India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మండీ బిర్యానీ తిని 10 మంది అస్వస్థతకు గురయ్యారు. ఘట్‌కేసర్ ఎస్ఐ రాము తెలిపిన వివరాలు.. భూపాలపల్లికి చెందిన ఉషారాణి(22), మహేశ్(25), అశోక్, చందు, మౌనిక, రేణుకతో పాటు నలుగురు చిన్నారులు ఇటీవల HYDకు కారులో వచ్చి ఘట్‌కేసర్‌లోని స్థానిక అరేబియా మండీలో బిర్యానీ తిన్నారు. అనంతరం వారంతా అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉషారాణి తండ్రి నరసింహచారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి మనవడితో గవర్నర్ రాధాకృష్ణన్ కొద్దిసేపు సరదాగా గడిపారు. HYD ట్యాంక్ బండ్ వద్ద రాత్రి జరిగిన తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకల్లో స్టేజీపై తన మనవడిని సీఎం గవర్నర్‌కు పరిచయం చేశారు. ఈ సమయంలో గవర్నర్ ఆ చిన్నారికి రెండు నోట్లను ఇచ్చారు. దీంతో ఆ బాలుడు వద్దన్నట్లుగా ఆ డబ్బుల్ని తిరిగి ఇచ్చాడు. అయినా గవర్నర్ మరోసారి ఆ నోట్లను చిన్నారికి ఇస్తూ జేబులో పెట్టడంతో సీఎం నవ్వుతూ చూశారు.
HYD, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు పాడై ఇబ్బంది పడుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. ప్రధాన మార్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని చెబుతున్నారు. అధికారులకు చెప్పినా తాత్కాలిక మరమ్మతులతో సరి పెడుతున్నారని, దీంతో అవస్థలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ ప్రాంతంలో రోడ్లు బాగున్నాయా కామెంట్ చేయండి.
SHARE IT
ప్రొఫెసర్ జయశంకర్ ఆ జన్మ తెలంగాణ వాది అని.. ఈ సమయంలో ఆయన్ను స్మరించుకోకుండా ఉండలేమని BRS అధినేత కేసీఆర్ అన్నారు. HYD బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. అప్పట్లో చాలా మంది ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించారన్నారు. గతంలో తెలంగాణ అనే పదాన్నే పలకవద్దని అప్పటి స్పీకర్ అసెంబ్లీలో అన్నారని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన సంబురాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ హాజరయ్యారు. గవర్నర్‌తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, సీఎస్ శాంతి కుమారి తదితరులు ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి కళాకారులు తరలివచ్చారు.
కొండాపూర్ పరిధిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీపీ అవినాశ్ మహంతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. 2014 జూన్ 2న అధికారికంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నేటితో పదేళ్లు పూర్తి చేసుకుందన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంలో పోలీసు శాఖ సిబ్బంది మనస్ఫూర్తిగా కర్తవ్య నిర్వహణ చేయాలని కోరారు.
గ్రేటర్ HYDలోని ప్రతి బస్ డిపోలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ పనులను ప్రారంభించింది. కంటోన్మెంట్, మియాపూర్-1 డిపోలో ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జింగ్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా, గ్రేటర్‌లోని మరో 23 బస్ డిపోల్లోనూ జులై చివరి నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఇప్పటికే 62 ఎలక్ట్రిక్ బస్సులు ఉండగా మరో 20 జూన్ చివరి నాటికి అందుబాటులో రానున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా HYD బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమరవీరుల త్యాగాల ఫలితం, తెలంగాణ ప్రజల పోరాటంతో ఏర్పడిన రాష్ట్రాన్ని 10 ఏళ్లు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నమని గుర్తు చేశారు. మాజీ సీఎం KCRతో సహా ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కొనియాడారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి HYD నేరేడ్‌మెట్‌లోని రాచకొండ కార్యాలయంలో జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల పోరాటాలు, ఆకాంక్షలకు అనుగుణంగా స్వరాష్ట్రం ఏర్పడిందని అన్నారు. ప్రత్యేక రాష్ర్ట పోరాటాన్ని తాను స్వయంగా చూశానని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసుశాఖలో ఎన్నో నూతన కార్యక్రమాలు చేపట్టామని అన్నారు.
✓జూన్ 4న ఉ.4 గంటలకు పార్టీల ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూములను తెరుస్తారు
✓ఉ.5:30 నుంచి 6 వరకు టేబుల్స్ కేటాయింపు రాండమైజేషన్
✓మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
✓ఉదయం 8 గంటలకు EVM ఓట్ల లెక్కింపు
✓ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు
✓ HYD, RR, MDCL,VKB జిల్లాల్లో సర్వం సిద్ధమైంది
•పై వివరాలను RR కలెక్టర్ శశాంక తెలిపారు.
Sorry, no posts matched your criteria.