India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రంలోని డిప్యూటీ సర్వేయర్ పోస్టులకు వీఆర్వోలను కేటాయిస్తే ఉద్యమం తప్పదని HYD నగరంలో సివిల్ ఇంజినీర్లు, సర్వేయర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పోస్టుకు అర్హత లేని వీఆర్వోలను ప్రభుత్వం కేటాయిస్తుందన్న సమాచారంతో అభ్యర్థులు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. డిప్యూటీ సర్వేయర్ నోటిఫికేషన్ విడుదల చేసి, ఖాళీలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
సంక్షేమ వసతి గృహాల్లో డైట్, కాస్మోటిక్ ఛార్జిల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమం పండగ వాతావరణంలో నిర్వహించాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. గురువారం డైట్, కాస్మోటిక్ ఛార్జీలు 40% పెంపు ప్రారంభోత్స ఏర్పాట్లపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారులు, ఆర్డీవోలతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
మరణించిన ఆటోడ్రైవర్లు, ట్రాన్స్‌పోర్ట్, నాన్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్లకు సామాజిక భద్రత బీమా పథకం రెన్యువల్‌తోపాటు, వారి కుటుంబాలకు అందించే రూ.5 లక్షలను రూ.10 లక్షలకు పెంచాలని INTUC నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు. గురువారం మంత్రిని కలిసి ఈమేరకు వినతిపత్రాన్ని అందజేశారు. అలాగే ప్రమాదంలో అంగవైకల్యం చెందిన డ్రైవర్లకు రూ.3 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించాలని మంత్రిని కోరారు.
విద్యార్థుల్లో ఉన్న వైజ్ఞానిక శక్తిని వెలికి తీసి బావి భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని వికారాబాద్ జిల్లా ట్రైనీ కలెక్టర్ ఉమా హారతి పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని కొత్తగాడి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను జిల్లా ట్రైనీ కలెక్టర్ ఉమా హారతి ప్రారంభించారు. విద్యార్థులు భవిష్యత్తు శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు.
కొడంగల్ మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను సర్వేయర్లు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్న విధానాన్ని పర్యవేక్షించారు. కలెక్టర్ స్వయంగా దరఖాస్తుదారుల ఇళ్లను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్ ఉన్నారు.
గత మూడు రోజుల క్రితం గిరిజన హాస్టల్‌లో అస్వస్థతకు గురైన విద్యార్థులు కోలుకున్నారని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. గురువారం తాండూర్ పట్టణంలో గిరిజన హాస్టల్‌లో అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న విద్యార్థులను జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. హాస్టల్‌లో సరైన విధంగా నాణ్యతలేని బియ్యాన్ని తొలగించి కొత్త బియ్యాన్ని సరఫరా చేసినట్లు తెలిపారు.
రంగారెడ్డి జిల్లా కోకాపేట్‌లోని దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవ భవనాన్ని శనివారం ప్రారంభించాడినికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా రానున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొత్త కురుమ శివకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి అతిరథులు వస్తున్నారని తుర్కయంజాల మున్సిపాలిటీ అధ్యక్షురాలు, కౌన్సిలర్ కొత్త కురుమ మంగమ్మ శివకుమార్ తెలిపారు.
ఆన్‌లైన్ గేమింగ్ ప్రమాదకరమని HYD సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. తాజాగా ‘X’లో పోస్ట్ చేశారు.
‘ఆన్‌లైన్ గేమింగ్ యాప్స్ ద్వారా మాల్‌వేర్‌తో డేటాచోరీ అవుతుంది. గేమింగ్ పేరిట బ్యాంక్ అకౌంట్ల వివరాలు సేకరిస్తారు. మీకు తెలియకుండానే అకౌంట్ నుంచి డబ్బు విత్ డ్రా అవుతుంది. APK ఫైల్స్, థర్డ్ పార్టీ యాప్స్ ఇన్‌స్టాల్ చేయొద్దు.’ అని పోలీసులు సూచించారు.
SHARE IT
యువతితో సహజీవనం పేరిట CAB డ్రైవర్ రూ. లక్షల్లో వసూలు చేశాడు. ఈ ఘటన మధురానగర్ PS పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. వైజాగ్‌కు చెందిన యువతి HYDలో బ్యూటీషియన్‌గా పని చేస్తూ స్థిరపడింది. ఆమెకు ఓ క్యాబ్‌డ్రైవర్ పరిచయం అయ్యాడు. ప్రేమ పేరుతో సహజీవనం చేశాడు. పెళ్లి ప్రస్తావన రాగానే ఇద్దరి మతాలు వేరు అంటూ ముఖం చాటేశాడు. అతడి కోసం మతం మారినా మోసం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదైంది.
HYDలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి గుడ్‌న్యూస్. లబ్ధిదారుల వివరాలు పరిశీలించేందుకు ప్రభుత్వం సర్వేయర్లను నియమించింది. HYDలో 5,00,822, మేడ్చల్‌లో 3,22,064, రంగారెడ్డిలో 1,96,940, పటాన్‌చెరు నియోజవకర్గంలో 20,711, కంటోన్మెంట్‌లో 29,909 దరఖాస్తులు వచ్చాయి. తొలి విడతలో నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రేటర్‌లో 84,000 ఇళ్లు నిర్మించాలి.
Sorry, no posts matched your criteria.