India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
MP ఎన్నికల్లో భాగంగా ఒక్క ఎంపీ సీటు కేటాయించకుండా కాంగ్రెస్ పార్టీ మాదిగలకు తీవ్ర అన్యాయం చేసిందని, ఆ పార్టీకి పుట్టగతులు ఉండవని MRPS రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరసింహులు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ పునరాలోచించకాపోతే తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. నాగర్ కర్నూల్ MP టికెట్ అధికంగా ఉన్న మాదిగలకు కేటాయించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున డిమాండ్ చేశారు.
ఈనెల 18 నుంచి 25 వరకు చిలుకూరు బాలాజీ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చుకుడు రంగరాజన్ తెలిపారు. 21న బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టమైన బాలాజీ, పద్మావతి, అలివేలు మంగమ్మ కళ్యాణోత్సవం ఉంటుందని, 25న చక్రతీర్థంతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. నూతన క్రోధి నామ సంవత్సరం నేపథ్యంలో స్వామిని దర్శించుకోవాలని భక్తులకు సూచించారు. SHARE IT
హాస్టల్‌లో ఉండే ఓ బాలిక సూసైడ్ చేసుకున్న ఘటన HYDదుండిగల్ PSపరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. సూరారం ప్రాంతానికి చెందిన బాలిక(13) దుండిగల్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటోంది. మూడేళ్ల వయసులో ఆమెను తల్లి వదిలేసి వెళ్లింది. ఇటీవల తండ్రి మరణించడంతో ఒంటరైంది. బాలికను ఆమె మేనత్త ఓ ఫౌండేషన్‌లో చేర్పించింది. ఈక్రమంలో బాలిక హాస్టల్ రూమ్‌లో ఉరేసుకుని చనిపోగా మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు.
హైటక్ సిటీ ట్రీడెంట్ హోటల్లో జరిగిన గీతాంజలి మళ్లి వచ్చింది సినిమా ప్రీరిలీజ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. కోన వెంకట్ ఆధ్వర్యంలో వెలువడిన గీతాంజలి మళ్లీ వచ్చిందనే సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. నాడు సినిమాలు సామాజిక బాధ్యత, సమాజంలో ఉన్న రుగ్మతలను తొలగించే విధంగా పాత్రలు ఉండేవని, సమాజ పరివర్తనకు సినిమాలు దోహదపడాలని పేర్కొన్నారు.
యువకుడిపై పోక్సో కేసు నమోదైన ఘటన సికింద్రాబాద్ కార్ఖానా పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బోయిన్‌పల్లి మడ్‌ఫోర్ట్ వద్ద నివాసం ఉండే బాలిక(17)పై అర్ధరాత్రి ఆ ప్రాంతంలోనే నివాసించే భాను(25) అనే యువకుడు అత్యాచారానికి యత్నించాడు. దీంతో ఆమె కేకలు వేయగా అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ మేరకు బాలిక తల్లిదండ్రులు మంగళవారం కార్ఖానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
HYD సనత్‌నగర్ బస్టాండ్‌లో నాగరాజ్ అనే యువకుడితో పాటు అతడి నలుగురు స్నేహితులను అరెస్ట్ చేశామని SOT రాజేంద్రనగర్ టీం తెలిపింది. వారి నుంచి 4 గ్రాముల MDMA డ్రగ్, 5గ్రాముల గంజాయి, OCB రేపర్స్ స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. విచారణలో ఏప్రిల్ 4న నాగరాజ్ స్నేహితుడు దిలీప్ పుట్టినరోజు సందర్భంగా నలుగురు స్నేహితులతో గోవాకు వెళ్లి MDMA డ్రగ్‌తోపాటు GOA నుంచి బస్సులో HYDకు తిరిగి వచ్చారని తేలిందన్నారు.
పార్లమెంట్ ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో అధికార కాంగ్రెస్ ప్రచారంలో దూకుడు పెంచింది. తుక్కుగూడలో ఇటీవల నిర్వహించిన జన జాతర సభతో కాంగ్రెస్ కేడర్‌లో జోష్ మరింత పెరిగింది. HYD, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించాలని, క్షేత్రస్థాయిలో ప్రధాన ప్రతిపక్షమైన BRSకు బ్రేక్ వేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నేతలకు సూచనలు చేశారు. మీ కామెంట్?
రాజధానిలో అంతర్భాగమైన RR, మేడ్చల్ జిల్లాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం నియమించిన ప్రత్యేకాధికారి విజయేంద్రబోయి ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. ఏప్రిల్ తొలి వారం నుంచి జూన్ వరకు 2నెలల పాటు మున్సిపల్, కార్పొరేషన్ కమిషనర్లు, మండలాల ప్రత్యేకాధికారులు, మిషన్ భగీరథ, గ్రామీణ నీటి సరఫరా ఇంజినీర్లు అప్రమత్తంగా ఉండాలని, జలమండలి, మిషన్ భగీరథ అధికారులతో నిత్యం సంప్రదింపులు నిర్వహించాలన్నారు.
ఫుట్‌పాత్‌పై పడుకునే విషయంలో తలెత్తిన ఘర్షణ చివరకు హత్యకు దారితీసిన ఘటన HYD పహాడీషరీఫ్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మహారాష్ట్ర వాసి కామ్ సింగ్(40), జల్‌పల్లి వాసి నవనాథ్ స్థానికంగా ఉంటూ పోచమ్మ గుడి ముందు ఫుట్‌పాత్‌పై నిద్రిస్తుంటారు. ఈ క్రమంలో అర్ధరాత్రి వీరి మధ్య ఘర్షణ జరగగా నవనాథ్ కోపంలో రాయితో కామ్ సింగ్ తలపై మోది హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు.
తెలుగు నూతన సంవత్సరాది శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మంత్రి జూలపల్లి కృష్ణారావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం HYD రవీంద్ర భారతిలో ఘనంగా ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు మేలు కలగాలని, ప్రజలందరి కొత్త ఆశయాలు నెరవేరాలన్నారు. సీఎస్ శాంతి కుమారి, షాద్‌నగర్ MLA వీర్లపల్లి శంకర్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.