India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. అర్ధరాత్రి ఓల్డ్ సిటీలోని హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య జరిగింది. సమాచారం అందుకొన్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతుడిని పరిశీలించారు. హత్యకు గురైంది చార్మినార్ ప్రాంతానికి చెందిన మక్సూద్ అలీగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం తెలుసుకొన్న సౌత్ జోన్ DCP స్నేహ మెహ్రా ఘటనా స్థలానికి చేరుకొని ఆరా తీశారు.
సికింద్రాబాద్‌లో విజయం ఎవరిదనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇక్కడ గెలిస్తే ఆ పార్టీదే దేశంలో అధికారమని సెంటిమెంట్. 2019లోనూ రసవత్తర పోరు సాగింది. సాయికిరణ్(BRS)పై కిషన్ రెడ్డి(BJP) 62,114 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అంజన్ కుమార్(INC) 3వ స్థానంలో నిలిచారు. అయితే, ఈ ఎన్నికల ముందు BJP, BRS, INC నువ్వానేనా అన్నట్లు ప్రచారం చేశాయి. పోలింగ్ ముగిశాక ఎవరికి వారు మాదే మెజార్టీ అంటున్నారు. మీ కామెంట్?
HYD, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల తుది పోలింగ్ శాతం వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఈరోజు ప్రకటించారు. HYDలో 48.48%, సికింద్రాబాద్‌లో 49.04%, మల్కాజిగిరిలో 50.78%, చేవెళ్లలో 56.40% నమోదైంది. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో 51.61% పోలింగ్ నమోదైందని ఆయన తెలిపారు. కాగా రాజధాని పరిధిలో 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి సుమారు 3 శాతం పోలింగ్ అధికంగా నమోదైంది.
ప్రజాస్వామ్యంలో విలువలు లేని వ్యక్తి రేవంత్ రెడ్డి అని BJP మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. ఈరోజు HYD నాంపల్లిలోని ఆ పార్టీ స్టేట్ ఆఫీస్‌లో ఈటల మాట్లాడారు. ఈసారి భిన్నంగా పోలింగ్ జరిగిందని, నిశ్శబ్ద విప్లవం ఫలితం జూన్ 4న తెలుస్తుందన్నారు. మోదీ పాలనలోనే దేశం అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావించారన్నారు. BJPకి ఓటేసిన వాళ్లకు థ్యాంక్స్ చెప్పారు. BJP ఊహించని రీతిలో ఫలితాలు సాధించనుందన్నారు.
HYD, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల ఎంపీ స్థానాల్లో ఈసారి పోలింగ్ పెరిగింది. 2019లో HYDలో 44.84% నమోదవగా 2024లో 46.08% పోలింగ్ జరిగింది. ఇక సికింద్రాబాద్‌లో 2019లో 46.50% కాగా 2024లో 48.11%, మల్కాజిగిరిలో 2019లో 49.63% కాగా 2024లో 50.12%, చేవెళ్లలో 2019లో 53.25% కాగా 2024లో 55.45% పెరిగింది. అంటే ప్రతి నియోజకవర్గంలో సుమారు 2% పెరిగింది. పెరిగిన పోలింగ్ ఎవరిని గెలిపిస్తుందో వేచి చూడాలి?
ఖైరతాబాద్ విశ్వేశ్వర్ భవన్ పక్కన ఉన్న నాలాలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటికి తీసి ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడు ఎవరు? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
BJP సీనియర్ నేత అల్వాల శ్యామ్ రావు హఠాన్మరణం చెందారు. ఆదివారం అర్ధరాత్రి సమమంలో గుండెపోటు రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఆయన మృతి చెందారు. శ్యామ్ రావు BJPలో ఏళ్లుగా పనిచేశారు. ప్రస్తుతం గోల్కొండ జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. సీనియర్ నేత మృతి పట్ల వివిధ పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
రాజధాని ఓటరు తీర్పు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ లోక్‌సభలో 30 మంది, సికింద్రాబాద్‌లో 45, మల్కాజిగిరిలో 43, చేవెళ్లలో 22, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నికలో 15 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత HYD రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఈ సమయంలో ఓటరు ఎవరివైపు నిలిచారనేది అభ్యర్థుల్లో టెన్షన్ పెంచింది. దీనికి తెరపడాలంటే జూన్ 4 వరకు వేచిచూడాల్సిందే.
HYD, మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల ఎంపీ ఎలక్షన్లతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. సా.6 గంటల వరకు HYDలో 46.08, మల్కాజిగిరిలో 50.12, సికింద్రాబాద్ 48.11, చేవెళ్ల 55.45 శాతం పోలింగ్ నమోదైందని ఓటర్ టర్నౌట్ పేర్కొంది. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో 50.34 శాతం పోలింగ్ నమోదైంది. అధికారికంగా వివరాలు రావాల్సి ఉంది. SHARE IT
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల ద్వారా గడిచిన 24 గంటల్లో HYDలో ఇప్పటివరకు రూ.23,87,06,012 నగదు సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. రూ.26,06,11,049 విలువ గల ఇతర వస్తువులు, 28,150.805 లీటర్ల మద్యాన్ని పట్టుకుని సీజ్ చేశామని, 380 మందిపై కేసులు నమోదు చేసి 383 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.