India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD, RR, MDCL జిల్లాలతో కూడిన GHMCలో ప్రస్తుతం కోటి కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. రెండేళ్లలో కొత్తగా 14 లక్షల మంది ఓటర్లు నమోదయ్యారు. దాదాపు 5 లక్షల ఓటర్ల గుర్తింపు కార్డులు సవరణలు జరిగాయి. నగరంలోని నియోజకవర్గాల్లో అత్యధికంగా శేరిలింగంపల్లిలో 7.47 లక్షల మంది ఓటర్లు ఉండగా.. కుత్బుల్లాపూర్‌లో 7.12 లక్షలు, మేడ్చల్‌లో 6.58 లక్షలు, LB నగర్‌లో 6 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
HYD, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలపై భానుడు సెగలు కక్కుతున్నాడు. ఆదివారం ఘట్‌కేసర్ మండలం ఘన్‌పూర్‌లో అత్యధికంగా 43.8 డిగ్రీలు, మొయినాబాద్ మండలం మృగవని పార్కు సమీపంలో 43.6 డిగ్రీలు, బంట్వారం మండలం నాగారంలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో రేపు, ఎల్లుండి జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఎండల దృష్ట్యా ఉదయం 10 గంటల తర్వాత బయటకు రావొద్దని సూచిస్తున్నారు.
ఓటరు జాబితాలో ప్రక్షాళనలో భాగంగా భారత ఎన్నికల సంఘం రెండేళ్లలో గ్రేటర్ హైదరాబాద్‌లో 8,81,201 ఓట్లను తొలగించింది. అత్యధికంగా హైదరాబాద్‌లో 5,41,201 మంది ఓట్లను తొలగించారు. ఇందులో 4,39,801 మంది నివాసం మారగా.. 54,259 మంది డూప్లికేట్, 47,141 మంది ఓటర్లు మరణించారు. రంగారెడ్డి జిల్లాలో 2.6 లక్షలు, మేడ్చల్ జిల్లాలో 80 వేల ఓట్లను తొలగించినట్లు అధికారులు తెలిపారు.
క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. HYD ఫిలింనగర్‌లోని ఓ బార్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు బార్‌లో తనిఖీలు నిర్వహించగా.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి చెరుకూరి రమేశ్ ఓ యాప్ ద్వారా IPL బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు తేలింది. దీంతో రమేశ్‌ను అరెస్టు చేసి సెల్‌ఫోన్‌తో పాటు రూ.16 వేలు స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటించింది. అయితే 1, 2 రోజులు ఇంటికి తాళం వేసి శుభకార్యానికి, ఇతర గ్రామానికి వెళ్తేనే దొంగలు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. వేసవి సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి స్వగ్రామాలకు వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సొంతూళ్లకు వెళ్లేవారు స్థానిక PSలో సమాచారం ఇవ్వడంతో పాటు, జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు.
HYD, ఉమ్మడి RR జిల్లాలో TTC(టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్సు) లోయర్ గ్రేడ్ టెక్నికల్ కోర్సు ఉత్తీర్ణులైన వారికి మే 1 నుంచి జూన్ 13 వరకు శిక్షణ ఉంటుందని తెలంగాణ పరీక్షల విభాగం వెల్లడించింది. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవాలని, HYD,హనుమకొండ, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో శిక్షణ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఈ జిల్లాలో MEO కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.
హైదరాబాద్ శివారు శంషాబాద్‌లో చిరుతపులి సంచారంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎయిర్‌పోర్ట్ అధికారులు ఫిర్యాదు మేరకు రన్‌వేతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆపరేషన్ కొనసాగుతోంది. చిరుత, మరో రెండు పిల్లలను పట్టుకునేందుకు బోన్‌లు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు కదలికలను పరిశీలించేందుకు సీసీ కెమెరాలను బిగించారు.
సూపర్‌హీరో సాయిచరణ్ సాహసం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. HYD శివారు నందిగామలోని ఓ ఫార్మా కంపెనీలో ఈ నెల 26న భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కార్మికులను పదో తరగతి బాలుడు సాయిచరణ్ రిస్క్ చేసి కాపాడారు. ఆదివారం స్థానిక MLA వీర్లపల్లి శంకర్ బాలుడిని సీఎం వద్దకు తీసుకెళ్లారు. రేవంత్ రెడ్డి శాలువా కప్పి అతడిని అభినందించారు.
HYD, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి MP స్థానాల్లో నామినేషన్ల పరిశీలన ముగిసింది. మల్కాజిగిరిలో ఏకంగా 114 మంది నామినేషన్ పత్రాలు సమర్పించడంతో శుక్రవారం అర్ధరాత్రి వరకు పరిశీలన కొనసాగింది. సికింద్రాబాద్, చేవెళ్ల నియోజకవర్గాల నామినేషన్ల పరిశీలన శనివారం ఉదయం వరకు కొనసాగింది. పరిశీలన పూర్తయ్యాక నాలుగు స్థానాల్లో మొత్తం 168 మంది అభ్యర్థులు ఉన్నట్లు తేలిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తెలిపారు.
HYD శివారు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రన్ వే పక్కన చిరుత ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం తెల్లవారుజామున చిరుతను పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించారని, ఇంకా రన్ వే పరిసర ప్రాంతంలోనే ఉన్నట్లు వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఎయిర్‌పోర్ట్ అథారిటీ సిబ్బంది వైల్డ్ లైఫ్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో చిరుతను పట్టుకునేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.