RangaReddy

News March 22, 2024

ఓయూ పరిధిలో బీఈడీ పరీక్షా తేదీల ఖరారు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ పరీక్ష తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఏప్రిల్ రెండో తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఉస్మానియా యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని సూచించారు.

News March 22, 2024

HYD: 72.88 లీటర్ల అక్రమ లిక్కర్ సీజ్: రోనాల్డ్ రోస్

image

ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్స్ గురువారం 72.88 లీటర్ల అక్రమ లిక్కర్, రూ.38,150/- విలువైన ఇతర వస్తువులు జప్తు చేసినట్లు HYD ఎన్నికల అధికారి, GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. పోలీస్, ఎస్.ఎస్.టీ., ఎఫ్.ఎస్.టీ. బృందాలు క్షేత్ర స్థాయిలో 24 గంటలు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. HYDలో ఇప్పటి వరకు మొత్తం రూ.47,18,300 నగదు పట్టుకున్నట్లు వెల్లడించారు.

News March 21, 2024

HYD: బొంతుకు NO.. దానంకు YES

image

కాంగ్రెస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఖైరతాబాద్ MLA దానం నాగేందర్‌కు అధిష్ఠానం టికెట్ ప్రకటించింది. ఇటీవల BRS నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌ సికింద్రాబాద్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించినట్లు సమాచారం. ఒక దశలో ఆయనకే టికెట్ కేటాయిస్తారనే ప్రచారం సైతం జరిగింది. ఆయన అనుచరులు ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేశారు. కానీ అధిష్ఠానం మాత్రం టికెట్‌ను దానం నాగేందర్‌కు కేటాయించింది.

News March 21, 2024

మల్కాజిగిరిలో మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగరాలి: సునీతారెడ్డి

image

మల్కాజిగిరి సిట్టింగ్ పార్లమెంట్‌లో మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగరాలని జడ్పీ ఛైర్‌పర్సన్ సునీత మహేందర్ రెడ్డి ఈరోజు ఇన్‌ఛార్జులు, ముఖ్య నాయకులకు సూచించారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయంలో గురువారం సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

News March 21, 2024

HYD: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం: మంత్రి 

image

HYDలో ఉన్న జర్నలిస్టులకు తప్పకుండా ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. నగరంలో డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడారు. ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం చాలా నిబద్ధతగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు బొల్లోజు రవితోపాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

News March 21, 2024

HYD: గవర్నర్‌తో డిప్యూటీ సీఎం భట్టి సమావేశం

image

నిన్న జరిగిన గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈరోజు ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అంతకుముందు గవర్నర్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా వారు రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలపై చర్చించారు. ప్రభుత్వానికి సహకరించాలని భట్టి గవర్నర్‌ను కోరారు.

News March 21, 2024

HYD: జీరో బిల్లు రానివారికి ప్రత్యేక కౌంటర్లు

image

అన్ని అర్హతలు ఉండీ గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లు రానివారి కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని, ఆహారభద్రత వివరాలు తప్పుగా నమోదు వంటి కారణాల వల్ల అనేకమంది జీరో బిల్లుకు దూరమయ్యారు. ఇలాంటి వారు తమ వివరాలు సరిచేసుకునేందుకు మండల పరిషత్తు, మున్సిపల్, GHMC సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది.

News March 21, 2024

HYD: ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశాం: సీఎస్

image

ఎన్నికల నిర్వహణ, ప్రవర్తనా నియమావళి అమలుపై అన్ని ప్రధాన శాఖల్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై గురువారం HYDలోని సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పోలీస్, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, అటవీ, రెవెన్యూ, రవాణా తదితర శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

News March 21, 2024

HYD: ‘అంతర్జాతీయ ఫోన్‌ కాల్స్‌ను లోకల్‌ కాల్‌గా మారుస్తున్నారు’

image

ఇంటర్‌నెట్ సాయంతో అంతర్జాతీయ ఫోన్‌ కాల్స్‌ను లోకల్‌ కాల్‌గా మారుస్తున్న హిదాయత్‌అలీ(40), అహ్మద్‌(40)ను అరెస్ట్ చేశామని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తెలిపారు. వీరి వద్ద 3 యాక్ట్‌ ఇంటర్‌నెట్ కనెక్షన్‌లు, సిమ్‌ కార్డ్‌ బాక్స్‌లు(32 స్లాట్‌లు), 3 రూటర్‌లు, 6 లాప్‌ట్యాప్‌లు, 2 హార్ట్‌ డిస్క్‌లు, 8 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ శ్రీనివాసరావు, డీసీపీ ఎస్‌.రేష్మీ పెరుమాళ్‌ వెల్లడించారు.

News March 21, 2024

HYD: BRS మాజీ నేతలకే.. ఆ పార్టీల్లో టికెట్?

image

HYD, ఉమ్మడి RRలోని పార్లమెంట్ స్థానాల్లో BRS మాజీ నేతలకే రెండు జాతీయ పార్టీల్లో టికెట్లు వస్తుండడం గమనార్హం. BRSను వీడి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌కు టికెట్ కన్ఫర్మ్ కాగా సునీతా మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డికి కూడా టికెట్ ఇస్తారని సమాచారం. ఇక BRSను వీడి BJPలో చేరిన ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ఇప్పటికే టికెట్లు కన్ఫర్మ్‌ అయ్యాయి. దీనిపై మీ కామెంట్?