India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
యువ శాస్త్రవేత్తలను తయారుచేసేందుకు ఇస్రో యువిక పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లోని తొమ్మిదో తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు HYD DEO రోహిణి తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుకు నేడే చివరి తేదీ అని, దరఖాస్తు తర్వాత ఇస్రో క్విజ్ పోటీలు నిర్వహిస్తుందని,మార్చి 28న ఎంపికైన విద్యార్థుల తొలి జాబితా ఇస్రో విడుదల చేస్తుందన్నారు. వెబ్‌సైట్ jigyasa.iirs.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
GHMC 2023లో నిర్వహించిన సమ్మర్ క్యాంపులలో ఎల్బీనగర్ నుంచి రూ.31,030, చార్మినార్- రూ.1,05,680, ఖైరతాబాద్- రూ.1,72,600, శేర్లింగంపల్లి- రూ.81,240, కూకట్‌పల్లి- రూ.74,840, సికింద్రాబాద్ సర్కిల్ నుంచి- రూ.1,11,220 ఫీజు వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 25 నుంచి మే 31వ తేదీ వరకు సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 44 రకాల క్రీడలపై తర్ఫీదు ఇవ్వనున్నారు.
HYD చందానగర్ వాసి చార్విశ్రీ హుడాకాలనీలోని విద్యావాణి హైస్కూల్‌లో రెండో తరగతి చదువుతోంది. యూట్యూబ్‌లో వీడియో చూసిన చిన్నారి క్యాన్సర్ రోగికి అవసరమయ్యే విగ్ కోసం తన జుట్టు ఇవ్వాలనుకుంది. దీంతో ఆమె తల్లిదండ్రులు గోపాలకృష్ణమూర్తి, మంజూష సహకారంతో 25అంగుళాల పొడవున్న జుట్టును ఇటీవల HYD హెయిర్ డొనేషన్ ఫర్ క్యాన్సర్ పేషెంట్ సంస్థకు అందించింది. ఈవయసులో చిన్నారి ఆలోచన ఆదర్శనీయమని స్థానికులు అభినందించారు.
HYD రాజ్‌భవన్‌లో తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా బుధవారం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సీపీ రాధాకృష్ణన్‌ను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేసి సత్కరించారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. కాగా రాధాకృష్ణన్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించనున్న విషయం తెలిసిందే.
వేసవికాలం వేళ HYDలో విద్యుత్ వినియోగం పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. గత సంవత్సరం మార్చి నెలలో 5న సరాసరిగా 52.15 మిలియన్ యూనిట్లు నమోదైంది. ఈ ఏడాది మార్చి మొదటి వారంలోనే ఒక రోజుకు 70.71 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగినట్లు తెలిపారు. ఏప్రిల్, మే నెలలో మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో తగు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విద్యుత్ అధికారులు పేర్కొన్నారు.
హైదరాబాద్ శివారులో బుధవారం విషాదఘటన వెలుగుచూసింది. కొత్తూరు మం. గూడూరులో చేపల వేటకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు చెరువులో మునిగి మృతి చెందారు. సమాచారం అందుకున్న కొత్తూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
ఏళ్లుగా ప్రాపర్టీ TAX కట్టని వారిపై GHMC చర్యలకు సిద్ధమైంది. మొండి బకాయిల వసూలే లక్ష్యంగా పెట్టుకొన్న అధికారులు.. తొలుత వ్యాపారసముదాయాలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే 100కు పైగా దుకాణాలకు తాళం వేశారు. ఇటువంటి వారి కోసం OTS(వన్ టైమ్ సెటిల్‌మెంట్) స్కీమ్ అమల్లో ఉందని గుర్తుచేస్తున్నారు. MAR 31లోపు చెల్లిస్తే 90% డిస్కౌంట్ ఇస్తున్నారు. పన్ను కట్టని నిర్మాణాలపై చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
HYD, RR, MDCL పరిధిలో కుక్కల బెడదతో గల్లీలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అంబర్‌పేట, షేక్‌పేట, రాజేంద్రనగర్, అద్రాస్‌పల్లి, ఉప్పల్ లాంటి అనేక చోట్ల కుక్కలు వెంటపడి కరుస్తున్నాయి. ఇప్పటికీ ఎల్బీనగర్-24385, చార్మినార్-37666, ఖైరతాబాద్-8178, శేర్లింగంపల్లి-1813, కూకట్‌పల్లి-6901, సికింద్రాబాద్‌లో 18086 కుక్కలకు స్టెరిలైజేషన్ కాలేదు. ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
లోక్‌సభ ఎన్నికలు, కంటోన్మెంట్ ఉప ఎన్నిక సమీపిస్తున్న వేళ HYDలో కాంగ్రెస్ బలాన్ని పెంచుకుంటోంది. నిన్న మధ్యాహ్నం వరకు BJP కార్యక్రమాల్లో పాల్గొన్న కంటెస్టెడ్ MLA శ్రీగణేశ్.. ఎవరూ ఊహించని విధంగా సాయంత్రమే హస్తం కండువా కప్పుకొన్నారు. కంటోన్మెంట్ INC టికెట్ దాదాపు ఆయనకే ఖరారైందని టాక్. మరోవైపు BRS టికెట్ తనకే ఇవ్వాలని సాయన్న కూతురు నివేదిత అడుగుతున్నారట. ఇక BJP అభ్యర్థి ఎవరనేది తెలియాల్సి ఉంది.
HYD శివారు ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో భార్గవి (19) <<12882624>>హత్య కేసు మిస్టరీ<<>> వీడింది. ప్రేమ వ్యవహారం నచ్చక తల్లి జంగమ్మ ఉరేసి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. మంగళవారం తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా.. అమ్మాయి తన ప్రియుడిని ఇంటి వద్దకు పిలిచి మాట్లాడుతోంది. ఇదే సమయంలో జంగమ్మ ఇంటికి వచ్చింది. కుమార్తె తీరును జీర్ణించుకోలేక కోపంతో కొట్టి, చీరతో ఉరేసినట్లు పోలీసులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.