India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే వాతావరణాన్ని కల్పిస్తామని GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. మే 13న జిల్లా పరిధిలోని HYD, SEC పార్లమెంటు నియోజకవర్గాలకు ఎన్నిక జరగనుందని, కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉపఎన్నిక ఉంటుందన్నారు. ఫిబ్రవరి 8 నాటికి లెక్కల ప్రకారం జిల్లాలో 45,70,138 మంది ఓటర్లున్నారని, గడిచిన 2 నెలల్లో 1.21 లక్షల ఓట్లు రద్దయ్యాయని, 46,574 మంది కొత్తఓటర్లు జాబితాలో చేరారన్నారు.
MP ఎన్నికల వేళ కీలక నేతలు BRSను వీడుతున్నారు. MLA దానం, నందకిషోర్ వ్యాస్ INCలో చేరుతున్నట్లు టాక్. MP రంజిత్ ఇదే ఆలోచనలో ఉన్నారట. భవిష్యత్తులో భారీగా చేరికలు ఉంటాయని కాంగ్రెస్ నేతలూ చెప్పడం దీనికి బలం చేకూరుస్తోంది. ఇటీవల BRSను వీడిన బొంతు రామ్మోహన్ GHMCలోని క్యాడర్‌ను INC వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈటల సైతం ఇదే పనిలో ఉన్నారు. దీంతో HYD BRS నేతలు ఎటువైపు అనేది చర్చనీయాంశమైంది.
రూ.30 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉందని పక్కనే ఉన్న యజమాని తన స్థలంతో పాటు కలిపేసుకుని గదులు క్రీడా మైదానం ఏర్పాటు చేసుకున్న ఘటన జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీ ఫేజ్-1లో చోటుచేసుకుంది. పలువురు ఫిర్యాదుల మేరకు షేక్‌పేట రెవెన్యూ అధికారులు పరిశీలించేందుకు వెళ్తే వారెంట్ లేకుండా అనుమతి లేదని అధికారులతో వాదించారు. 800 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించినట్లు అధికారులు గుర్తించామన్నారు.
ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ప్రజల నాడి తెలుసుకునేందుకు వివిధ రాజకీయ పార్టీలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో సర్వేలు కొనసాగిస్తున్నాయి. HYD, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల పరిధిలో ఈ ప్రయత్నాలు జోరుగా సాగుతూ ఉండటం గమనార్హం. IVR కాల్స్ ద్వారా ఓటర్ల మద్దతు తెలుసుకునేందుకు పలువురు సర్వే పనిలో పడ్డారు. వారం రోజుల నుంచి వాయిస్ కాల్స్ కూడా పెద్దఎత్తున వస్తున్నాయని ఓటర్లు చెబుతున్నారు.
దేశంలోని ముస్లింలపై దాడులు రోజు రోజుకు పెరిగి పోతున్నాయని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో మైనార్టీలు అణచివేతకు గురవుతున్నారని ఎంఐఎం అధ్యక్షుడు, HYD ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. రంజాన్ మాసంలోని మొదటి శుక్రవారం సందర్భంగా ఆయన చార్మినార్ మక్కా మసీద్‌లో ప్రత్యేక ప్రార్థనలు, యాముల్ ఖురాన్ పఠనం కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంఐఎం చేస్తున్న అభివృద్ధి పనులపై వివరించారు.
రెవెన్యూ సర్కిల్ జలమండలి కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ ఫైనాన్స్ ఎల్.రాకేశ్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సందీప్‌ను అక్బర్ హుస్సేన్ అనే వ్యక్తి కలిశారు. తన పని అవ్వాలంటే రూ.లక్ష లంచం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. దీంతో అక్బర్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. శుక్రవారం లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు రాకేశ్ దొరికాడు. నాంపల్లి ఏసీబీ కోర్టులో వారిని హాజరుపర్చగా కోర్టు రిమాండ్ విధించింది.
ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజుని ఆ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. శంభీపూర్ రాజు లక్ష్మారెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కాగా మల్కాజిగిరి టికెట్‌ను తొలుత శంభీపూర్ రాజుకు ఇచ్చినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వీరి ఇద్దరి కలయికతో శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ఎమ్మెల్సీ కవిత అరెస్టు అప్రజాస్వామికమని తెలంగాణ మాజీ బేవరేజెస్ కార్పొరేషన్ ఛైర్మన్ గజ్జల నగేశ్ అన్నారు. ఇది బీజేపీ కుట్రలో భాగమని, కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందంతో కవితను అరెస్టు చేశారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించనున్న నేపథ్యంలో నాయకులు, కార్యకర్తల్లో మనోస్థైర్యం దెబ్బతీసేందుకే కుట్రలు చేశారని, మోదీవి బ్లాక్ మెయిల్ రాజకీయాలని ఆయన మండిపడ్డారు.
Sorry, no posts matched your criteria.