India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఎంపీఈడీ) పరీక్షా తేదీలను ఖరారు చేసినట్టు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలను వచ్చే నెల 13వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని సూచించారు.
ఒడిశా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న అంతరాష్ట్ర స్మగ్లింగ్ ముఠా గుట్టును సికింద్రాబాద్ జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు రట్టు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 10వ ప్లాట్ ఫారం పైన అనుమానాస్పదంగా ఉన్న చందు వద్ద రూ.15.50 లక్షల విలువైన 62 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ ఎస్ఎన్ జావేద్ తెలిపారు. మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.
దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా సోమవారం HYD నాంపల్లి గాంధీభవన్‌లో ఎన్ఎస్‌యుఐ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా NSUI రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడారు. గొప్ప నాయకుడు నెహ్రూ అని కొనియాడారు. హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు అభిజిత్ యాదవ్, జిల్లా కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. చాలాచోట్ల ఈదురుగాలులకు భారీ వృక్షాలు కుప్పకూలాయి. ద్రోణి ప్రభావంతో మరో 2 రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుంది. నేడు, రేపు గ్రేటర్ హైదరాబాద్‌లో పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. SHARE IT
హైదరాబాదీలను అకాల వర్షం వణికించింది. మే 7న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి బాచుపల్లిలో గోడ కూలి ఏడుగురు, బహదూర్‌పురాలో కరెంట్ షాక్‌తో ఒకరు, బేగంపేట నాలాలో ఇద్దరు విగతజీవులయ్యారు. ఆదివారం కురిసిన గాలివాన కూడా విషాదాన్ని నింపింది. శామీర్‌పేటలో చెట్టు విరిగి పడి ఇద్దరు, మియాపూర్‌లో బాల్కనీ గోడ కూలి ఓ బాలుడు, మరో వ్యక్తి చనిపోయారు. వర్షాలు, వరదల పట్ల నగరవాసులు అప్రమత్తంగా ఉండండి. SHARE IT
హైదరాబాద్‌లో ACB అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. ఇటీవల నగరంలో రూ. 4 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఇరిగేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పవన్ కుమార్‌కు చెక్ పెట్టారు. తాజాగా ఎల్‌బీనగర్ సర్కిల్-4 టాక్స్ ఇన్‌స్పెక్టర్ సాయిభార్గవ్‌ను పట్టుకొన్నారు. నూతనంగా నిర్మించిన గృహానికి సంబంధించి ఆస్తి పన్నును అంచనా వేయడానికి, హౌస్ నంబర్ కేటాయించడానికి రూ. 10 వేలు డిమాండ్ చేసి అడ్డంగా దొరికిపోయాడు.
2 రోజుల క్రితం రహమత్‌నగర్‌లో బిల్డింగ్ మీద హైటెన్షన్ వైర్లు తగిలి తీవ్రగాయాల పాలైన లౌలి (8) చికిత్స పొందుతూ కాసేపటి క్రితం గాంధీ ఆసుపత్రిలో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 90 శాతం శరీరం కాలిపోవడంతో కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయిందని పేర్కొన్నారు. సమ్మర్ హాలిడేస్‌లో మహబూబాబాద్ నుంచి HYDలోని అమ్మమ్మ ఇంటికి వచ్చిన లౌలి మృతి చెందడంతో పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు.
సర్జరీ చేసేందుకు గాంధీ ఆస్పత్రి డాక్టర్ పేషెంట్ నుంచి డబ్బు డిమాండ్ చేశారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన వెంకటరెడ్డి అనారోగ్యంతో గాంధీలో చేరాడు. సర్జరీ చేయడానికి ఆర్థోపెడిక్ డిపార్ట్‌మెంట్ వైద్యాధికారి రూ.10 వేలు డిమాండ్ చేశారని, దాంతో తాము Gpay ద్వారా చెల్లించినట్లు పేషెంట్ భార్య గోవిందమ్మ సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో నలుగురు HODలతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.
పహాడీ షరీఫ్ PSలో దుండగులు మూడున్నర తులాల బంగారు చైన్‌ను లాక్కెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కల్పనతో పాటు ఆమె కూతురు లక్ష్మీ ప్రసన్నపై కూడా కర్రతో దాడి చేశారు. ఈ సమయంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన కల్పన ఆగంతకులతో తలపడి వారి బైక్ తాళాలు లాక్కుంది. గాయపడ్డ తళ్లీకూతుళ్లు ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. నిందితుల బైక్ నకిలీదని పోలీసులు గుర్తించారు. సీసీ ద్వారా దర్యాప్తు చేస్తున్నారు.
పహాడీ షరీఫ్ PSలో దుండగులు మూడున్నర తులాల బంగారు చైన్‌ను లాక్కెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కల్పనతో పాటు ఆమె కూతురు లక్ష్మీ ప్రసన్నపై కూడా కర్రతో దాడి చేశారు. ఈ సమయంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన కల్పన ఆగంతకులతో తలపడి వారి బైక్ తాళాలు లాక్కుంది. గాయపడ్డ తళ్లీకూతుళ్లు ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. నిందితుల బైక్ నకిలీదని పోలీసులు గుర్తించారు. సీసీ ద్వారా దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.