India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ పోలీస్ స్టేషన్.. మక్త మాదారం గ్రామ పరిధిలోని బటర్ ఫ్లై వెంచర్‌లో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు. వ్యక్తి మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు సుమారు 35 నుంచి 45 ఏళ్ల వయసు ఉంటుందని తెలిపారు. మృతదేహాన్ని సందర్శించి ఆధారాలు సేకరించారని షాద్ నగర్ ఏసీపీ రంగస్వామి తెలిపారు.
HYD నుంచి 200KM దూరంలో నల్లమల అడవుల్లో కొలువైన శ్రీశైల మల్లికార్జున దర్శనానికి వెళ్లేవారిని చల్లటి ప్రదేశం మల్లెల తీర్ధం కనువిందు చేస్తుంది. శ్రీశైలం వెళ్లే దారిలో ఫరహాబాద్ నుంచి వలవర్లపల్లి మీదుగా 15కి.మీ దూరం ప్రయాణిస్తే దట్టమైన అడవి వస్తుంది. వాహనాలు అపి కొద్ది దూరం వెళ్తే లోయలోకి సుమారు 300 మెట్లు ఉంటాయి. లోయలోకి దిగితే చల్లటి వాతావరణం శరీరాన్ని ఆవహిస్తుంది. ఇంకేం మరీ వేసవి టూర్ వెళ్దామా..!
యువతి స్నానం చేస్తుంటే ఓ ప్రబుద్ధుడు వీడియో తీశాడు. ఈ సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఓ లేడీస్ హాస్టల్‌లో ఉండే యువతి స్నానం చేసేందుకు వెళ్లారు. ఓ యువకుడు బాత్రూం విండో నుంచి సెల్‌ఫోన్‌తో వీడియో తీశాడు. ఇది గమనించిన అమ్మాయి గట్టిగా కేకలు వేసింది. నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు PSలో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
10వ తరగతి ఫలితాల్లో హైదరాబాద్ వెనుకబడింది. 33 జిల్లాల వారీగా విడుదల చేసిన జాబితాలో 30వ స్థానంతో సరిపెట్టుకొంది. HYDలో మొత్తం 73,202 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. 86.76 శాతంతో 63,511 మంది పాస్ అయ్యారు. 91.01 %తో 24వ స్థానంలో రంగారెడ్డి, 89.61 %తో మేడ్చల్ మల్కాజిగిరి 27వ స్థానం, 65.10%తో వికారాబాద్ జిల్లా చివరి(33) స్థానంలో నిలవడం గమనార్హం.
మద్యం మత్తులో తండ్రి తిట్టడంతో 8వ తరగతి చదువుతున్న బాలిక(15) ఆత్మహత్య చేసుకొన్న ఘటన రాయదుర్గం PS పరిధి టెలికాంనగర్‌లో వెలుగుచూసింది. AP నంద్యాల జిల్లా లక్ష్మీపురానికి చెందిన దుద్దుకూరు సరోజ తన కుటుంబంతో కలిసి నగరానికి వచ్చింది. టెలికాంనగర్‌లోని గుడిసెల్లో నివాసం ఉంటున్నారు. సోమవారం సరోజ రెండవ కూతురు రేవతిని తండ్రి తిట్టడంతో ఉరేసుకొంది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
నగరంలోని ఓ పబ్‌లో గొడవ జరిగింది. రాయదుర్గం PS లిమిట్స్‌లోని వైట్ హార్ట్ పబ్‌లో సర్వర్ కెప్టెన్‌గా పని చేస్తున్న కృతీక్(23), బౌన్సర్ అమీర్ మధ్య ఘర్షణ జరిగింది. కృతీక్‌తో పాటు అడ్డొచ్చిన స్నేహితులపై బౌన్సర్ కత్తితో దాడి చేశాడు. ఈ గొడవలో ఇద్దరికి గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అమీర్‌ను అదుపులోకి తీసుకొన్నారు.
MP ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. మల్కాజిగిరిలో 37 నామినేషన్లు ఆమోదించగా.. 15 మంది విత్‌డ్రా చేసుకొన్నారు. 22 మంది బరిలో నిలిచారు. HYD లోక్‌సభలో 8 మంది విత్ డ్రా చేసుకోగా.. 30 మంది బరిలో ఉన్నారు. చేవెళ్లలో 46 మందికి ముగ్గురు ఉససంహరించుకొన్నారు. 43 మంది పోటీలో నిలిచారు. ఇక సికింద్రాబాద్‌లో ఒక్కరే నామినేషన్ ఉపసంహరించుకొన్నారు. ఇక్కడ 45 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
SHARE IT
OUలో తాగునీటి సరఫరా సక్రమంగా లేదంటూ జరుగుతున్న ప్రచారంపై <<13137079>>DigitalMediaTS<<>> వివరణ ఇచ్చింది. ‘జలమండలి MD సుదర్శన్ రెడ్డి VC రవీందర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. HMWSSB ఉన్నతాధికారులు సంబంధిత AEతో కలిసి OUను సందర్శించారు. ఒప్పందం కంటే ఎక్కువే నీరు సరఫరా చేస్తున్నట్లు నిర్ధారించారు. అవసరమైతే OU అధికారుల అభ్యర్థన మేరకు మరింత నీరు సరఫరా చేసేందుకు జలమండలి సిద్ధంగా ఉంది’అని స్పష్టం చేసింది.
ఉస్మానియా యూనివర్సిటీలో విద్యుత్, నీటి ఎద్దడి నెలకొన్నదని పేర్కొంటూ వేసవి సెలవులను ప్రకటిస్తూ చీఫ్ వార్డెన్ డాక్టర్ కొర్రెముల శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇదీ ప్రభుత్వ తీరు అంటూ మాజీ CM KCR విమర్శలకు దిగారు. తాజా ఉత్తర్వులపై సమాధానం చెప్పాలంటూ చీఫ్ వార్డెన్‌కు వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ షోకాజ్ నోటీసు జారీ చేశారు.
టీఎస్ఎస్ పార్టీ గౌలిపుర డివిజన్ మాజీ కార్పొరేటర్ కె.శంకర్ (79) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. శంకర్ మరణవార్త తెలుసుకున్న వివిధ పార్టీలకు చెందిన నాయకులు, దేవాలయాల ప్రతినిధులు పెద్దఎత్తున గౌలిపురలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. శంకర్ భౌతికకాయానికి నివాళులర్పించారు.
Sorry, no posts matched your criteria.