RangaReddy

News March 18, 2024

తుది దశకు చేరుకున్న చర్లపల్లి రైల్వేస్టేషన్ పనులు

image

నగరానికి మణిహారంగా భావిస్తున్న HYD చర్లపల్లి రైల్వేస్టేషన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభానికి సిద్ధమవుతోంది. చర్లపల్లి టెర్మినల్లో రూ.430 కోట్ల అంచనాతో ప్రయాణికులకు అనేక వసతులు కల్పిస్తున్నారు. 3 రైల్వే లైన్లుగా ఉన్న చర్లపల్లిలో ఇప్పుడు 9 ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 7 లిఫ్టులు, 6 ఎస్కలేటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. బస్ బేలు, ప్రవేశమార్గాలు, పార్కింగ్ స్థలం ఏర్పాటు చేస్తున్నారు.

News March 18, 2024

సికింద్రాబాద్ సీటు.. VERY హాట్  

image

సికింద్రాబాద్ MP స్థానాన్ని దక్కించుకోవడానికి ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. 2019లో ఇక్కడి నుంచి BJP తరఫున కిషన్ రెడ్డి MPగా గెలిచి కేంద్రమంత్రి అయ్యారు. కిషన్ రెడ్డికి 3,84,780 ఓట్లు రాగా BRS అభ్యర్థి తలసాని సాయికిరణ్‌కి 3,22,666ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి అంజన్‌కుమార్ యాదవ్‌కు 1,73,229 ఓట్లు వచ్చాయి. ఈసారి కిషన్ రెడ్డిని ఓడించేందుకు BRS, కాంగ్రెస్‌ బలమైన అభ్యర్థుల కోసం కసరత్తు చేస్తున్నాయి.

News March 18, 2024

HYD: మూడేళ్ల చిన్నారిపై బాలుడి అత్యాచారం

image

మూడేళ్ల చిన్నారిపై 13ఏళ్ల బాలుడు అత్యాచారం చేసిన ఘటన HYD సరూర్‌నగర్ PSపరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. పవనపురి కాలనీలో పక్క పక్క పోర్షన్లలో 2కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. ఆదివారం సాయంత్రం ఓ కుటుంబానికి చెందిన చిన్నారి దాబాపై ఆడుకుంటోంది. అదే సమయంలో మరో కుటుంబానికి చెందిన బాలుడు వెళ్లి చిన్నారిపై అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

News March 18, 2024

HYD: శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి నృత్యాలు

image

మాదాపూర్‌లోని శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం విశాఖపట్నం కళారాధన మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ గురువు డా.తాళ్లపాక సందీప్ కుమార్ శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనతో అలరించారు. పుష్పాంజలి, మూషిక వాహన, ముద్దుగారే యశోద, శివతాండవం, మహాగణపతి, కాలభైరవాష్టకం, జయము జయం,అన్నమాచార్య కీర్తనలు, కళాపూజ, జగన్మోహన, దుర్గ స్తుతి, అభంగ్ మొదలైన అంశాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు.

News March 18, 2024

HYD: సింగర్ మంగ్లీకి తప్పిన ప్రమాదం

image

ప్రముఖ గాయని మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ DCM ఢీకొన్న ఘటన HYD శంషాబాద్ పరిధి తొండుపల్లి సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. RR జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ హాజరై అర్ధరాత్రి మేఘ్ రాజ్, మనోహర్‌తో కలిసి ఆమె కారులో HYD- బెంగళూరు జాతీయ రహదారి మీదుగా ఇంటికి బయలుదేరారు. తొండుపల్లి వంతెన వద్దకు రాగానే DCM ఢీకొట్టింది. త్రుటిలో ప్రమాదం తప్పింది.

News March 18, 2024

HYDలో 4 రోజులు వర్షాలు..!

image

గ్రేటర్ హైదరాబాద్‌లో ఆదివారం నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. కాప్రా 34.09 డిగ్రీలు, ఉప్పల్ 34.6, ఫలక్‌నుమా 34.8, ముషీరాబాద్ 34.7, అంబర్‌పేట్ 34.1, ఖైరతాబాద్ 34.3, అల్వాల్‌లో 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే నేటి నుంచి 4 రోజుల పాటు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు.

News March 18, 2024

GHMCలో నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు

image

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ వచ్చినందున ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం లేదని, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత యథావిధిగా ప్రజావాణి ఉంటుందని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News March 18, 2024

HYD: నేటి నుంచి జూన్ 4 వరకు ప్రజావాణి రద్దు: కలెక్టర్లు

image

హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టరేట్లలో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి రద్దు చేశామని కలెక్టర్లు అనుదీప్ దురిశెట్టి, గౌతమ్, శశాంక, నారాయణరెడ్డి తెలిపారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సోమవారం నుంచి జూన్ 4వ తేదీ వరకు నిలిపేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత యథావిధిగా ప్రజావాణి ఉంటుందని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. SHARE IT

News March 18, 2024

HYD: హామీల అమలులో కాంగ్రెస్ విఫలం: లక్ష్మణ్

image

రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వంద రోజులైనా హామీలు అమలుచేయడం లేదని MP లక్ష్మణ్ విమర్శించారు. HYDలో ఆదివారం నిర్వహించిన అడ్వకేట్స్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నామ మాత్రంగా పథకాలను ప్రారంభిస్తోందని ఆరోపించారు. అందుకే ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని, అందుకు అనుగుణంగా మేనిఫెస్టో తయారుచేసేందుకు బీజేపీ సిద్ధమైందన్నారు.

News March 18, 2024

HYD: మతం పేరిట ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్న BJP: కూనంనేని

image

పార్లమెంట్‌ ఎన్నికల్లో BJP మతం, దేవుడి పేరుతో ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. HYD శంషాబాద్‌ పట్టణంలో సీపీఐ రంగారెడ్డి జిల్లా నాయకులకు, కార్యకర్తలకు రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆదివారం శిక్షణ తరగతుల ముగింపు సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు మాట్లాడారు. BJPపై ఫైర్ అయ్యారు.