India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సికింద్రాబాద్‌లో ACB అధికారులు రైడ్స్ చేశారు. నీటిపారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఏకంగా రూ. 4 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఉప్పల్‌లో బిల్డింగ్‌కు NOC ఇచ్చేందుకు DEE పవన్ కుమార్ రూ. 5 లక్షలు డిమాండ్ చేశాడు. డబ్బులు తీసుకుంటుండగా ACB దాడులు చేసి అరెస్ట్ చేసింది. న్యాయస్థానంలో హాజరుపరచి కేసు దర్యాప్తు చేస్తున్నారు. లంచం అడిగితే వెంటనే 1064కి కాల్ చేయాలని ACB Telangana పేర్కొంది.
UPSC ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడికి నిరాశ మిగిలింది. తరుణ్ కుమార్ ఆల్ ఇండియాలో 231వ ర్యాంకు సాధించినట్లు తొలుత వార్తలొచ్చాయి. అభ్యర్థిని పరిగి MLAతో పాటు తదితర రాజకీయ నేతలు సన్మానించారు. కానీ, హాల్ టికెట్ నంబర్ ద్వారా చెక్ చేస్తే హరియాణాకు చెందిన యువకుడిగా తేలింది. క్రాస్‌చెక్ చేసుకోకపోవడంతో యువకుడు పొరపాటు పడ్డట్లు గ్రామస్థులు తెలిపారు.
ఇంటర్ (MPC) స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ అనుజ్ఞ శుక్రవారం తన తల్లిదండ్రులతోపాటు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.. ఈ సందర్భంగా ఆమెను సీఎం శాలువాతో సత్కరించి అభినందించారు. ఉన్నత చదువుల్లో సైతం ఇలాగే రాణించాలని, తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలని సూచించారు. MPCలో 1000 మార్కులకు గాను 993 మార్కులు అనుజ్ఞ సాధించిన విషయం తెలిసిందే.
HYDలో సెల్‌ఫోన్లను చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోన్లను దొంగిలించి ఇతర దేశాలకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఐదుగురు సూడాన్ దేశస్థులతో సహా 17 మంది ముఠాను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1.75 కోట్ల విలువైన 703 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలను HYD CP శ్రీనివాస్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం వెల్లడించనున్నారు.
HMDA భూములకు సాంకేతికతను జోడించి భూ అక్రమాలకు చెక్ పెట్టేందుకు ‘జియో ట్యాగ్’ విధానానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీని ద్వారా HYD సహా ఇతర జిల్లాల్లో ఉన్న HMDA భూముల్లో ఎలాంటి నిర్మాణం జరిగినా.. ఇట్టే గూగుల్ ఇమేజ్ ద్వారా తెలిసిపోనుంది. HMDA భూముల్లోనూ జరిగే ఆక్రమణలకు దీని ద్వారా ఓ పరిష్కారం లభిస్తుందని సర్కారు భావిస్తోంది.
రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం రంగంపల్లి శివారులో వడదెబ్బకు వ్యక్తి మృతి చెందిన ఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మొగలిగిద్దకు చెందిన సత్తయ్య(60) షాద్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. మతిస్తిమితం సరిగా లేని ఇతడు కొంతకాలంగా ఇంటికి రాకుండా తిరుగుతున్నాడు. ఇదే క్రమంలో రంగంపల్లి వద్ద సొమ్మసిల్లి పడిపోయి మృతి చెందాడు.మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించగా.. కేసు నమోదు చేశారు.
RR జిల్లా చేవెళ్ల లోక్‌సభ స్థానానికి 64 మంది అభ్యర్థులు 88 నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి నాలుగో సెట్ దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ తరఫున ఆయన తనయుడు కాసాని వీరేశ్ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, స్వతంత్రులు నామినేషన్ వేశారు.
HYD, RR, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో అనేక చోట్ల రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. రేషన్ కార్డుదారుల నుంచి అక్రమార్కులు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీనిపై నిఘా పెట్టిన అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. 3 జిల్లాల్లో అధికారిక లెక్కల ప్రకారం పట్టుబడిన వారిపై శాఖాపరంగా ఏటా 250 కేసులు, క్రిమినల్ కేసులు 1800కి పైగా నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు.
మల్కాజిగిరి MP స్థానానికి TGలోనే అత్యధికంగా 114 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. చివరి రోజు ఏకంగా 61 మంది 91 సెట్‌లు అందజేశారని ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. APR 18 నుంచి 25 వరకు నిర్వహించిన నామినేషన్ల స్వీకరణలో భాగంగా 114 మంది అభ్యర్థులకుగాను 177 నామినేషన్ల పత్రాలు దాఖలు చేసినట్లు వివరించారు. దేశంలోనే అత్యధిక ఓటర్లు కలిగిన మల్కాజిగిరి(మినీ ఇండియా)లో అదే స్థాయిలో నామినేషన్లు వచ్చాయి.
HYDలో ఉన్న పిల్లలకు GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్ గుడ్ న్యూస్ తెలిపారు. కేవలం రూ.10తో సమ్మర్ కోచింగ్ క్యాంపుల్లో శిక్షణ పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు. ఆసక్తి ఉన్నవారు sports.ghmc.gov.in లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ సువర్ణ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. 37 రోజుల పాటు 44 క్రీడలపై శిక్షణ అందించనున్నారు.
Sorry, no posts matched your criteria.