RangaReddy

News May 24, 2024

శంషాబాద్: రన్నింగ్ విమానం తలుపు తీసేందుకు యత్నం

image

గగనతలంలో విమానం తలుపు తీసేందుకు యత్నించిన వ్యక్తికి ఆర్జీఐఏ పోలీసులు 41 సీఆర్‌పీ నోటీసులు ఇచ్చారు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYD గాజులరామారం ప్రాంతానికి చెందిన జిమ్‌ ట్రైనర్‌ అనిల్‌ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నుంచి శంషాబాద్‌‌కు వస్తున్నాడు. ఈ క్రమంలో గగనతలంలో విమానం తలుపు తెరిచేందుకు యత్నించాడు. దీంతో భద్రతాధికారులకు ఫిర్యాదు చేయగా వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనిల్‌పై కేసు నమోదు చేశారు. 

News May 24, 2024

HYD: లింక్ క్లిక్ చేశాడు.. రూ.5.60 లక్షలు స్వాహా

image

స్టాక్ మార్కెట్ పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.5.60 లక్షలు టోకరా వేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి.. స్టాక్ మార్కెట్‌లో లాభాలు వచ్చేలా పెట్టుబడి పెట్టిస్తామని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ప్రకటన చూశాడు. లింక్‌పై క్లిక్ చేయగా ఓ టెలిగ్రామ్ గ్రూప్‌లో యాడ్ అయ్యాడు. మొదట కొంత పెట్టుబడి పెట్టగా..లాభాలు వచ్చాయి. దీంతో విడతలవారీగా రూ.5.60 లక్షలు పెట్టి మోసపోయి CCSలో ఫిర్యాదు చేశాడు.

News May 24, 2024

HYD: MNJ దవాఖానలో 100 రోబోటిక్‌ శస్త్రచికిత్సలు పూర్తి

image

HYD లక్డీకపూల్‌లోని ఎంఎన్‌జే ప్రభుత్వ దవాఖానలో పైసా ఖర్చు లేకుండా పేద రోగులకు ఖరీదైన రోబోటిక్‌ శస్త్రచికిత్సలు చేస్తున్నామని ఎంఎన్‌జే క్యాన్సర్‌ దవాఖాన డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. దవాఖానలో 100 రోబోటిక్‌ శస్త్రచికిత్సలు పూర్తయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంఎన్‌జేలో గత సంవత్సరం సెప్టెంబర్‌ నుంచి రోబోటిక్‌ సర్జరీలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.

News May 24, 2024

BREAKING: HYD: యాక్సిడెంట్.. ముగ్గురు మృతి 

image

రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఆమనగల్లు మండలం రామంతల గడ్డ సమీపంలో గల శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, కారు వేగంగా ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో కారులోని ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందారు. కారు డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. మృతులు హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు.   

News May 24, 2024

HYD: మైనర్లకు వాహనాలు ఇస్తే జైలుకే..!

image

మైనర్లు వాహనాలు నడుపుతూ ఇటీవల తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. తద్వారా వారితో పాటు ఇతరుల ప్రాణాలు సైతం పోతున్నాయి. HYD, రాచకొండ, సైబరాబాద్ పోలీసులు తల్లిదండ్రులకు, మైనర్లకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఇంకా మార్పు రావడం లేదు. 18 ఏళ్లు నిండి, లైసెన్స్ పొందిన తర్వాతే బండ్లు నడపాలన్నారు. లేదంటే వాటిని ఇచ్చిన తల్లిదండ్రులు, యజమానులపై కఠిన చర్యలు తీసుకుని, జైలుకు పంపుతామని హెచ్చరించారు. SHARE IT

News May 23, 2024

HYD: ఈ జిల్లాలో రిజిస్ట్రేషన్ల జోరు!

image

HYD జిల్లా పరిధిలో మార్చి నెలలో మొత్తం స్థిరాస్తుల సంఖ్య 4,376, మేడ్చల్ జిల్లాలో 13,051, రంగారెడ్డి జిల్లాలో 19,663గా ఉంది. మరోవైపు ఇళ్లులు,ప్లాట్లు, స్థలాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లకు HYD జిల్లాలో రూ.120.53 కోట్లు, మేడ్చల్ జిల్లాలో రూ.213.19 కోట్లు, రంగారెడ్డి జిల్లాలో రూ.432.60 కోట్ల ఆదాయం వచ్చినట్లుగా రిపోర్టు విడుదల చేసి, పేర్కొన్నారు.

News May 23, 2024

HYD: ఎన్నికల్లో EVM యంత్రాలు మన ECIL వే!

image

దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియలో వినియోగిస్తున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(EVM)లలో 90 శాతం HYDలోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ECIL) రూపొందించినవే. 543 ఎంపీ స్థానాలలో దాదాపు 500 చోట్ల ECIL తయారుచేసిన EVMలనే వాడుతున్నారు. 2 నెలల కిందటే 6.25 లక్షలకు పైగా కంట్రోల్ యూనిట్లు, 8.39 లక్షల బ్యాలెట్ యూనిట్లు, 5.45 లక్షల వీవీ ప్యాట్లను ఈసీఐకి సరఫరా చేసినట్లు తెలిపారు.

News May 23, 2024

VKB జిల్లాలోని రైతులకు పలు సూచనలు!

image

✓ తీరా వర్షాలు కురిసే సమయం వరకు దుక్కులు దున్నకుండా ఉండొద్దు.
✓వేసవిలోనే దుక్కి సిద్ధం చేయడం మంచిది
✓విత్తనం వేసే నెలరోజుల ముందుగానే దుక్కి సిద్ధం చేసుకోండి
✓వేసవి దుక్కులు లోతుగా చేయడం వల్ల, ఎండ వేడికి పలు రకాల చీడపీడ పురుగులు చచ్చిపోతాయి
✓ మొలకెత్తి మొలకల శాతం పెరుగుతుంది
✓ మొలిచిన మొలకలు ఆరోగ్యంగా ఎదుగుతాయి
•పై సూచనలు పాటించాలని AO సూర్య ప్రకాష్ తెలిపారు.

News May 23, 2024

HYD నగరంపై బ్రిటిష్ హై కమిషనర్ ప్రశంసలు

image

HYD నగరంలోని ఆర్కిటెక్చర్ అందాలు, పురాతన కట్టడాలపై బ్రిటిష్ హై కమిషనర్ కామెరాన్ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా 300 ఏళ్ల చరిత్ర కలిగిన బన్సీలాల్ పేట మెట్ల బావిని సందర్శించిన ఆమె పునరుద్ధరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం చార్మినార్ వద్ద ఇరానీ టీ, ఉస్మానియా బిస్కెట్ తిని ఆస్వాదించారు. HYD నగరాన్ని సందర్శించడంతో తనివి తీరా ఆనందం లభించిందని పేర్కొన్నారు.

News May 23, 2024

HYD: బురదలో కూర్చొని యువతి నిరసన

image

HYD ఎల్బీనగర్ పరిధి నాగోల్-ఆనంద్ నగర్ రోడ్డుపై ఉన్న బురదలో ఓ యువతి కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. రోడ్లు మొత్తం గుంతలమయంగా మారి, వర్షం నీరు చేరి అవస్థలు పడుతున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గుంతల్లో పడి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని మండిపడ్డారు. గ్రేటర్ HYDలో అనేక చోట్ల ఇదే పరిస్థితి ఉందని, ఇప్పటికైనా GHMC యంత్రాంగం స్పందించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.