India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కూకట్‌పల్లి, ఎల్బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్ ఈస్ట్, బేగంపేట, అమీర్‌పేట మెట్రో స్టేషన్ల వద్ద ఉదయం, సాయంత్రం రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం నడుస్తున్న 57 రైళ్లకు మొత్తం 171 కోచ్‌లున్నాయి. అదనంగా 40 నుంచి 50 తీసుకొస్తామని మెట్రో గతంలో చెప్పినప్పటికీ ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. దీనిపై ప్రత్యేక చొరవ చూపాలని పలువురు ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై మీకామెంట్?
HYD, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా
రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముస్లింలు మసీదులకు వెళ్లి భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. చిన్నాపెద్ద పరస్పరం ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. హైదరాబాద్ లోని మీర్ ఆలం ఈద్గా, చార్మినార్, మక్కా మసీదులో, వికారాబాద్, తాండూర్, చేవెళ్ల తదితర ప్రాంతాల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈద్గాల వద్ద భక్తులతో కిటకిటలాడింది.
HYD నగరంలో మంచినీటి డిమాండ్ రోజురోజుకి పెరుగుతున్న వేళ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో నెలకు 2.5 లక్షల ట్రిప్పుల నీటి సరఫరా చేసేందుకు ప్రణాళిక రూపొందించామని తెలియజేశారు. తాగునీటి ఇబ్బంది లేకుండా చూస్తామని, త్వరలో నాగార్జునసాగర్ ఎమర్జెన్సీ పంపింగ్ ప్రారంభించి నగర ప్రజలకు నీరు అందించనున్నట్లు వాటర్ బోర్డు అధికారులు వెల్లడించారు.
వేసవి కాలంలో రైలు ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. దీంతో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 16 నుంచి 30 వరకు షెడ్యూల్ వారీగా ప్రత్యేక రైళ్లు నడుస్తాయన్నారు. స్పెషల్ ట్రైన్లలో వెళ్లేవారు, రైలు సమయానికి కనీసం అర్ధగంటకు ముందుగానే స్టేషన్ వద్దకు చేరుకోవాలని సూచించారు. రైలు డోర్ వద్ద ఎట్టి పరిస్థితుల్లో కూర్చోవద్దని హెచ్చరించారు.
రంజాన్ మాసంలో HYD నగరంలో 10 లక్షల బిర్యానీలు,5.3 లక్షల హలీమ్ ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ ఓ ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా 6 మిలియన్ ప్లేట్ల బిర్యాని ఆర్డర్లు వచ్చాయని, గతేడాదితో పోల్చితే 15% పెరిగిందని వెల్లడించింది. హైదరాబాద్,కోల్ కతా, లఖ్ నవూ, భోపాల్, మీరట్ నగరాల్లో కొనుగోళ్లను పరిశీలించగా…ఇఫ్తార్ ఆర్డర్లు 34 శాతం పెరిగాయని తెలిపింది.
యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడిని కాచిగూడ పోలీసులు బుధవారం రిమాండ్‌కు తరలిచారు. SI సుభాశ్ తెలిపిన వివరాల ప్రకారం.. గోల్నాకలో నివాసం ఉంటున్న యువతి (29) ప్రైవేటు ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. సత్యానగర్ వాసి అఖిల్ (30)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో దగ్గరైన అతడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు. చివరకు ముఖం చాటేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని HYD, ఉమ్మడి RR జిల్లాలోని పలు పట్టణాల్లో వ్యాపార కేంద్రాలు కొనుగోలు దారులతో కిటకిటలాడాయి. ముస్లింలు పగలంతా ధ్యానంలో గడుపుతారని భావించిన వ్యాపారులు.. రాత్రంతా షాపులను తెరిచి ఉంచారు. వస్త్రాలు,మెహందీ, మిస్వాక్, ఇత్తర్ (సుగంధ ద్రవ్యాలు), సుర్మా, గృహ పరికరాలతో పాటు సేమియాలు, డ్రై ఫ్రూట్స్ తదితర వస్తువులను కొనుగోలు చేశారు. దీంతో దుకాణాల్లో సందడి నెలకొంది.
రంజాన్ సందర్భంగా నేడు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. ఉదయం 8 గంటల నుంచి 11:30AM వరకు అమల్లో ఉంటాయన్నారు. మీరాలం ట్యాంకు ఈద్గా, హాకీ గ్రౌండ్, మాసబ్‌ట్యాంకు పరిసర ప్రాంతాల్లో దారి మళ్లిస్తామన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
SHARE IT
ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) పండగను పురస్కరించుకొని నేడు సాలార్ జంగ్ మ్యూజియానికి సెలవు ఉంటుందని సంబంధిత అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మ్యూజియం మూసి ఉంటుందని పేర్కొన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కోరారు.
HYD మెట్రో సంస్థ సూపర్ సేవర్ హాలిడే కార్డు, పీక్ హవర్ డిస్కౌంట్ కార్డు, స్టూడెంట్ మెట్రోపాస్ కార్డును ఏప్రిల్ 9న రీ లాంచ్ చేసినట్లుగా తెలిపింది. ఏప్రిల్ 9 నుంచి 6 నెలల వరకే ఆఫర్లు వర్తిస్తాయని పేర్కొన్నారు. అయితే, ఏప్రిల్ నెల నుంచి మరో ఆరు నెలల వరకు హాలిడేల లిస్ట్ ఇప్పటి వరకు విడుదల చేయలేదు. వెంటనే హాలిడేస్ లిస్ట్ విడుదల చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.