India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
OU హెల్త్ సెంటర్‌లో కాంట్రాక్టు మహిళా ఉద్యోగిని పట్ల ఒక రెగ్యులర్ ఉద్యోగి అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. సదరు ఉద్యోగిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. యూనివర్సిటీ హెల్త్ సెంటర్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు గురువారం విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. వీ వాంట్ జస్టిస్ అంటూ నినదించారు.
గ్రేటర్‌లో మొన్నటి వరకు వర్షాలతో చల్లబడిన వాతావరణం మళ్లీ ఒక్కసారిగా వేడెక్కింది. రెండు, మూడు రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతుండటంతో పగటి పూటజనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 40.2, కనిష్ఠం 27.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అటు గాలిలో తేమ 32 % నమోదైనట్లు వెల్లడించారు.
హరితహారం పేరిట గత ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో లోపాలను సరిచేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ‘వన మహోత్సవం’ పేరిట నగరంలో ఏకంగా 30 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకొంది. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, చార్మినార్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, ఎల్బీనగర్ జోన్‌లలో నీడనిచ్చే వందల రకాల చెట్లను నాటనున్నారు. ఇంటింటికి సైతం పెరటి మొక్కలు అందజేయనున్నారు.
HYD వాసులను అలరించేలా ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ జూన్ 7 నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. ఏటా ముంబై, బెంగళూరులో నిర్వహించే ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ మొదటిసారి హైదరాబాద్ గుడిమల్కాపూర్ కింగ్స్ కోహినూర్ (క్రౌన్) కన్వెన్షన్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి దాదాపు 250 మంది ప్రముఖ కళాకారులు, 30 ఆర్ట్ గ్యాలరీల యాజమానులు పాల్గొననున్నారు.
HYD జీడిమెట్ల PS పరిధిలోని న్యూ ఎల్బీనగర్‌లో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికంగా నివాసం ఉండే అఖిల(22) అనే యువతిని అఖిల్ సాయిగౌడ్ అనే యువకుడు ప్రేమిస్తున్నాడు. 8ఏళ్లుగా ప్రేమిస్తున్నానని చెప్పి ఆమె వెంట తిరిగాడు. ఇప్పుడు అతడు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో మనస్తాపం చెందిన అఖిల ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అఖిల తండ్రి ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేశారు.
జూన్ 9న నిర్వహిస్తున్న గ్రూప్- 1 ప్రిలిమినరీ పరీక్ష తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశాలను అనుసరిస్తూ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ.. అభ్యర్థుల బయోమెట్రిక్ వెరిఫికేషన్ క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.
HYD ఎల్బీనగర్ జోన్ పరిధి నాగోల్- ఆనంద్ నగర్ రోడ్డుపై భారీ గుంతలు ఉన్నాయని ఓ యువతి ఇటీవలే బురదలో కూర్చొని నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. ఆమె నిరసనకు GHMC యంత్రాంగం కదిలి వచ్చింది. ప్రస్తుతానికి తాత్కాలికంగా వెట్ గ్రావెల్ మిక్స్ వేసి గుంతలు పూడ్చారు. తారు రోడ్డు వేసేందుకు ఉన్నతాధికారులు ప్రతిపాదనలు ఆమోదించగానే శాశ్వతంగా సమస్య పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల ఫలితాల గడువు సమీపిస్తుండటంతో HYD,రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ నాటి నుంచి ఎక్కడ నలుగురు కలిసినా మనం గెలుస్తున్నామా?.. మన అభ్యర్థికి ఎంత మెజారిటీ వస్తుంది?.. మన పార్టీ హవా ఎలా ఉంది?అనే మాటలు వినబడుతున్నాయి. ఈ ఉత్కంఠ ప్రధానంగా ఎన్నికల ముందు పార్టీలు మారిన నేతల్లో అధికంగా కనబడటం గమనార్హం.కాగా ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.
రాష్ట్రంలో కులగణన చేపట్టడానికి ప్రత్యేకంగా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం HYD సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అన్నారు.
JNTU యూనివర్సిటీ పరిధిలో బీటెక్, బీఫార్మసీ నాలుగో సంవత్సరానికి సంబంధించి మొదటి సెమిస్టర్ సప్లమెంటరీ పరీక్షల తేదీలను మారుస్తూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు ఓ ప్రకటనను విడుదల చేశారు. జూన్ 8వ తేదీ, 15వ తేదీన నిర్వహించనున్న పరీక్ష తేదీలను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు వాటిని జులై 5వ తేదీ, 8వ తేదీన నిర్వహిస్తామని అన్నారు. మిగతా పరీక్షలు యధావిధిగా కొనసాగుతాయని ఒక ప్రకటన విడుదల చేశారు.
Sorry, no posts matched your criteria.