India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD శివారు శంకర్‌పల్లి RPF SI అంటూ యువతి మాళవిక అందరినీ నమ్మించగా ఆమెను పోలీసులు ఈరోజు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే నిజంగా SIలానే ఆమె చేసేదని స్థానికులు తెలిపారు. అవగాహన కార్యక్రమాలు, మోటివేషన్ క్లాసులకు వెళ్లి స్పీచ్‌లు ఇస్తూ SIలానే ప్రవర్తించేదని చెప్పారు. ఏడాదిగా నకిలీ పోలీస్ యూనిఫాం వేసుకుని తిరుగుతున్నా ఎవరూ గమనించకపోవడం గమనార్హం. పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.
HYD తుక్కుగూడలో 2023 SEP 17న సోనియాగాంధీ జనగర్జన సభకు వచ్చిన సూర్యాపేట జిల్లా వాసి కొమ్ము భిక్షం.. తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో హయత్‌నగర్ పరిధిలో రోడ్డు ప్రమాదానికి గురై గాయాల పాలయ్యాడు. ప్రస్తుతం తన తండ్రి ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, తమ పరిస్థితి దయనీయంగా ఉందని కుమారుడు కొమ్ము శ్రీకాంత్ కన్నీరు పెడుతున్నారు. సర్జరీకి రూ.లక్షల్లో ఖర్చవుతుందని, సీఎం ఆదుకోవాలని కోరుతున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మూడేళ్ల ఫార్మ్ డీ, ఆరేళ్ల ఫార్మ్ డీ కోర్సులతో పాటు దూరవిద్యా విధానంలో అందించే ఎంసీఏ కోర్సుల సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్‌కు ఒక్కో పేపర్‌కు రూ.800 చొప్పున చెల్లించి ఈనెల 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు HYD, RR, MDCL జిల్లాల పరిధిలో సుమారు 8 లక్షల మందికి రాయితీ డబ్బు అందినట్లు ప్రాథమికంగా వారు అంచనా వేస్తున్నారు. రీఫిల్లింగ్ బుక్ చేసిన నాటి నుంచి 3 రోజుల్లోనే బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమవుతోందని లబ్ధిదారులు చెబుతున్నారు. రోజూ 20 వేల మంది లబ్ధి పొందుతున్నారని అంచనా.
తెలంగాణలో 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి బీసీల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం HYD విద్యానగర్ బీసీ భవన్ వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీల్లో కేవలం 8 కార్పొరేషన్లు మాత్రమే ఇప్పటివరకు ప్రకటించారని, మిగతా కులాలన్నింటికీ కార్పొరేషన్లను ప్రకటించాలని కోరారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా ఎన్‌ఫోర్స్ టీమ్స్ మంగళవారం రూ.16,43,300 నగదుతో పాటు రూ.10,250 విలువగల ఇతర వస్తువులు పట్టుకుని సీజ్ చేశారని HYD ఎన్నికల అధికారి, GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే పోలీస్, ఎస్.ఎస్.టీ, ఎఫ్.ఎస్.టీ టీమ్స్ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీసీఏ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీసీఏ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ అధికారిక వెబ్‌సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ పనితీరుతో దేశ ప్రజల్లో బీజేపీపై విశ్వాసం పెరిగిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం HYD బర్కత్‌పురలోని బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో జరిగిన సమావేశంలో డాక్టర్ కేఎస్ సోమశేఖర్ రావుకు పార్టీ కండువా కప్పి ఆయన ఆహ్వానించారు. మోదీ పాలనలో అభివృద్ధిని కొనసాగించేందుకు బీజేపీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
లోక్‌సభ ఎన్నికల వేళ BJPకి బిగ్ షాక్ తగిలింది. BJP సీనియర్ నేత, ఆ పార్టీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ నేడు రాజీనామా చేసి, కాంగ్రెస్‌లో చేరారు. సీనియర్ నేతలు మహేశ్ గౌడ్, మైనంపల్లి హనుమంతరావు, పట్నం మహేందర్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాగా గత ఎన్నికల్లో శ్రీగణేశ్ పై BRS నేత లాస్య నందిత గెలిచారు. కాంగ్రెస్ తరఫున గద్దర్ కూతురు వెన్నెల పోటీ చేశారు.
ఈనెల 27న HYD ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో రాచకొండ సీపీ తరుణ్ జోషి అధికారులతో ఈరోజు సమావేశమయ్యారు. స్టేడియం చుట్టూ భారీ భద్రత ఏర్పాటు చేయడమే కాకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు. టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ ఏరివేతకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
Sorry, no posts matched your criteria.