RangaReddy

News March 18, 2024

HYD: వారికి రాజ్యాంగబద్ధంగా బుద్ధి చెబుతాం: దాసోజు శ్రవణ్‌

image

పార్టీ మారిన వారికి రాజ్యాంగబద్ధంగా బుద్ధి చెబుతామని బీఆర్‌ఎస్‌ నేత దాసోజు శ్రవణ్‌ అన్నారు. పార్టీలు మారిన వాళ్లను రాళ్లతో కొట్టి చంపాలని నిన్నటి దాకా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు నిజస్వరూపం చూపిస్తున్నాడని అన్నారు. HYD బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో దాసోజు శ్రవణ్‌ మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న రేవంత్‌ రెడ్డిపై ధ్వజమెత్తారు.

News March 18, 2024

హైదరాబాద్‌: కాంగ్రెస్‌లో కన్‌ఫ్యూజన్..!

image

లోక్‌సభ ఎన్నికల ముంగిట HYD, రంగారెడ్డిలోని 3 స్థానాలపై కన్‌ఫ్యూజన్ నెలకొంది. ఇటీవల INC చేవెళ్ల అభ్యర్థిని తానే అంటూ పట్నం సునీత గ్రౌండ్‌ వర్క్ మొదలుపెట్టారు. కానీ, అనూహ్యంగా రంజిత్ రెడ్డి పేరు తెరమీదకొచ్చింది. సికింద్రాబాద్‌‌ టికెట్ బొంతు రామ్మోహన్‌‌దే అంటూ ఆయన అనుచరులు ప్రచారం చేస్తుండగా.. దానం నాగేందర్‌‌‌కు అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఈ స్థానాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మీ కామెంట్?

News March 17, 2024

HYD నుంచి మెదక్‌ వెళ్తుంటే యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌ వాసి మృతి చెందాడు. నగరం నుంచి మెదక్ వైపు వెళ్తుండగా కొల్చారం మండలం కిష్టాపూర్ గ్రామ శివారులో బైక్ అదుపుతప్పి కల్వర్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో HYD వాసి హబీబ్ అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108 వాహనంలో మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News March 17, 2024

HYD: KCRను మోసం చేయడం సిగ్గుచేటు: ఆనంద్‌ గౌడ్

image

గోషామహల్‌లో BRS అభ్యర్థిగా పోటీ చేసిన నందకిశోర్ కాంగ్రెస్‌లోకి వెళ్లడం సరికాదని ఆ పార్టీ నేత ఆనంద్‌ గౌడ్‌ అసహనం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన నియోజకవర్గ శ్రేణులతో సమావేశమయ్యారు. స్వలాభం కోసం పార్టీ మారుతున్న వ్యక్తిని ఎంత నీచంగా అభివర్ణించినా తక్కువేనని అన్నారు. లోకల్ లీడర్ కాకపోయినా MLA టికెట్, ఆయన కూతురికి కార్పొరేటర్ టికెట్ ఇచ్చిన KCRను మోసం చేయడం సిగ్గుచేటు అంటూ ఆనంద్‌ మండిపడ్డారు.

News March 17, 2024

ఉద్యోగ నోటిఫికేషన్లు: HYDలో ఇదీ పరిస్థితి..!

image

గ్రూప్‌-1‌, DSC నోటిఫికేషన్లతో HYD‌లోని లైబ్రరీలకు తాకిడి పెరిగింది. అమీర్‌పేట, అశోక్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్‌‌లోని కోచింగ్‌ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. TGలో అతిపెద్దదైన అఫ్జల్‌గంజ్‌ స్టేట్ సెంట్రల్ లైబ్రరీ‌లో అభ్యర్థులు కుస్తీ పడుతున్నారు. రూ. 5 భోజనం తింటూ 8 నుంచి 10 గంటల సేపు చదువుతున్నారు. వీరి కోసం మౌలిక వసతులతో పాటు అదనపు పుస్తకాలు అందుబాటులోకి తెస్తున్నట్లు లైబ్రేరియన్ తెలిపారు.

News March 17, 2024

హైదరాబాద్‌లో బలపడుతున్న కాంగ్రెస్..!

image

HYD, RRలో కాంగ్రెస్ బలపడుతోంది. తాజాగా MLA దానం, MP రంజిత్‌ హస్తం పార్టీలో చేరగా.. మరికొందరు నేతలూ టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తు మీద రాజధానిలో ఏ ఒక్కరూ గెలవకపోయినా.. దానం చేరికతో ఒక MLA వచ్చినట్లయింది. ఇది HYD క్యాడర్‌లో జోష్‌ నింపుతోంది. ఇక గులాబీకి కంచుకోటగా ఉన్న మేడ్చల్‌ జిల్లాలోని ఓ MLA పార్టీని వీడను అంటూ‌నే.. INC నేతలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నట్లు టాక్.

News March 17, 2024

HYD: యువకుడి ఆత్మహత్య

image

ఉరేసుకుని హాస్టల్ నిర్వాహకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గచ్చిబౌలి PS పరిధిలో జరిగింది.SI శోభన్ వివరాల ప్రకారం.. అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన దుర్గాప్రసాద్ (29) గచ్చిబౌలిలోని ఓ భవనాన్ని అద్దెకు తీసుకొని 11 నెలలుగా శ్రీ దుర్గమెన్స్ పీజీ హాస్టల్ నిర్వహిస్తూ అక్కడే ఉంటున్నాడు. కాగా శనివారం అతడు  ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

News March 17, 2024

HYD: చిక్కడపల్లిలో వ్యక్తి దారుణ హత్య

image

HYD చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాగ్‌లింగంపల్లిలో దారుణ హత్య జరిగింది. శనివారం అర్ధరాత్రి ప్రధాన రహదారి ఫుట్ పాత్‌పై నిద్రిస్తున్న 67 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు బండరాయితో మోది దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు.

News March 17, 2024

గ్రేటర్ పరిధిలో తేలికపాటి జల్లులు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కొనసాగుతుండటం వల్ల రాగల 24 గంటల్లో గ్రేటర్ హైదరాబాద్‌లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలు ఉన్నట్లు HYD వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కాగా శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 34.4, కనిష్ఠం 23.0 డిగ్రీలు, గాలిలో తేమ 50 శాతంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.

News March 17, 2024

HYD: ప్రధాని పర్యటన.. నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు

image

HYD నగరంలో ఈ నెల 17, 18న ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర అదనపు పోలీసు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. PM ఈ నెల 17న బేగంపేట విమానాశ్రయం నుంచి రాజ్‌భవన్ వెళ్లనున్న నేపథ్యంలో రాత్రి 7.40 నుంచి 8.10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల 18న PM రాజ్‌భవన్ నుంచి బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లనున్నారు. దీంతో ఉదయం 9.50 నుంచి 10.20 గంటలకు వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి.