RangaReddy

News February 26, 2025

ఆమనగల్: ప్రహరీ మోక్షం ఎప్పుడు.?

image

ఆమనగల్ వ్యవసాయ మార్కెట్ ప్రహరీ నిర్మాణానికి మోక్షం లభించడం లేదు. నాలుగు మండలాలకు కూడలిగా ఉన్న ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్‌కు ప్రతినిత్యం వందల సంఖ్యల రైతులు వస్తుంటారు. ఆమనగల్ గుర్రం గుట్ట కాలనీ వైపు గల ప్రహరీ కూలడంతో ప్రతినిత్యం పందులు, మార్కెట్లోకి స్వైర విహారం చేస్తున్నాయి. ప్రహరీ కూలిన ప్రదేశంలో మినీ డంపింగ్ యార్డ్ తలపిస్తోంది. ఇప్పటికైనా ప్రహరీ నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. 

News February 26, 2025

హాలీం వ్యాపారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశం

image

రంజాన్ పర్వదినాలలో భాగంగా హలీం విక్రయదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి వెస్టిజోన్ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. జోనల్ కమిషనర్ ఆదేశాల మేరకు వివిధ సర్కిళ్లకు చెందిన హలీం విక్రయదారులందరితో సమావేశాన్ని ఏర్పాటు చేసి హలీం తయారీలో తీసుకోవాల్సిన పరిశుభ్రత చర్యలు, వాటిని సజావుగా పంపిణీ చేయటంపై పలు అంశాలను వ్యాపారులకు సూచించారు.

News February 26, 2025

HYDలో ప్రసిద్ధ శివాలయాలు ఇవే..!

image

మన జిల్లాలో ప్రసిద్ధ శివాలయాలు. 11వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్యరాజు 6వ విక్రమాదిత్యుడు శంకర్‌పల్లిలో మరకత లింగాన్ని ప్రతిష్ఠించారని శాసనం చెబుతోంది. జ్యోతిర్లింగాల్లో ఒక్కటైన వైద్యనాథుడిని పోలి..ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. త్రేతాయుగంలో 101 లింగాలను కాశీ నుంచి ఆంజనేయుడు తీసుకురాగా..రాముడు కీసరలో ప్రతిష్ఠించాడు. షాద్నగర్ సమీపంలోని రాయకల్‌లో శ్రీరాముడు లింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి.

News February 26, 2025

రంగారెడ్డి జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా

image

రంగారెడ్డి జిల్లాలో మంగళవారం నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా ఫరూఖ్‌నగర్‌లో 37.7℃, మొయినాబాద్‌లో 36.7, హయత్‌నగర్‌లో 36.5, మొయినాబాద్‌లో 36.3, మొయినాబాద్‌లో 36.2, శేరిలింగంపల్లిలో 35.9, షాబాద్‌లో 35.8, ఇబ్రహీంపట్నంలో 35.7, శంకర్‌పల్లి, సరూర్‌నగర్‌లో 35.4, చేవెళ్లలో 35.3℃ ష్ణోగ్రత నమోదైంది. కాగా ఈ ప్రాంతాలన్నీ ఎల్లో జోన్‌లో ఉన్నాయి.

News February 25, 2025

HYD: జూ పార్క్‌లో టికెట్ ధరలు పెంపు

image

HYD బహదూర్‌పురాలోని నెహ్రూ జూలాజికల్ పార్క్ ఎంట్రీ టికెట్ ధర పెంచినట్లు క్యూరేటర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. చిన్నారులకు రూ. 50, పెద్దలకు రూ. 100 చొప్పున టికెట్ ధరలు నిర్ణయించారు. పార్క్ లోపల సఫారీ, ట్రెయిన్ రైడ్, ఫిష్ ఆక్వేరియం వెళ్లే ధరలు కూడా పెరిగాయి. మార్చి 1వ తేదీ నుంచి ఇవి అమల్లోకి వస్తాయని క్యూరేటర్ స్పష్టం చేశారు.

News February 25, 2025

మార్చి 1న HYD, రంగారెడ్డిలో రేషన్ కార్డుల పంపిణీ

image

కొత్త రేషన్ కార్డులు జారీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో మొదటిగా ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్, HYD ప్రజలకు మార్చి1న అందించనున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. రంగారెడ్డిలో 24వేల కొత్త రేషన్ కార్డులు, వికారాబాద్‌లో 22 వేలు, మేడ్చల్‌లో 6వేలు, HYD 285 రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. ఈ దరఖాస్తు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, దీనికి చివరి గడువంటూ ఏమీ లేదని అధికారులు చెబుతున్నారు.

News February 25, 2025

రంగారెడ్డి జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రతలు

image

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సోమవారం నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. చౌదరిగూడెం మండలంలో 36.5℃, శంకర్‌పల్లి 36.4, సరూర్ నగర్ 36.3, మొయినాబాద్, ఫరూఖ్‌నగర్, షాబాద్ 36.2, మొయినాబాద్ 36.1, హయత్ నగర్ 35.9, చేవెళ్ల 35.7, రాజేంద్రనగర్ 35.6, ఇబ్రహీంపట్నం 35.6, కొందుర్గ్ 35.5, శేరిలింగంపల్లి, తలకొండపల్లి, బాలాపూర్ 35.4, అబ్దుల్లాపూర్ మెట్ 35.3, కేశంపేట, మహేశ్వరంలో 34.7℃గా నమోదైంది.

News February 25, 2025

HYDలో పెరిగిన హలీం ధరలు

image

ఏడాదికోసారి నోరూరించే హలీం ధరలు అమాంతం పెరిగాయి. HYDలో పలుచోట్ల రంజాన్ ప్రారంభానికి ముందే హలీం దుకాణాలు వెలిశాయి. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో చికెన్ వినియోగం పూర్తిగా తగ్గి, మటన్ ధరలు పెరగడంతో రేట్లు పెంచేశారు. గతేడాది ప్రముఖ హలీం సెంటర్లలో ప్లేట్ గరిష్ఠంగా రూ.280 ఉండేది. కాగా.. ఈ ఏడాది ఆయా సెంటర్లలో రూ.300-350 వరకు అమ్ముతున్నారు. ఇంతకీ HYDలో ది బెస్ట్ హలీం ఎక్కడ దొరుకుతుందో కామెంట్ చేయండి.

News February 25, 2025

HYD: పబ్‌లో యువతిపై ఎక్స్ లవర్ దాడి

image

జూబ్లీహిల్స్‌లోని ఇల్యూజన్ పబ్‌లో ఓ యువకుడు యువతిపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాలు.. పాతబస్తీకి చెందిన యువతి తన స్నేహితులతో కలిసి పబ్‌కు వచ్చింది. ఆ సమయంలో మాజీ ప్రియుడు ఆసిఫ్ జానీ అక్కడికి వచ్చి అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు దాడి చేశాడు. అడ్డుకునేందుకు యత్నించిన స్నేహితురాలిపై కూడా దాడి చేయడంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

News February 25, 2025

సీనియర్ సిటీజన్ గుర్తింపు కార్డుల జారీలో జాప్యం వద్దు: ఇలంబర్తి

image

సీనియర్ సిటీజన్ గుర్తింపు కార్డుల జారీలో జాప్యం చేయకూడదని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి సంబంధిత అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో కమిషనర్ అర్జీలను స్వీకరించారు. పలు సమస్యలకు అప్పటికప్పుడు పరిష్కారించాలన్నారు. ప్రజావాణిలో ఆయా విభాగాలకు సంబంధించి అందిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డుల జారీలో జాప్యం చేయకుండా చూడాలన్నారు.