India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ శనివారం శంషాబాద్ మండల పరిధిలోని ముచ్చింతల్ శివారులోని సమతా మూర్తి కేంద్రాన్ని సందర్శించారు. 108 దివ్య ఆలయాలు, స్వర్ణ రామానుజులను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి విశేషాలు గురించి వారికి సవివరంగా వివరించారు.
పార్లమెంటు ఎన్నికల ఓట్లలెక్కింపు ఏర్పాట్లను GHMC ప్రారంభించింది. జిల్లా పరిధిలోని HYD, SEC పార్లమెంట్ స్థానాలు, కంటోన్మెంట్ అసెంబ్లీకి జరిగిన ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు 16 కేంద్రాలు ఏర్పాటు చేసింది. 15 కేంద్రాలు మామూలు ఓట్ల లెక్కింపునకు సంబంధించినవి,1 తపాలఓట్లకు చెందింది. ఉ.5 నుంచే అధికార యంత్రాంగం ఏర్పాట్లను ప్రారంభిస్తుందని 7గం. అన్ని కేంద్రాల్లో లెక్కింపు మొదలవుతుందని బల్దియా తెలిపింది.
విదేశాల్లో ఉన్న మీ పిల్లలను కిడ్నాప్ చేశాం.. అడిగినంత ఇవ్వండి, లేకుంటే వారు మీకు మిగలరని బెదిరిస్తూ సైబర్ మోసగాళ్లు సరికొత్త పంథాలో ప్రజలను దోచుకుంటున్నారు. ఇలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాంటి ఫోన్ కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగిన ఘటనలో BRS నాయకులను శనివారం రిమాండ్‌కు తరలించినట్లు చెన్‌గోముల్ పోలీసులు తెలిపారు. ఈనెల 13న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమయంలో BRS, కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. ఈ కేసులో కడ్మూరుకు చెందిన నలుగురు BRS నాయకులను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై మధు తెలిపారు.
జూన్ 1 నుంచి అక్టోబరు నెలాఖరు వరకు వర్షాకాల అత్యవసర బృందాల(మాన్సూన్ టీమ్స్)ను రంగంలోకి దింపేందుకు GHMC టెండర్లు పిలిచింది. రూ.36.98 కోట్లతో 64 సంచార బృందాలు, 104 మినీ అత్యవసర బృందాలు, 160 స్టాటిక్ బృందాలతో పని చేయించనున్నట్లు బల్దియా వెల్లడించింది. 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా, ప్రతి చెరువుకు ఓ ఇంజినీరును బాధ్యులుగా ఉంటారని అధికారులు స్పష్టం చేశారు.
HYD,RR,MDCL,VKB జిల్లాల విద్యుత్ వినియోగదారులకు TGSPDCL పలు సూచనలు చేసింది. గుర్తుతెలియని వాట్సప్ నెంబర్ల నుంచి, ఈమెయిల్ తదితర వెబ్ సైట్ల నుంచి కరెంటు బిల్లులు చెల్లించండి, నూతన లింకుల కోసం క్లిక్ చేయండి అని వచ్చే దొంగ లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. లింకు నొక్కిన తర్వాత CVV,OTP లాంటివి అడుగుతే ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దన్నారు. విద్యుత్ అధికారుల నుంచి అలాంటి కాల్స్ ఎప్పుడు రావన్నారు.
ప్రస్తుత యాంత్రీకరణ యుగంలో నడవడం, పరిగెత్తడం, ఈత కొట్టడం అంటేనే అదొక పెద్ద కష్టంగా భావిస్తున్నారు. అలాంటి 80 ఏళ్ల వయసులోనూ మల్కాజిగిరి MLA రాజశేఖర్ రెడ్డి తండ్రి లక్ష్మణ్ రెడ్డి ఈత కొట్టడంలో సత్తాచాటారు. 200 మీటర్ల ఫ్రీ స్టైల్ 9.01 నిమిషాల్లో, 100 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ 3.53 నిమిషాల్లో పూర్తి చేసి పాన్ ఇండియా మాస్టర్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో తొలి స్థానం కైవసం చేసుకున్నారు.
SC గురుకుల సొసైటీ పరిధిలోని నాన్ CEO విద్యాలయాల్లో జూనియర్ ఇంటర్లో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు గురుకుల సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి శుక్రవారం తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 24 నుంచి 31 వరకు గురుకుల సొసైటీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. MPC, బైపీసీ, MEC, సీఈసీ, HEC, వృత్తివిద్య కోర్సుల్లో సీట్లు ఉన్నాయని చెప్పారు.
HYD బాచుపల్లిలో భార్యను భర్త పాశవికంగా<<13309581>> హత్య చేసిన విషయం<<>> తెలిసిందే. అయితే భార్యను హత్య చేసిన భరద్వాజ్ చందానగర్‌లోని స్నేహితుడు ఇంటికి వెళ్లాడు. తాను భార్యను హత్య చేశానని, తన కుమారుడిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి భార్యను పొడిచిన కత్తి తోనే పొడుచుకున్నాడు. దీంతో భయాందోళనకు గురైన శ్రీనివాస్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వగా.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చికిత్స చేయించి రిమాండ్‌కు తరలించారు.
బుల్లెట్ బండి ట్యాంక్ పేలిన ఘటనలో ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా.. శుక్రవారం మరో యువకుడు ప్రాణాలొదిలాడు. భవానీనగర్‌లో ఈ నెల 12న బుల్లెట్ బండి పెట్రోల్ ట్యాంక్ పేలిన ప్రమాద ఘటనలో 10 మంది గాయపడి మొఘల్‌పురలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. చికెన్ సెంటర్‌లో పని చేసే జహంగీర్ నగర్‌కు చెందిన మహ్మద్ హుస్సేన్ ఖురేషి(18) 13 రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం మృత్యువాతపడ్డారు.
Sorry, no posts matched your criteria.