RangaReddy

News March 2, 2025

HYD: ఫ్యాన్సీ నంబర్లతో రూ.37లక్షల ఆదాయం

image

HYD మణికొండలోని రవాణా శాఖ కార్యాలయంలో ఫ్యాన్సీ నంబర్ల వేలం నిర్వహించారు. వేలంలో భారీ మొత్తంలో ఫ్యాన్సీ నంబర్లు ధర పలికాయి. TG07P9999 నంబర్‌ రూ.9.37 లక్షలు పలుకగా.. TG07P0009 రూ.7.50 లక్షలు పలికింది. ఈ ఒక్కరోజే రవాణా శాఖకు ఫ్యాన్సీ నంబర్ల ద్వారా రూ.37 లక్షల ఆదాయం వచ్చినట్టు అధికారులు తెలిపారు.

News March 2, 2025

HYD: వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు

image

అంబర్‌పేట్ గోల్నాక జిందాతిలిస్మాత్ వీధిలో ఓ వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు నిర్వహించారు. నలుగురు మహిళలను రెస్క్యూ హోంకు తరలించారు. అందులో ముగ్గురు ఉగాండా, ఒకరు కెన్యా చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వ్యభిచార గృహం నిర్వాహకుడు లైబీరియా దేశానికి చెందిన వ్యక్తితో పాటు ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 1, 2025

RR: 10వ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

image

ఇంటర్మీడియట్, టెన్త్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి లేదని, పరీక్షలు జరిగే ప్రదేశాలలో జిరాక్స్ సెంటర్‌లను మూసివేయాలన్నారు. 185 ఇంటర్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు, ఇంటర్ మొదటి, రెండవ వార్షిక పరీక్షలకు 1,47,211 మంది, పది వార్షిక పరీక్షలకు 51,794 విద్యార్థుల పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.

News March 1, 2025

HYD: ఎల్బీనగర్‌లో ట్రాన్స్‌జెండర్ల పొదుపు సంఘం..!

image

HYDలో ట్రాన్స్‌జెండర్లు తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తూ ముందుకు వెళ్తున్నారు. తమ ప్రతిభను చాటి చెబుతూనే పలు రంగాల్లో రాణిస్తున్నారు. ఇటీవలే ట్రాఫిక్ ఉద్యోగాలకు సైతం వారిని ప్రభుత్వం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా.. GHMC & MEPMA సహకారంతో, అర్ధనారి ట్రాన్స్‌జెండర్ల పొదుపు సంఘం HYD ఎల్బీనగర్‌లో ఏర్పాటు జరగగా వారందరూ సంతోషం వ్యక్తం చేశారు.

News March 1, 2025

HYD: సెలబ్రిటీలను మోసం చేసిన యువకుడిపై మరో కేసు నమోదు

image

గతంలో జూబ్లీహిల్స్ PS పరిధిలో సెలబ్రిటీలు, సంపన్నులను SustainKart పేరుతో మోసం చేసిన ఘటనలో జైలుకెళ్లి వచ్చిన కాంతి దత్‌పై తాజాగా CCSలో మరో కేసు నమోదైంది. పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు తీసుకొని మోసగించినట్లు సౌజన్య అనే మహిళ ఫిర్యాదు చేసింది. తృతీయ జ్యువెలరీ పేరుతో తిప్పల శ్రీజ అనే మహిళను మోసగించిన ఘటనలో కాంతి దత్ గతంలో అరెస్టయ్యాడు. తాజాగా మరో కేసు నమోదు కావడం గమనార్హం.

News March 1, 2025

హైదరాబాద్‌లో రేపటి నుంచి నైట్‌ఔట్!

image

నైట్ ఔట్ కల్చర్ మన హైదరాబాదీలకు కొత్తేమీ కాదు. కానీ, రేపటి నుంచి నగరంలో కొత్త రూల్స్ ఉండబోతున్నాయి. రంజాన్ నెల సందర్భంగా వ్యాపారులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. 24 గంటలూ దుకాణాలు ఓపెన్ చేసేందుకు ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి. రేపటి నుంచి మార్చి 31 వరకు ఈ రూల్స్‌ అమల్లో ఉంటాయి. ఇక మిడ్‌నైట్ షాపింగ్‌కు మన చార్మినార్‌‌లోని వ్యాపారులు సిద్ధమవుతున్నారు.

News March 1, 2025

HYD: మార్చి 1.. పెరిగిన టికెట్ ధరలు

image

HYD బహదూర్‌పురాలోని నెహ్రూ జూపార్క్ ఎంట్రీ టికెట్ ధర పెరిగింది. Adults రూ. 100, Children రూ. రూ. 50 చొప్పున టికెట్ ధరలు నిర్ణయించారు. సఫారీ, ట్రెయిన్ రైడ్, ఫిష్ అక్వేరియం ఎంట్రీ టికెట్ ధరలు కూడా పెరిగాయి. సమ్మర్‌లో టూరిస్టులు అధికంగా జూ పార్క్‌కు వస్తుంటారు. అనుగుణంగా అధికారులు పార్క్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు.https://nzptsfd.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
SHARE IT

News February 28, 2025

HYD: కేంద్రమంత్రికి సీఎం బహిరంగ లేఖ

image

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి 9 పేజీలతో లేఖ రాశారు. పలు ప్రభుత్వ విజ్ఞప్తులను సీఎం లేఖలో ప్రస్తావించారు. అందులో కీలకంగా తెలంగాణను కేంద్రం పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు. రాష్ట్రానికి నిధుల మంజూరు బాధ్యత కిషన్ రెడ్డిదేనన్నారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉండగానే చెన్నై, బెంగళూరు మెట్రో విస్తరణకు ఆమోదం వచ్చిందని హైదరాబాద్ మెట్రో విస్తరణకు పలు విజ్ఞప్తులను పట్టించుకోలేదని వెల్లడించారు.

News February 28, 2025

జూపార్కు ధరలు పెంపు.. రేపటి నుంచి అమల్లోకి

image

HYD నెహ్రూ జూలాజికల్ పార్కు ప్రవేశ టికెట్లతో పాటు అన్ని రకాల టికెట్లపై ధరలను రాష్ట్ర అటవీ శాఖ ఆదేశాల మేరకు జూపార్క్ అధికారులు పెంచారు. రేపటి నుంచి పెరిగిన ధరలు అమలులోకి వస్తాయని జూపార్క్ క్యూరేటర్ వసంత తెలిపారు. 2 ఏళ్ల తర్వాత జూ పార్క్ టికెట్ల ధరలను పెంచారు. జూపార్క్ ప్రవేశ టికెట్ రూ.100, చిన్న పిల్లలకు రూ.50లతో పాటు జూలోని మరిన్నింటికి ధరలు పెంచారు.

News February 28, 2025

HYDలో భవాన నిర్మాణ పర్మిషన్లు ఈజీ

image

GHMC పరిధిలో ఇక నుంచి ఇంటి నిర్మాణాల పర్మిషన్లు వేగంగా జరుగుతాయని కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. దీనికోసం ‘బిల్డ్ నౌ’ యాప్ తీసుకొచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. దీనిపై జోనల్, డిప్యూటీ కమిషనర్‌లకు మార్చి 9 వరకు శిక్షణ ఇస్తున్నారు. మార్చి 10 నుంచి పూర్తిగా అందుబాటులోకి వస్తుందని ఆయన వెల్లడించారు. AI ఆధారంగా పనిచేయడంతో ఇందులో ప్లాన్ అప్లోడ్ చేస్తే లోపాలు, కోర్టు కేసులు అన్నింటిని గుర్తిస్తుందని వివరించారు.