RangaReddy

News May 28, 2024

HYD: పిల్లలను ఎత్తుకెళ్లి.. రూ.లక్షలకు అమ్ముతున్నారు..!

image

HYD ఘట్‌కేసర్ పరిధి మేడిపల్లి పోలీసులు ఈరోజు <<13329773>>పిల్లలను ఎత్తుకెళుతున్న ముఠాను<<>> అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల మేడిపల్లి పరిధిలో ఓ చిన్నారిని అమ్ముతుండగా పోలీసులు పట్టుకోవడంతో ఈ ముఠా బాగోతం బయటపడింది. 16మందిని పోలీసులు కాపాడారు. కాగా పీర్జాదిగూడలో రూ.4.5లక్షలకు చిన్నారిని RMP శోభారాణి విక్రయించినట్లు పోలీసులు, CWCఅధికారులు తెలిపారు. ఆమెతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. జర జాగ్రత్త. SHARE IT

News May 28, 2024

HYDలో కొత్తిమీరకు పెరిగిన డిమాండ్

image

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొత్తిమీర ఉత్పత్తి తగ్గడం, మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతం నుంచి దిగుమతి చేసుకోవడంతో హైదరాబాద్‌లో కొత్తిమీరకు డిమాండ్ చాలా పెరిగింది. హోల్ సేల్ మార్కెట్లలో కట్ట విలువ రూ.30, బహిరంగ మార్కెట్‌లో రూ.35 నుంచి రూ.40 వరకు ఉందని వ్యాపారులు చెబుతున్నారు. 15 రోజుల వరకు ఇలాగే కొనసాగుతుందని వారు పేర్కొన్నారు.

News May 28, 2024

HYD: ఓట్ల లెక్కింపు ఇక్కడే..!

image

చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు స్థానిక బండారి శ్రీనివాస్ ఇంజినీరింగ్ కళాశాలలో జరగనుంది. ఇక మల్కాజిగిరి ఎంపీ స్థానానికి సంబంధించి కీసరలోని హోలీ మేరీ ఇంజినీరింగ్ కళాశాల, సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం, విల్లా మేరి కళాశాలలో లెక్కింపు కొనసాగనుంది. HYD, సికింద్రాబాద్ ఓట్ల లెక్కింపు గత అసెంబ్లీ ఎన్నికల కేంద్రాల్లోనే కొనసాగనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

News May 28, 2024

HYD: సిద్ధమవుతోన్న ఎన్నికల అధికారులు

image

లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు ఎన్నికల అధికారులు సిద్ధమవుతున్నారు. సరిగ్గా వారం రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో కౌంట్ డౌన్ ప్రారంభించారు. ఏడు రోజుల్లో ఏమేం పనులు చేయాలి?రోజువారి ఏఏ అంశాలపై సమీక్షలు నిర్వహించాలనే దానిపై రిటర్నింగ్ అధికారులు వేరువేరుగా సమాలోచన నిర్వహిస్తున్నారు. ఈవీఎం యంత్రాల్లో ఓట్లు, పోస్టల్ బ్యాలెట్లో ఓట్లను కంప్యూటర్లలో ఎలా నమోదు చేయాలో వారికి వివరించారు.

News May 28, 2024

HYD: వీధి దీపాలు లేక ప్రజల ఇబ్బందులు

image

గ్రేటర్ HYD పరిధిలో పాడైపోయిన లైట్లకు మరమ్మతులు జరగట్లేదు. కొత్త ప్రాంతాల్లో, ప్రమాదాలు జరిగే చీకటి ప్రాంతాల్లో కొత్త వీధిలైట్ల ఏర్పాటు అందని ద్రాక్షగా మారింది. దీని వల్ల ప్రజలు నరకం చూస్తున్నారు. పాదచారులు రహదారులపై నడవలేకపోతున్నారు. ముందు నడుస్తూ వెళ్లే వారిని వాహనదారులు గమనించలేకపోతున్నారు. దుర్భర పరిస్థితులతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని సర్వాత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

News May 28, 2024

HYD: పిల్లలను ఎత్తుకెళుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

image

HYDలో పిల్లలను ఎత్తుకెళుతున్న ఓ అంతర్రాష్ట్ర ముఠాను ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. 16 మంది చిన్నారులను ఘట్‌కేసర్ పరిధి మేడిపల్లి పోలీసులు కాపాడారు. ఇందులో HYDతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన చిన్నారులు సైతం ఉన్నట్లు వారు గుర్తించారు. తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని, ఒంటరిగా బయటకు పంపించొద్దని పోలీసులు సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగితే తమకు తెలియజేయాలన్నారు. SHARE IT

News May 28, 2024

HYD: ఆర్టీసీ ITI కాలేజీలో ప్రవేశాలకు గోల్డెన్ ఛాన్స్

image

HYD శివారు మేడ్చల్ జిల్లా హకీంపేట్ వద్ద ఉన్న TGSRTC ITI కాలేజీలో మోటార్ మెకానికల్ వెహికల్, డీజిల్ మెకానిక్, పెయింటర్, వెల్డర్ విభాగాల్లో ఐటీఐ చేయడానికి గోల్డెన్ ఛాన్స్ ఉందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. 8, పదో తరగతి చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. వివరాలకు HYD ఐటీఐ కళాశాల ఫోన్‌ నంబర్లను 9100664452, 040-23450033 సంప్రదించాలని సూచించారు. SHARE IT

News May 28, 2024

HYD: వైద్యురాలిని వేధించిన విభాగాధిపతిపై బదిలీ వేటు

image

ఉస్మానియా ఆసుపత్రి సీటీ తొరాసిక్ సర్జరీ విభాగాధిపతి శ్రీనివాస్ రెడ్డి తనను మానసిక వేధింపులకు గురిచేస్తున్నట్లు డీఎంఈకి పీజీ వైద్యురాలు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణకు తెలంగాణ రాష్ట్ర వైద్య విద్యా సంచాలకురాలు వాణి ప్రత్యేక కమిటీని నియమించారు. కమిటీ విచారణ చేపట్టి పీజీ వైద్యురాలిని వేధించిన ఘటనలో సంబంధిత విభాగాధిపతి శ్రీనివాస్ రెడ్డిని వనపర్తి మెడికల్ కళాశాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News May 28, 2024

HYD: తెరుచుకున్న జేఎన్టీయూ కళాశాల

image

వేసవి సెలవులు అనంతరం JNTU ఇంజినీరింగ్ కళాశాల తెరుచుకుంది. మూడో ఏడాది వారికి ఇంటర్న్‌షిప్‌లను దృష్టిలో పెట్టుకొని వచ్చే నెల 3వ తేదీ వరకు సెలవులు ఇవ్వగా, ఇటీవల నాలుగో ఏడాది విద్యార్థులు పరీక్షలు ముగించుకున్నారు. దీంతో కళాశాల మొదటి రోజు 1, 2వ ఏడాది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. కళాశాలలో మళ్లీ విద్యార్థుల కోలాహలం మొదలైంది. కాగా నాలుగో ఏడాది ఐడీపీ విద్యార్థులకు ప్రాజెక్ట్ వైవా కొనసాగుతుంది.

News May 28, 2024

HYD: కాల్పులు జరిపిన వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలి: ఒవైసీ

image

ఏఐఎంఐఎం మాలేగావ్ అధ్యక్షుడు అబ్దుల్ మాలిక్ పై కాల్పులు జరిపిన దుండగులను తక్షణమే గుర్తించి అరెస్ట్ చేయాలని హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. పథకం ప్రకారం తమ పార్టీ మాలేగావ్ అధ్యక్షుడిపై దుండగులు ఆదివారం రాత్రి మూడుసార్లు కాల్పులు జరిపి పారిపోయారని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. గాయపడ్డ అబ్దుల్‌ను ప్రైవేటు చేర్పించి చికిత్స జరిపిస్తున్నామని.. కాల్పుల ఘటనపై విచారణ జరపాలని కోరారు.