India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD నగరంలో ఎండలు బగ్గుమంటున్న వేళ ప్రజలు విహారయాత్రలకు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగా తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో బెంగళూరు,ఊటీ, మైసూర్ ప్యాకేజీని ప్రతీ సోమవారం నిర్వహిస్తున్నారు. ఆరు రోజుల నిడివితో కూడిన ఈ టూర్లో టికెట్ ధర పెద్దలకు రూ.11,999, పిల్లలకు రూ.9,599 ఉందని, హోటల్ గదిలో ఒక్కరే ఉంటే టికెట్ ధరకు అదనంగా రూ.3 వేలు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
శ్రీరామనవమిని పురస్కరించుకొని ఈ నెల 17న హైదరాబాద్‌లో నిర్వహించే శ్రీరామ శోభాయాత్రకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శనివారం శోభాయాత్ర నిర్వహించే వివిధ ప్రాంతాలను ఆయన ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. నిర్వాహకులకు ఆయన పలు సూచనలు చేశారు. ఏటా ఈ శోభాయాత్రలో వేలాది మంది పాల్గొంటారు.
హైదరాబాద్‌లో దారుణఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఉప్పల్ PS పరిధి రామంతాపూర్‌లో చిన్న కొడుకుతో కలిసి పెద్దకొడుకుని తల్లి హత్య చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామాక్షిపురానికి చెందిన మురళి మద్యానికి బానిసయ్యాడు. ఇంట్లో వారిని వేధిస్తున్నాడు. అతడి వేధింపులు తాళలేక తల్లి శోభ, తమ్ముడు మనోహర్ చీరతో గొంతు బిగించి చంపేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఉప్పల్ పోలీసులు వెల్లడించారు.
టీడీపీ LBనగర్ నియోజకవర్గ ఆత్మీయ సమావేశాన్ని BNరెడ్డినగర్ డివిజన్ ఇన్‌ఛార్జి గద్దె విజయ్ నేత ఆధ్వర్యంలో జరిపారు. ఉదయగిరి MLA అభ్యర్థి సురేశ్, TTDP అధికార ప్రతినిధి జోష్న హాజరయ్యారు. BNరెడ్డిలోని ఉదయగిరికి చెందిన TDP, NTR అభిమానులు సురేశ్‌కు ఓటు వేయాలని విజయ్ కోరారు. ఆయన గెలుపునకు కృషి చేయాలన్నారు. హర్షత్ నాయుడు, నాగేశ్వరరావు, డివిజన్ తెలుగు యువత అధ్యక్షుడు కార్పెంటర్ శీను పాల్గొన్నారు.
HYD శివారు గండిపేట కండ్యూట్ లైనుపై మొదటగా 3 ప్లాంట్లను అందుబాటులోకి తేవాలని అనుకున్నప్పటికీ.. రోజురోజుకి నీటి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే నెలాఖరు నాటికల్లా 5 ట్రీట్మెంట్ ప్లాంట్లను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఇప్పటికే కోకాపేటలో వాటర్ బోర్డు 3 MLD ప్లాంట్ ప్రారంభించగా.. తర్వాత మణికొండ, ఉప్పలగూడలో ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో ప్రైవేట్ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన HYD పేట్ బషీరాబాద్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. భాగ్యలక్ష్మి కాలనీలో ఉంటున్న మహిపాల్(39) ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పని చేసేవాడు. వారం రోజుల క్రితం బైకుపై వెళ్తూ బాలుడిని ఢీకొనగా గాయాలయ్యాయి. వైద్య ఖర్చు చెల్లిస్తానని నిర్ణయానికి వచ్చాడు. కాగా ఆన్లైన్ బెట్టింగ్‌లకు అలవాటు ఉండటంతో అప్పుల్లో కూరుకుపోయి ఉరేసుకున్నాడు.
చారిత్రాత్మక వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన బేగంపేట పైగా ప్యాలెస్‌ను హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయంగా మార్చే ప్రక్రియ మొదలైంది. హెచ్‌ఎండీఏ కార్యకలాపాలన్నీ ఒకే చోట నుంచి జరిగేలా చేయాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జీవోను జారీ చేసింది. ప్రస్తుతం హెచ్‌ఎండీఏకు సంబంధించిన కార్యకలాపాలు అమీర్‌పేట, నానక్‌రాంగూడ, హుస్సేన్‌సాగర్, లుంబినీ పార్కు ప్రాంతాల నుంచి జరుగుతున్నాయి.
గ్రేటర్ HYDలో బస్సుల సంఖ్య పెరుగుతోంది. 2,850 బస్సులతో ప్రధాన రూట్లకే పరిమితమైన RTC ఇప్పుడు పూర్వవైభవాన్ని చాటేందుకు సిద్ధమౌతోంది. గతంలో 3,850 బస్సులు HYD జోన్‌లో ఉండేవి. 2019లో అప్పటి ప్రభుత్వం ఒకేసారి 1000 బస్సులను తగ్గించింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది.దీంతో జిల్లాల్లో తిరుగుతున్న డీలక్స్ బస్సులను నగరానికి తెచ్చి సిటీ బస్సులుగా మార్చే పనులు చురుగ్గా సాగుతున్నాయి.
డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ జయంతి పురస్కరించుకొని ఈ నెల 14న సాలార్ జంగ్ మ్యూజియానికి సెలవు ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సాలార్ జంగ్ మ్యూజియం మూసి ఉంటుందని పేర్కొన్నారు. సందర్శకులు ఎవరూ కూడా రావొద్దని అధికారులు కోరారు.
హైదరాబాద్ LB నగర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొని ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులు రవి, ప్రణయ్‌గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.