India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ వచ్చినందున ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం లేదని, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత యథావిధిగా ప్రజావాణి ఉంటుందని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టరేట్లలో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి రద్దు చేశామని కలెక్టర్లు అనుదీప్ దురిశెట్టి, గౌతమ్, శశాంక, నారాయణరెడ్డి తెలిపారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సోమవారం నుంచి జూన్ 4వ తేదీ వరకు నిలిపేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత యథావిధిగా ప్రజావాణి ఉంటుందని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. SHARE IT
రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వంద రోజులైనా హామీలు అమలుచేయడం లేదని MP లక్ష్మణ్ విమర్శించారు. HYDలో ఆదివారం నిర్వహించిన అడ్వకేట్స్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నామ మాత్రంగా పథకాలను ప్రారంభిస్తోందని ఆరోపించారు. అందుకే ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని, అందుకు అనుగుణంగా మేనిఫెస్టో తయారుచేసేందుకు బీజేపీ సిద్ధమైందన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో BJP మతం, దేవుడి పేరుతో ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. HYD శంషాబాద్ పట్టణంలో సీపీఐ రంగారెడ్డి జిల్లా నాయకులకు, కార్యకర్తలకు రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆదివారం శిక్షణ తరగతుల ముగింపు సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు మాట్లాడారు. BJPపై ఫైర్ అయ్యారు.
పార్టీ మారిన వారికి రాజ్యాంగబద్ధంగా బుద్ధి చెబుతామని బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. పార్టీలు మారిన వాళ్లను రాళ్లతో కొట్టి చంపాలని నిన్నటి దాకా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు నిజస్వరూపం చూపిస్తున్నాడని అన్నారు. HYD బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు.
లోక్‌సభ ఎన్నికల ముంగిట HYD, రంగారెడ్డిలోని 3 స్థానాలపై కన్‌ఫ్యూజన్ నెలకొంది. ఇటీవల INC చేవెళ్ల అభ్యర్థిని తానే అంటూ పట్నం సునీత గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. కానీ, అనూహ్యంగా రంజిత్ రెడ్డి పేరు తెరమీదకొచ్చింది. సికింద్రాబాద్ టికెట్ బొంతు రామ్మోహన్‌దే అంటూ ఆయన అనుచరులు ప్రచారం చేస్తుండగా.. దానం నాగేందర్‌కు అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఈ స్థానాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మీ కామెంట్?
రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ వాసి మృతి చెందాడు. నగరం నుంచి మెదక్ వైపు వెళ్తుండగా కొల్చారం మండలం కిష్టాపూర్ గ్రామ శివారులో బైక్ అదుపుతప్పి కల్వర్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో HYD వాసి హబీబ్ అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108 వాహనంలో మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గోషామహల్‌లో BRS అభ్యర్థిగా పోటీ చేసిన నందకిశోర్ కాంగ్రెస్‌లోకి వెళ్లడం సరికాదని ఆ పార్టీ నేత ఆనంద్ గౌడ్ అసహనం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన నియోజకవర్గ శ్రేణులతో సమావేశమయ్యారు. స్వలాభం కోసం పార్టీ మారుతున్న వ్యక్తిని ఎంత నీచంగా అభివర్ణించినా తక్కువేనని అన్నారు. లోకల్ లీడర్ కాకపోయినా MLA టికెట్, ఆయన కూతురికి కార్పొరేటర్ టికెట్ ఇచ్చిన KCRను మోసం చేయడం సిగ్గుచేటు అంటూ ఆనంద్ మండిపడ్డారు.
గ్రూప్-1, DSC నోటిఫికేషన్లతో HYDలోని లైబ్రరీలకు తాకిడి పెరిగింది. అమీర్‌పేట, అశోక్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్‌లోని కోచింగ్ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. TGలో అతిపెద్దదైన అఫ్జల్‌గంజ్ స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో అభ్యర్థులు కుస్తీ పడుతున్నారు. రూ. 5 భోజనం తింటూ 8 నుంచి 10 గంటల సేపు చదువుతున్నారు. వీరి కోసం మౌలిక వసతులతో పాటు అదనపు పుస్తకాలు అందుబాటులోకి తెస్తున్నట్లు లైబ్రేరియన్ తెలిపారు.
HYD, RRలో కాంగ్రెస్ బలపడుతోంది. తాజాగా MLA దానం, MP రంజిత్ హస్తం పార్టీలో చేరగా.. మరికొందరు నేతలూ టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తు మీద రాజధానిలో ఏ ఒక్కరూ గెలవకపోయినా.. దానం చేరికతో ఒక MLA వచ్చినట్లయింది. ఇది HYD క్యాడర్‌లో జోష్ నింపుతోంది. ఇక గులాబీకి కంచుకోటగా ఉన్న మేడ్చల్ జిల్లాలోని ఓ MLA పార్టీని వీడను అంటూనే.. INC నేతలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నట్లు టాక్.
Sorry, no posts matched your criteria.