India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చేవెళ్ల మండల ZPTC మర్పల్లి మాలతి కృష్ణారెడ్డి శుక్రవారం BRSను వీడారు. పామెన భీం భరత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. MP అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి హస్తం కండువా కప్పి ఆహ్వానించారు. అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని నిర్ణయించుకొని పార్టీలో చేరామన్నారు. ఈ కార్యక్రమంలో సమన్వయ కమిటీ ఛైర్మన్ సత్యనారాయణ రెడ్డి ఉన్నారు. కాగా, రేపు KCR సభ ఉండగా ఒకరోజు ముందు కీలక నేత పార్టీ మారడం చర్చనీయాంశమైంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఆవర్తన ప్రభావంతో రాగల 48 గంటల్లో గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశాలున్నట్లు HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే నగరంలో వెదర్ కాస్త చల్లబడింది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 35.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.9 డిగ్రీలు, గాలిలో తేమ 73 శాతంగా నమోదు అయ్యే ఛాన్స్ ఉందని ప్రకటన విడుదల చేసింది. SHARE IT
HYD: గురుకులాల్లో ఆర్ట్ టీచర్ పోస్టుల భర్తీకి మరోసారి నియామక పరీక్ష నిర్వహించాలని TREI-RBను హైకోర్టు ఆదేశించింది. ఇంగ్లిష్‌తో పాటు తెలుగులో పరీక్ష పేపర్ ఇవ్వాలని స్పష్టం చేసింది. నోటిఫికేషన్‌లో తెలుగు, ఇంగ్లిష్ పరీక్ష ఉంటుందని పేర్కొని, కేవలం ఆంగ్లంలోనే పరీక్షను నిర్వహించడంపై పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు పట్ల HYD, ఉమ్మడి RR జిల్లా విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
HYDలో రంజాన్ వేళ అమానుష ఘటన వెలుగుచూసింది. రామాంతపూర్ ప్రిన్స్‌టన్ కాలేజ్ సమీపంలో 2, 3 రోజుల వయస్సు కలిగిన మగశిశువు మృతదేహాన్ని(తొంటి నుంచి తొడ భాగాన్ని) కుక్కలు పీక్కుతిన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీకి తరలించారు. <<13031707>>శిశువు చనిపోయాక<<>> గుర్తుతెలియని వారు చెత్త డబ్బాలో పారేసి వెళ్లినట్లు భావిస్తున్నారు.
జలమండలి కీలక నిర్ణయం తీసుకొంది. గ్రేటర్ హైదరాబాద్‌లో 31,706 మంది నీటి ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నట్లు గుర్తించింది. భూగర్భ జలాలు, బోర్లు ఎండిపోవడంతో ట్యాంకర్ల డిమాండ్‌కు ప్రధాన కారణమని తేల్చారు. ఇటువంటి వారికి అవగాహన కల్పించడం కోసం NGO ప్రతినిధులను ఇంటికి పంపి అవగాహన కల్పించనున్నారు. నీటి సంరక్షణకు ఇంటి యజమానులు ఇంకుడు గుంతలు నిర్మించుకొనేలా నోటీసులు అందజేయనున్నారు. SAVE WATER
సికింద్రాబాద్ నుంచి కోళ్లం వెళ్లేందుకు ప్రత్యేక ట్రైన్ అందుబాటులోకి తేనున్నట్లుగా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 17, 24, మే 1, 8, 15, 22, 29, జూన్ 12, 19, 26 తేదీలలో సాయంత్రం 6:40 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద అందుబాటులో ఉంటుందని తెలిపారు. కేరళ రాష్ట్రంలోని కొట్టియాం, పరిపల్లి, కోళ్లం వెళ్లాలనుకునేవారు ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
HYD శివారు RRR ప్రతిపాదిత గ్రీన్ బెల్ట్ ద్వారా అందుబాటులోకి వచ్చే 1.10 లక్షల ఎకరాల భూముల్లో చెరువులు, ఆక్వాకల్చర్, అగ్రి బిజినెస్ వ్యాపారాలు చేపట్టవచ్చని, దీనికి సంబంధించి JNTU ఆచార్యులు కే.లక్ష్మణరావు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొత్తం 110 గ్రీన్ జోన్లుగా విభజిస్తే సాధ్యమవుతుందని, ఒక్కో జోన్‌లో 1000 ఎకరాల్లో 200-400 ఎకరాల చెరువులు, మిగతా 600 ఎకరాల్లో అగ్రి బిజినెస్ చేయొచ్చని తెలిపారు.
HYD నగరంలోని JNTUH A+గ్రేడ్, డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ A గ్రేడ్ సాధించినట్లు ఆయా యూనివర్సిటీలు వెల్లడించాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు విదేశీ కోర్సులతో ఒప్పందాలు, కొత్త కోర్సులను ప్రవేశపెట్టినందుకు సులభతరం కానుంది. గ్రేడ్స్ రావడం పట్ల విద్యార్థులు, అధ్యాపక బృందం సంతోషం వ్యక్తం చేసింది. A, A+గ్రేడ్లు సాధించిన నేపథ్యంలో సదుపాయాల కల్పనలో మరింత ముందుకు వెళ్లే అవకాశం లభించనుంది.
HYD నగరంలోని హుస్సేన్‌సాగర్‌లో నీటి పై తేలియాడే ఫ్లోటింగ్ పంపింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు జలమండలి ప్రణాళిక సిద్ధం చేసింది. నీటిమట్టాలు తగ్గడం, డెడ్ స్టోరేజీ పడిపోయినప్పుడు ఎమర్జెన్సీ పంపింగ్ చేసే అవకాశం ఉందన్నారు. నీటి నిల్వలు పూర్తిస్థాయిలో తగ్గితే ఇబ్బందులు లేకుండా అప్రోచ్ ఛానల్ ద్వారా నీటిని పంప్ చేసి, శుద్ధి చేయనున్నారు.
BRS, కాంగ్రెస్, MIM మూడు పార్టీలు ఒక్కటేనని కిషన్ రెడ్డి అన్నారు. గతంలో అధికారంలో ఉన్న BRSకు మద్దతు ఇచ్చిన MIM ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తోందని విమర్శించారు. ఫిరోజ్‌ఖాన్ మాటలే ఇందుకు నిదర్శనమన్నారు. వీళ్లంతా కలిసి హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది ఏంటని ప్రశ్నించారు. మతం పేరుతో రాజకీయం చేస్తున్నారంటూ ఆయన ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో BJPకే అత్యధిక స్థానాలు వస్తాయని జోస్యం చెప్పారు.
Sorry, no posts matched your criteria.