India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పరీక్షల్లో ఫెయిలైందని ఓ మెడికో సూసైడ్ చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. HYD శివారు షాద్‌నగర్‌లోని రైతు కాలనీలో RMP వైద్యుడు బుచ్చిబాబు కుటుంబంతో పాటు ఉంటున్నారు. అతడి భార్య GOVT టీచర్. కాగా ఆయన కూతురు కీర్తి(24) ఫిజియోథెరపీ ఫోర్త్ ఇయర్ చదువుతోంది. మరో కూతురు HYDలో చదువుతుండగా ఈరోజు తల్లిదండ్రులు ఆమెను చూసేందుకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేనిది చూసి కీర్తి ఉరేసుకుని చనిపోయింది. కేసు నమోదైంది.
ఈనెల 18 నుంచి జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు చేస్తున్న నో పేమెంట్- నో వర్క్ సమ్మెను ఈరోజు విరమించారు. కమిషనర్ రోనాల్డ్ రాస్‌తో సమావేశమైన కాంట్రాక్టర్లు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. జూన్ చివరి వారంలోపు పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నీ క్లియర్ చేస్తామని కమిషనర్ కాంట్రాక్టర్లకు హామీ ఇవ్వడంతో ఈ సమ్మెను విరమించుకున్నారు. రేపటి నుంచి పనులు ప్రారంభిస్తామని, అలాగే టెండర్లలో కూడా పాల్గొంటామన్నారు.
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ఆర్ధోపెడిక్ వైద్యాధికారిపై పేషెంట్ చేసిన అవినీతి ఆరోపణలపై నియమించబడిన నలుగురు HOD వైద్యాధికారుల కమిటీ రిపోర్టు వచ్చినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రొ.రాజారావు తెలిపారు. విచారణ కమిటీ ఇచ్చిన నివేదికను సీల్డ్ కవర్‌లో మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ (DME)కు పంపించినట్లు రాజారావు పేర్కొన్నారు. సదరు నివేదికపై DME తదుపరి నిర్ణయం తీసుకుంటారన్నారు.
అంతర్జాతీయ, జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఆసుపత్రులు HYDలో అధికంగా ఉండటంతో విదేశీయులు, ఇతర రాష్ట్రాల వారు వరుస కడుతున్నారు. ఈస్ట్ ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, దక్షిణాసియా సహా భారత్‌లోని పలు రాష్ట్రాల నుంచి అత్యధికంగా వైద్యం కోసం పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే నగరంలో తక్కువకే వైద్య సేవలు అందుతుండటం కూడా కారణం. ఉస్మానియా, గాంధీ, MNJలో వైద్య సేవలు పొందుతున్నారు.
జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జూన్ 1వ తేదీన HYD అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న క్యాండిల్ ర్యాలీ ఏర్పాట్లను జూబ్లీహిల్స్ MLA, BRS HYD చీఫ్ మాగంటి గోపీనాథ్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత నిర్వాహకులతో మాట్లాడి ఏర్పాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నారు.
జూన్ 4వ తేదీన హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అప్రమత్తంగా.. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమ నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం పగడ్బందీగా నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి, HYD కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్ హాల్లో పార్లమెంట్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఏఆర్ఓ నిర్వహించిన సమావేశంలో అధికారులకు పలు సూచనలు చేశారు.
ఐఆర్‌డీఏ సంస్థ ‘ప్రకృతి మిత్ర’ లోగోను మంత్రి కొండా సురేఖ ఈరోజు హైదరాబాద్‌లోని వారి నివాసంలో ఆవిష్కరించారు. గిన్నీస్ బుక్ రికార్డు లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 450 టన్నుల వేస్ట్ పేపర్‌ను సేకరించి, రీసైకిల్ చేసి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినీవిద్యార్థులకు నోట్ బుక్కులను అందించాలనే లక్ష్యంతో ఐఆర్‌డీఏ చేస్తున్న కృషి స్ఫూర్తిదాయాకమని మంత్రి అన్నారు.
ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ ఏసీబీ అధికారులందరికీ త్రైమాసిక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా పనిచేస్తున్నారని సిబ్బందిని అభినందించారు. 2024 ఏప్రిల్, మే నెలల్లో బాగా పనిచేసిన హోంగార్డులు, ఔట్ సోర్సింగ్ సిబ్బందితో సహా 220 మంది అధికారులు సిబ్బందికి ఆయన ప్రశంసాపత్రాలు, నగదు, ఇతర బహుమతులు అందజేశారు.
HYD జీడిమెట్లలో పెళ్లికి ప్రేమికుడు ఒప్పుకోకపోవడంతో బుధవారం <<13340754>>అఖిల (22) అనే యువతి సూసైడ్<<>> చేసుకున్న విషయం తెలిసిందే. ‘షాపూర్‌నగర్‌కు చెందిన అఖిల్ సాయిగౌడ్ ప్రేమించాలని నా వెంటపడ్డాడు.. నేను లేకపోతే చచ్చిపోతా అని అనడంతో అతడిని నమ్మి మోసపోయాను.. తల్లిదండ్రుల మాట వినుంటే బాగుండేదానిని’ అని.. ఇలా 14 పేజీల లేఖ రాసి సూసైడ్ చేసుకుందని ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
షిరిడీ నుంచి HYD వస్తున్న TGSRTC బస్సులో ప్రయాణికుల బ్యాగులు చోరీకి గురయ్యాయి. బాధితులు తెలిపిన వివరాలు.. తుల్జాపూర్ పెట్రోల్ బంక్ వద్ద బస్సు ఆగడంతో లగేజీ స్టోర్ తాళం పగలగొట్టి బ్యాగులను దుండగులు ఎత్తుకెళ్లారు. బ్యాగులు లేకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రయాణికులు వాపోయారు. గతంలో కూడా అదే పెట్రోల్ బంక్ వద్ద వేరే బస్సులో చోరీ జరిగింది.
Sorry, no posts matched your criteria.