నారు.

News April 30, 2024

HYD: వంట బాగాలేదని భార్యను కొట్టి చంపిన భర్త!

image

వంట బాగోలేదని భార్యను భర్త కొట్టి చంపిన దారుణ ఘటన HYD బాచుపల్లిలో చోటు చేసుకుంది. CI ఉపేందర్ రావు వివరాల ప్రకారం.. ప్రగతి కన్‌స్ట్రక్షన్‌ వద్ద మధ్యప్రదేశ్‌కు చెందిన దంపతులు లేబర్‌ పని చేస్తున్నారు. వంట బాగాలేదనే వాగ్వాదంలో భార్య రవినా దూబే(26)ని భర్త ఇటుకతో కొట్టి చంపినట్లు తెలిపారు. మృతదేహాన్ని గాంధీకి తరలించామని, ఘటన పై కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News April 30, 2024

VKBD: పోస్టల్ బ్యాలెట్ సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్‌ను సరైన విధంగా సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల విధులను అధికారులు సమర్ధంగా నిర్వహించాలంటే పోస్టల్ బ్యాలెట్‌ను సరైన విధంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News April 30, 2024

RR: మూడు జిల్లాల్లో వారికి ఆరోగ్య కార్డులు!

image

HYD, RR, MDCL జిల్లాల్లో ప్రాథమిక వైద్యాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలని గర్భిణీలు, చిన్నారులకు, పౌష్టికాహారం పంపిణీ చేసే అంగన్ వాడీ టీచర్లు, ఆయాలకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్య కార్డులు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. వీటితో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యసేవలు పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు లబ్ధి పొందే వారి వివరాలపై కసరత్తు చేస్తున్నారు.

News April 30, 2024

HYD: వ్యక్తి దారుణ హత్య

image

రంగారెడ్డి జిల్లా కడ్తాల్ పోలీస్ స్టేషన్.. మక్త మాదారం గ్రామ పరిధిలోని బటర్ ఫ్లై వెంచర్‌లో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు. వ్యక్తి మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు సుమారు 35 నుంచి 45 ఏళ్ల వయసు ఉంటుందని తెలిపారు. మృతదేహాన్ని సందర్శించి ఆధారాలు సేకరించారని షాద్ నగర్ ఏసీపీ రంగస్వామి తెలిపారు.