India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నగరంలో కొన్ని రోజులుగా గాలిదుమారం రేగుతోంది. ఆదివారం పలు ప్రాంతాల్లో విపరీతమైన వేగంతో ఈదురుగాలులు వీచాయి. దీంతో అనేక ప్రాంతాల్లో హోర్డింగులపై ఏర్పాటు చేసిన ప్లెక్సీ బోర్డులు చెల్లాచెదురయ్యాయి. ఒకవేళ అవి వాహనాలపై పడితే. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో GHMC ప్రకటనల విభాగం అప్రమత్తమైంది. నగరవ్యాప్తంగా అక్రమ హోర్డింగులు, ఫ్లెక్సీ బోర్డులను తొలగించేందుకు ప్రైవేటు ఏజెన్సీలను ఆహ్వానించింది.
HYDలో విషాద ఘటన జరిగింది. ఇన్‌స్పెక్టర్ రాజు తెలిపిన వివరాలు.. గుంటూరు వాసులు యజ్ఞ నారాయణ(25), సత్యనారాయణ (30), సాయిపవన్(32) సికింద్రాబాద్ పద్మారావునగర్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి ముగ్గురు కలిసి బైక్‌పై బిర్యానీ తినేందుకు బయటకు వెళ్లగా కవాడిగూడ క్రాస్ రోడ్ వద్ద ఓ మినీ బస్సు వారిని ఢీకొట్టింది. ప్రమాదంలో యజ్ఞ నారాయణ, సాయిపవన్ మృతిచెందగా సత్యనారాయణకు గాయాలయ్యాయి. కేసు నమోదైంది.
హఫీజ్‌పేట్-సనత్‌నగర్ మధ్య పాదచారుల వంతెన మరమ్మతుల కారణంగా పలు ఎంఎంటీఎస్ రైళ్లను కొన్నింటిని పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు సోమవారం తెలిపారు. నేడు (మంగళవారం) 7 ఎంఎంటీఎస్ లోకల్ సర్వీసులను పూర్తిగా.. 3 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. మేడ్చల్-సికింద్రాబాద్ మధ్య నడిచే 6 ఎంఎంటీఎస్ రైళ్లను ఈ నెల 28, 29, 30 తేదీల్లో పూర్తిగా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని లా కోర్సులు పూర్తి చేసి బ్యాక్లాగ్ సబ్జెక్టులు మిగిలిపోయిన వారికి వన్‌టైం ఛాన్స్ కల్పించినట్లు అధికారులు తెలిపారు. అన్ని సెమిస్టర్ల పరీక్ష ఫీజును వచ్చే నెల 20వ తేదీలోగా, రూ.500 అపరాధ రుసుముతో 25వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని సూచించారు. అందరూ ప్రస్తుతం ఉన్న సిలబస్, పరీక్షా విధానంలోనే పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
దోమల వృద్ధిని నియంత్రించడం ద్వారా రోగాల వ్యాప్తిని అరికట్టడంపై HYD సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) సైంటిస్టులు దృష్టి పెట్టారు. వాటి జీవిత చక్రాన్ని అధ్యయనం చేసేందుకు మైక్రో సీటీ స్కానింగ్ విధానాన్ని ఉపయోగించారు. లార్వా దశ నుంచి సంతోనోత్పత్తి దశ వరకు దోమల శరీరవ్యవస్థలో జరిగే మార్పులను గమనించారు. డ్రోసోఫిలా కీటకాలతో పోలిస్తే దోమల కండరాల వృద్ధిలో తేడా ఉన్నట్టు గుర్తించారు.
RR, మేడ్చల్, VKB జిల్లాల పరిధిలో వరి ధాన్యం కొనుగోళ్లలో తరగు సహించేది లేదని రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ DT మాచన రఘునందన్ హెచ్చరించారు. తాలు సహా ఇతర కారణాల పేరిట తరగు తీసి కొనుగోలు చేసే మిల్లర్లను ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు ఉంటాయని తెలియజేశారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఎన్ని ట్రక్కులు ఎగుమతి అయ్యాయనే విషయంపై తనిఖీలు నిర్వహించారు.
నీటి పారుదల ప్రాజెక్టుల సలహాదారుడు, రిటైర్డ్ ఎస్ఈ ఎన్.రంగారెడ్డి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు. నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి పనులు పూర్తి చేయడానికి ఇటీవలే ఆయనను సలహాదారుగా నియమించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రాజెక్టుల సీనియర్ కన్సల్టెంట్ రంగారెడ్డి ఈరోజు మృతిచెందారు. గతంలో ముఖ్యమంత్రి సలహాదారుడిగా పనిచేసిన రంగారెడ్డి.. ఇటీవల నీటి పారుదల శాఖకు కన్సల్టెంట్‌గా నియామకమయ్యారు. కాలు విరిగి HYDలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మృతిచెందినట్లుగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్), ఎంబీఏ (ఈవినింగ్) సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేశామని చెప్పారు. ఈ ఫలితాల కోసం ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఫార్మసీ పరీక్షా తేదీలను మార్చినట్లు అధికారులు తెలిపారు. ఎంఫార్మసీ మొదటి, మూడో సెమిస్టర్ మెయిన్, బ్యాక్ లాగ్, రెండో సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలను వచ్చే నెల 6వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించినప్పటికీ, వివిధ కారణాల రీత్యా వాటిని వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. ఈ పరీక్షలను తిరిగి వచ్చే నెల 11వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు.
Sorry, no posts matched your criteria.