India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పర్యావరణాన్ని కాపాడే విధంగా భవన నిర్మాణాలు ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైటెక్స్‌లో ఏర్పాటుచేసిన గ్రీన్ ప్రాపర్టీ షో ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆకుపచ్చ జీవనం మనకు ఓ విధానంగా మారాలి, పచ్చని వారసత్వాన్ని మన తర్వాత తరాలకు అందించాలన్నారు. 50% నీరు, 40 శాతం విద్యుత్తు ఆదా చేసే రీతిలో నిర్మించే గ్రీన్ బిల్డింగ్స్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు.
గత 2019 లోక్‌సభ ఎన్నికల్లో 1.86 కోట్ల మంది ఓటేశారని, ఈసారి తెలంగాణ -2024 లోక్‌సభ ఎన్నికల్లో 2.18 కోట్ల మంది ఓటర్లు ఓటేసినట్లుగా CEO వికాస్ రాజ్ తెలిపారు. గతంతో పోలిస్తే ఓటింగ్ శాతం పెరిగినందుకు రాష్ట్ర ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేకంగా మల్కాజ్గిరిలో 50.78, చేవెళ్లలో 56.50, HYD 48.48, సికింద్రాబాద్‌లో 49.04 శాతం ఓటింగ్ నమోదైనట్లు పేర్కొన్నారు.
సికింద్రాబాద్‌లో కొనసాగుతున్న అగ్నివీర్ శిక్షణ ప్రమాణాలపై లెఫ్ట్ నుంచి జనరల్ మంజిత్ కుమార్ తనిఖీ చేశారు. ఇందులో భాగంగా శిక్షణ కేంద్రం వద్ద ఉన్న అధికారులను కలిసి అక్కడ ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అగ్నివీర్లు అద్భుతంగా రాణించేందుకు అత్యుత్తమ ప్రమాణాలు పాటించి శిక్షణ అందించాలని వారు ఆదేశించారు.
పిడుగుపాటుకు ముగ్గురు రైతులు బలయ్యారు. ఒకే రోజు యాలాల మండలంలోని వేర్వేరు గ్రామాల్లో జరిగిన ఈ ఘటన బాధిత కుటుంబాల్లో విషాదం నింపింది. జుంటుపల్లిలో రైతులు శ్రీనివాస్, లక్మప్పలు తమ వరి పంట కోయిస్తున్న సమయంలో ఉరుములతో కూడిన వర్షం పడటంతో సమీప చెట్టు కిందకి వెళ్లారు. పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. బెన్నూరులో సైతం రైతు గొల్ల వెంకన్న వర్షం పడే సమయంలో చెట్టు కింద ఉండగా పిడుగుపడి మృతి చెందాడు.
జనవరి నుంచి ఏప్రిల్ 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,104 ఫైర్ కాల్స్ నమోదయ్యాయి. స్వల్ప ప్రమాదాల విభాగంలో 2,860, మధ్యస్థంగా 62, తీవ్రతర ప్రమాదాలు 9, రెస్క్యూ కాల్స్ 127, ఎమర్జెన్సీ కాల్స్ 15 ఉన్నాయని కమాండ్ కంట్రోల్ సిబ్బంది తెలిపారు. ఇందులో 40-50 శాతం ప్రమాదాలు HYD పరిధిలోనివే. ఇటీవల జరిగిన ఫిల్మ్ ఛాంబర్ అగ్ని ప్రమాదంతో మొదలుకొని కాటేదాన్ సహా అంటూ.. రిపోర్టు విడుదల చేసింది.
HYD శివారు శంషాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో లైన్‌లో భాగంగా నాగోల్ నుంచి చంద్రాయణగుట్టకు 14 KM మెట్రో నిర్మించాలని రూట్ ఖరారు చేసినట్లు మెట్రో ఎండీ NVS రెడ్డి తెలిపారు. ప్రస్తుత నాగోల్ మెట్రో స్టేషన్, నాగోల్ చౌరస్తా, అల్కాపురి చౌరస్తా, కామినేని ఆసుపత్రి, ఎల్బీనగర్ సర్కిల్, సాగర్ రింగ్ రోడ్డు, మైత్రి నగర్ మీదుగా చంద్రాయణగుట్ట ఇలా.. మొత్తం 13 స్టేషన్లు వస్తాయని పేర్కొన్నారు.
HYD నగరం సికింద్రాబాద్ మనోవికాస్ నగర్ NIEPID కేంద్ర విద్యా సంస్థ మేధో వైకల్యం ఉన్నవారి నుంచి డిప్లమా కోర్సులు చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. SSC, ఇంటర్మీడియట్ చేసిన వారు అర్హులు కాగా.. డిప్లమా స్పెషల్ ఎడ్యుకేషన్, రిహాబిలిటేషన్ సంబంధించిన కోర్సులు ఉన్నాయి. కేంద్రం స్కాలర్షిప్ సైతం అందిస్తుంది. హాస్టల్ ఫెసిలిటీ సైతం ఉంది. మిగతా వివరాల కోసం18005726422 సంప్రదించండి.
HYD నగర పరిధి బంజారాహిల్స్ సమీపాన ఉన్న ఓ రెస్టారెంట్లో HYD బిర్యానీ రుచి చూసిన SRH క్రికెటర్ ట్రావిస్ హెడ్ అద్భుతంగా ఉందని తెలియజేశారు. అంతేగాక తన భార్య జెస్సికాకు మొదటిసారిగా HYD బిర్యానీ రుచి చూపించినట్లుగా తెలుపుతూ.. HYD బిర్యానీ ఫర్ మై లవ్ అంటూ X వేదికగా ట్వీట్ చేశారు. కాగా నేడు SRH VS పంజాబ్ కింగ్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ హైదరాబాదులో జరగనుంది.
తెలంగాణ రాష్ట్ర సౌతెర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సంస్థ X వేదికగా ఓ ట్వీట్ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు TS బదులుగా TG జోడించినట్లు తెలిపింది.ఇక నుంచి TSSPDCL కాదు..TGSPDCL అని పేర్కొంది. HYD,RR, VKB,MDCL మల్కాజ్గిరి జిల్లాలకు చెందిన దాదాపు అన్ని సెక్షన్ల విద్యుత్ శాఖ అధికారులు X వేదికగా ప్రొఫైల్ ఫోటోను మార్చి ప్రజలకు తెలియజేశారు.
గ్రేటర్ HYD పరిధిలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో 73,969 కుక్కలకు, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 94,500 కుక్కలకు రాబిస్ టీకాలు వేసినట్లుగా అధికారులు తెలియజేశారు. కుక్కల నియంత్రణ కోసం ఎక్కడికక్కడ చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. కుక్కల బెడద ఉన్న ప్రతి ప్రాంతంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని, గత నెల రోజుల్లో 1,000 కుక్కలకు పైగా వ్యాక్సినేషన్ అందించినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.