RangaReddy

News April 9, 2024

HYD: చావు డప్పు మోగిస్తామని కాంగ్రెస్‌కు హెచ్చరిక

image

ఈనెల 15 లోగా మాదిగలకు ఎంపీ సీట్లు కేటాయించకపోతే కాంగ్రెస్ కార్యాలయమైన గాంధీభవన్‌తో పాటు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో చావు డప్పు మోగిస్తామని టీ ఎమ్మార్పీఎస్‌ చీఫ్ వంగపల్లి శ్రీనివాస్‌ మాదిగ హెచ్చరించారు. HYD విద్యానగర్‌లోని ఆ సంఘం స్టేట్ ఆఫీస్‌లో సోమవారం ఆయన మాట్లాడారు. తెలంగాణలో అధిక జనాభా కలిగిన మాదిగలకు ఒక్క ఎంపీ సీటు ఇవ్వకుండా కాంగ్రెస్‌ మాదిగలను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.

News April 9, 2024

HYD: ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి

image

రోజురోజుకూ ఎండ తీవ్రత పెరిగిపోతోంది. వేసవి ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో మధ్యాహ్నం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. సోమవారం HYD, ఉమ్మడి RR జిల్లాల్లో ఎండ దంచికొట్టింది. అత్యధికంగా వికారాబాద్‌ జిల్లా పుట్టపహాడ్‌లో 40.6 డిగ్రీలు, శేరిలింగంపల్లి ప్రాంతంలో 39.8 డిగ్రీలు, ఉప్పల్‌ పరిధి మారుతీనగర్‌లో 39.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

News April 9, 2024

HYD: 3 లక్షల ఓట్ల మెజారిటీ ఖాయం: కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి

image

చేవెళ్ల ఎంపీగా 3 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో తాను గెలుస్తానని విశ్వేశ్వర్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మొయినాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ పేరుతో లక్ష ఓట్లు మెజారిటీ, మరో రెండు లక్షల మెజారిటీని మాత్రం కార్యకర్తల పేరుతోనే సాధించనున్నట్లు వెల్లడించారు. ప్రధాని మోదీ అభివృద్ధి ప్రదాత అని అన్నారు. హనుమంతుడి గుడిని కూల్చిన వ్యక్తి జై శ్రీరామ్ అంటే నమ్మేస్థితిలో ఎవరూ లేరన్నారు.

News April 9, 2024

శంషాబాద్: ముచ్చింతల్‌లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు

image

HYD శంషాబాద్ మండలం ముచ్చింతల్ సమీపంలోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో హీరో చిరంజీవి నటిస్తోన్న విశ్వంభర సినిమా షూటింగ్ టీమ్ సందడి చేసింది. ఈ సందర్భంగా షూటింగ్ స్పాట్‌కు తమ్ముళ్లు పవన్ కళ్యాణ్, నాగబాబు వచ్చారు. వీరి కలయికను చూసిన టీమ్ సభ్యులు తెగ సంబరపడి పోయారు. సోమవారం ముగ్గురు అన్నదమ్ములు ఒకే దగ్గర ఉన్నారని తెలుసుకున్న అభిమానులు వారిని చూసేందుకు వేలాదిగా తరలివచ్చారు.

News April 9, 2024

HYD: బేగంపేట్‌లో హీరోయిన్ రష్మిక

image

HYD బేగంపేట్‌లో హీరోయిన్ రష్మిక సందడి చేశారు. ఓ హోటల్‌లో సోమవారం జరిగిన ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె అనంతరం ఫొటోలకు ఫోజులిస్తూ అభిమానులను కలిశారు. పుష్ప సినిమా హీరోయిన్‌ను చూసేందుకు.. ఆమెతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు.

News April 9, 2024

HYD: యాప్‌లో ఫిర్యాదు చేస్తే పరిష్కారం!

image

TSSPDCL యాప్‌ను పునరుద్ధరించినట్లు HYD సెక్షన్ విద్యుత్ అధికారులు ‘X’ వేదికగా తెలియజేశారు. ప్లే స్టోర్ ద్వారా ఈ యాప్ డౌన్లోడ్‌ చేసుకోవాలన్నారు. ఆయా ప్రాంతంలో ఉన్న కరెంటు సమస్యలపై ఫిర్యాదు చేస్తే పరిష్కరిస్తామని, నూతన ఫీచర్స్ అందుబాటులోకి తెచ్చినట్లుగా తెలిపారు. https://play.google.com/store/apps/details?id=supply.power.tsspdcl లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. SHARE IT

News April 8, 2024

HYD: కుమారుడిని చంపి తల్లిదండ్రుల ఆత్మహత్య

image

హైదరాబాద్‌లో సోమవారం విషాదఘటన వెలుగుచూసింది. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధి సన్‌సిటీలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కొడుకును చంపి, భార్య భర్తలు విషం తాగారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 8, 2024

HYD మెట్రో‌లో‌ మహిళలకు FREE జర్నీ కల్పించాలని డిమాండ్

image

మహిళల‌ సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఉప్పల్‌ మాజీ MLA NVSS ప్రభాకర్‌ అన్నారు. హైదరాబాద్‌ మెట్రో, MMTSలోనూ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేశారు. స్కూల్, కాలేజీ విద్యార్థులకు కూడా ఈ వెసులుబాటు ఉండాలన్నారు. కానీ, ఇవేమీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదన్నారు. రాబోయే ఎన్నికలు అభివృద్ధి కోసం జరిగేవని, కాంగ్రెస్‌‌ను నమ్మి మోసపోవొద్దు అంటూ పేర్కొన్నారు. దీనిపై మీ కామెంట్?

News April 8, 2024

Water Crisis: హైదరాబాదీ ఇకనైనా మేలుకో!

image

HYDలో విచ్చలవిడిగా‌ నీటిని వినియోగిస్తున్నారు. భూరగ్భజలాలు అడుగంటడంతో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. అయినా పబ్లిక్‌ తీరు మార్చుకోవడం లేదు. నిత్యం రాజధానిలో 448 మిలియన్ గ్యాలన్ల నీరు వాడుతున్నారు. అందులో 30 మిలియన్‌ గ్యాలన్లు వృథా చేస్తున్నారు. మంజీరా, కృష్ణ నుంచి ఒక్క కిలో లీటర్‌ నీటిని నగరానికి తరలించాలంటే రూ.45 నుంచి రూ. 50 వరకు ఖర్చువుతోందట. హైదరాబాదీ ఇకనైనా మేలుకో. SAVE WATER

News April 8, 2024

HYD: DGP సాయం.. 32 మందికి పోలీస్ ఉద్యోగాలు

image

DGP రవిగుప్తాను సురక్ష సేవాసంఘం స్టేట్ ప్రెసిడెంట్ గోపిశంకర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. నిరుద్యోగ యువతకు సురక్ష అందించిన ఉచిత పోలీస్ శిక్షణ కోసం DGP గతంలో రూ.1,80,000 ఆర్థిక సాయం అందించారు. DGP సాయంతో బట్టలు, బూట్లు, స్టడీ మెటీరియల్, తరగతుల ఏర్పాటు చేసి 32 మందిని కానిస్టేబుళ్లుగా తీర్చిదిద్దినట్లు శంకర్ తెలిపారు. CI ప్రసన్నకుమార్ చొరవ చూపారన్నారు. డీజీపీకి శంకర్ కృతజ్ఞతలు తెలిపారు.