RangaReddy

News May 25, 2024

HYD: దొంగ మెసేజ్, లింకులను నమ్మకండి జాగ్రత్త!

image

HYD,RR,MDCL,VKB జిల్లాల విద్యుత్ వినియోగదారులకు TGSPDCL పలు సూచనలు చేసింది. గుర్తుతెలియని వాట్సప్ నెంబర్ల నుంచి, ఈమెయిల్ తదితర వెబ్ సైట్ల నుంచి కరెంటు బిల్లులు చెల్లించండి, నూతన లింకుల కోసం క్లిక్ చేయండి అని వచ్చే దొంగ లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. లింకు నొక్కిన తర్వాత CVV,OTP లాంటివి అడుగుతే ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దన్నారు. విద్యుత్ అధికారుల నుంచి అలాంటి కాల్స్ ఎప్పుడు రావన్నారు.

News May 25, 2024

HYD: 80 ఏళ్ల వయసులోనూ సత్తాచాటిన MLA తండ్రి

image

ప్రస్తుత యాంత్రీకరణ యుగంలో నడవడం, పరిగెత్తడం, ఈత కొట్టడం అంటేనే అదొక పెద్ద కష్టంగా భావిస్తున్నారు. అలాంటి 80 ఏళ్ల వయసులోనూ మల్కాజిగిరి MLA రాజశేఖర్ రెడ్డి తండ్రి లక్ష్మణ్ రెడ్డి ఈత కొట్టడంలో సత్తాచాటారు. 200 మీటర్ల ఫ్రీ స్టైల్ 9.01 నిమిషాల్లో, 100 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ 3.53 నిమిషాల్లో పూర్తి చేసి పాన్ ఇండియా మాస్టర్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో తొలి స్థానం కైవసం చేసుకున్నారు.

News May 25, 2024

రంగారెడ్డి: మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

SC గురుకుల సొసైటీ పరిధిలోని నాన్ CEO విద్యాలయాల్లో జూనియర్ ఇంటర్లో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు గురుకుల సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి శుక్రవారం తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 24 నుంచి 31 వరకు గురుకుల సొసైటీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. MPC, బైపీసీ, MEC, సీఈసీ, HEC, వృత్తివిద్య కోర్సుల్లో సీట్లు ఉన్నాయని చెప్పారు.

News May 25, 2024

HYD: భార్యను హత్య చేసి స్నేహితుడి ఇంటికి..!

image

HYD బాచుపల్లిలో భార్యను భర్త పాశవికంగా<<13309581>> హత్య చేసిన విషయం<<>> తెలిసిందే. అయితే భార్యను హత్య చేసిన భరద్వాజ్ చందానగర్‌లోని స్నేహితుడు ఇంటికి వెళ్లాడు. తాను భార్యను హత్య చేశానని, తన కుమారుడిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి భార్యను పొడిచిన కత్తి తోనే పొడుచుకున్నాడు. దీంతో భయాందోళనకు గురైన శ్రీనివాస్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వగా.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చికిత్స చేయించి రిమాండ్‌కు తరలించారు.

News May 25, 2024

HYD: బుల్లెట్ బండి పేలుడు ఘటన.. మరో యువకుడి మృతి

image

బుల్లెట్ బండి ట్యాంక్ పేలిన ఘటనలో ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా.. శుక్రవారం మరో యువకుడు ప్రాణాలొదిలాడు. భవానీనగర్‌లో ఈ నెల 12న బుల్లెట్ బండి పెట్రోల్ ట్యాంక్ పేలిన ప్రమాద ఘటనలో 10 మంది గాయపడి మొఘల్‌పురలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. చికెన్ సెంటర్‌లో పని చేసే జహంగీర్ నగర్‌కు చెందిన మహ్మద్ హుస్సేన్ ఖురేషి(18) 13 రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం మృత్యువాతపడ్డారు.

News May 25, 2024

HYD: బుల్లెట్ బండి పేలుడు ఘటన.. మరో యువకుడి మృతి

image

బుల్లెట్ బండి ట్యాంక్ పేలిన ఘటనలో ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా.. శుక్రవారం మరో యువకుడు ప్రాణాలొదిలాడు. భవానీనగర్‌లో ఈ నెల 12న బుల్లెట్ బండి పెట్రోల్ ట్యాంక్ పేలిన ప్రమాద ఘటనలో 10 మంది గాయపడి మొఘల్‌పురలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. చికెన్ సెంటర్‌లో పని చేసే జహంగీర్ నగర్‌కు చెందిన మహ్మద్ హుస్సేన్ ఖురేషి(18) 13 రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం మృత్యువాతపడ్డారు.

News May 25, 2024

HYD: స్నాప్‌ చాట్‌లో నకిలీ ID.. రూ.14 లక్షల వసూలు

image

ఓ యువకుడు అమ్మాయి పేరిట డబ్బులు కాజేశాడు. సైబర్‌ క్రైం ACP బి.రవీందర్‌రెడ్డి వివరాల ప్రకారం.. నగరానికి చెందిన మారం అశోక్‌రెడ్డి(23) స్నాప్‌ చాట్‌లో ప్రణీతరెడ్డి పేరిట నకిలీ ID సృష్టించాడు. అందమైన యువతి ప్రొఫైల్‌ ఫొటో పెట్టి పలువురికి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపాడు. తర్వాత ప్రేమ, పెళ్లి పేరిట వారికి గాలమేసేవాడు. అలా రూ.14 లక్షలు వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.

News May 25, 2024

HYD: 10వ తరగతి విద్యార్థులకు గమనిక

image

జూన్ 3వ తేదీ నుంచి 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా విద్యాధికారిణి కె.రోహిణి పేర్కొన్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. మొత్తం 35 కేంద్రాల్లో 12,186 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు వెల్లడించారు. ఎగ్జామ్ రాసే విద్యార్థులు ఆయా సెంటర్‌లకు సకాలంలో చేరుకోవాలని ఆమె సూచించారు. SHARE IT

News May 25, 2024

HYD: నేడు, రేపు రైళ్లు రద్దు!

image

నేడు, రేపు పలు MMTS, 4 డెమూ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే(SCR) ప్రకటించింది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ పనులు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి(FOB)ల నిర్మాణం నేపథ్యంలో సికింద్రాబాద్‌-ఫలక్‌నుమా, మేడ్చల్‌- సికింద్రాబాద్‌, లింగంపల్లి-మేడ్చల్‌, హైదరాబాద్- మేడ్చల్‌ మధ్య సేవలందించే 22 MMTS సర్వీసులను రద్దు చేస్తున్నట్లు చీఫ్‌ పీఆర్వో సీహెచ్‌.రాకేశ్‌ తెలిపారు.
SHARE IT

News May 24, 2024

భాగ్యలక్ష్మి ఆలయంలో మధ్యప్రదేశ్ CM

image

చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని శుక్రవారం రాత్రి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ దంపతులు సందర్శించారు. మోహన్ యాదవ్, ఆయన సతీమణి సీమా యాదవ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయాన్ని సందర్శించిన సందర్భంగా దంపతులకు ఆలయ ట్రస్టీ ఛైర్మన్ శశికళ శాలువా, మెమెంటోతో ఘనంగా సత్కరించారు.