RangaReddy

News April 11, 2024

HYD: సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. ఇవే..!

image

వేసవి వేళ సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లుగా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు పేర్కొన్నారు. HYD నుంచి కటక్ ఏప్రిల్ 16, 23, 30న, సికింద్రాబాద్ నుంచి ఉదయ్‌పూర్ ఏప్రిల్ 16, 23 తేదీలలో రైళ్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలియజేశారు. రిటర్న్ జర్నీకి సైతం అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.

News April 11, 2024

HYD: ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉందా..? కోర్సు మీకోసమే!

image

HYD ఉస్మానియా యూనివర్సిటీ CELTలో 8, 9, 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ స్కిల్స్ అండ్ పర్సనల్ డెవలప్‌మెంట్ సర్టిఫికెట్ కోర్సును నెలరోజుల పాటు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి గలవారు 79899 03001‬కు కాల్ చేసి ఏప్రిల్ 14 వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. 8, 9, 10వ తరగతి వాళ్లకి ఉ.8:15 నుంచి ఉ.9:45 వరకు, ఇంటర్ వాళ్లకి ఉ.6:30 నుంచి ఉ.8 వరకు తరగతులు ఉంటాయన్నారు.

News April 11, 2024

HYD: నేడే రంజాన్.. సర్వం సిద్ధం

image

ముస్లింల పవిత్ర పండుగ రంజాన్‌(ఈద్‌-ఉల్‌-ఫితర్‌)ను నేడు జరుపుకోవాలని రుహియ్యతే హిలాల్‌ కమిటీ (నెలవంక నిర్ధారణ కమిటీ) సభ్యులు తెలిపారు. బుధవారం రంజాన్‌ చివరి రోజుగా పరిగణించి ఉపవాసం పాటించారు. గురువారం షవ్వాల్‌ 1వ తేదీ (ఏప్రిల్‌ 11)గా పరిగణించి పండుగ జరుపుకోవాలని సూచించారు.  మక్కా మసీద్, మల్లేపల్లి మసీద్‌, తాండూరు మసీద్, HYD, RRలోని తదితర ఈద్గా మైదానాల్లో‌ ప్రత్యేక ప్రార్థనల కోసం ఏర్పాట్లు చేశారు.

News April 10, 2024

HYD: ప్రతీకారం.. యువకుడి మర్డర్‌

image

బాచుపల్లి PS పరిధిలో ఈ నెల 1న జరిగిన పిల్లి తేజస్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన 9 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గత ఏడాది తన స్నేహితుడు తరుణ్ హత్యకు ప్రతీకారంగా తేజస్‌ను చంపేశారని పోలీసులు పేర్కొన్నారు. నిందితుల నుంచి 6 సెల్‌ఫోన్స్, 4 టూ వీలర్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

News April 10, 2024

HYD: ఇడ్లీలో బల్లి.. ఓయూలో ఆందోళన

image

ఉస్మానియా యూనివర్సిటీ BED హాస్టల్ మెస్‌లో నాణ్యత ఉండడం లేదని విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. ఉదయం ఇడ్లీ తింటుంటే ప్లేట్‌లో బల్లి కనిపించడంతో ఖంగుతిన్నామన్నారు. ఆగ్రహంతో చీఫ్ వార్డెన్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. తక్షణమే తమ మెస్‌ను చీఫ్ వార్డెన్ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. సంఘటనపై విచారణ జరిపిన అధికారులు మెస్‌లోని నలుగురు సిబ్బందిని బదిలీ చేశారు.

News April 10, 2024

HYD: KCR మీద కోపంతో‌ కాంగ్రెస్‌కు ఓటు: ఈటల

image

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మీద కోపంతో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేశారని BJP మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శించారు. రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను చూసి ఓటు వేయలేదన్నారు. హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అయినా కూడా ఇప్పుడు మరోసారి 17 ఎంపీ సీట్లు గెలిపించండి అంటూ ప్రజలకు మాయ మాటలు చెబుతున్నారని ఈటల దుయ్యబట్టారు. దీనిపై మీ కామెంట్?

News April 10, 2024

HYD: పుస్తక ప్రేమికులకు GOOD NEWS

image

HYDలోని పుస్తక ప్రేమికులకు మెట్రో అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ కాన్ కోర్స్ లెవెల్ వద్ద ఉచితంగా లైబ్రరీ ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు. నేడు ఉదయం 10 గంటలకు ఇది ప్రారంభం కాగా.. ఏప్రిల్ 14 వరకు కొనసాగుతుందని, నగర ప్రజలు బుక్ ఫెయిర్ సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.

News April 10, 2024

HYD: కాంగ్రెస్ పార్టీలోకి జంపన ప్రతాప్?

image

బీజేపీ సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కి మరో షాక్ తగలనుంది. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు ప్రతాప్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా ఆహ్వానించారు. ఇందుకు అంగీకరించిన జంపన ఈరోజు తన అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు.

News April 10, 2024

HYD: కాంగ్రెస్‌ను ఓడిస్తాం: RS ప్రవీణ్‌కుమార్

image

కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులను చిత్తుగా ఓడిస్తామని BRS నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థి RS ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా HYD అల్వాల్‌ సర్కిల్‌ వెంకటాపురం డివిజన్‌ యాదమ్మనగర్‌లో మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా ప్రవీణ్‌ కుమార్‌, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి ప్రచారం నిర్వహించారు. RS మాట్లాడుతూ.. కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలులో విఫలమైందన్నారు.

News April 10, 2024

కంటోన్మెంట్‌లో గెలుపు ఎవరిది?

image

పార్లమెంట్ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో ఉప ఎన్నిక జరగనుంది. స్థానిక BRS MLA లాస్య నందిత యాక్సిడెంట్‌లో చనిపోగా ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. కాగా BRS నుంచి లాస్య సోదరి నివేదిత బరిలో ఉంటారని సమాచారం. అయితే BRS నుంచి BJPలో చేరి గత ఎన్నికల్లో పోటీ చేసిన శ్రీగణేశ్ ఇటీవల కాంగ్రెస్‌లో చేరగా ఆయనకు అధిష్ఠానం టికెట్ కేటాయించింది. BJP ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించలేదు. మరి గెలుపెవరిదో?