RangaReddy

News December 11, 2024

చీకట్లో‌ హైదరాబాద్‌ అందాలు!

image

ట్యాంక్‌బండ్‌‌కు పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. అనుగుణంగా HMDA, GHMC అధికారులు‌ బ్యూటిఫికేషన్ పనులు చేపడుతున్నారు. తాజాగా HYDలో ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహించిన ప్రభుత్వం హుస్సేన్‌సాగర్‌ చుట్టూ LED లైట్ల‌ను ఏర్పాటు చేసింది. త్రివర్ణ లైట్లతో తెలంగాణ సెక్రటేరియట్ వెలిగిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోను HMDA ‘X’లో పోస్ట్ చేసింది. చీకట్లో బిర్లా టెంపుల్, సెక్రటేరియట్‌‌ ఫొటో‌ అందరినీ ఆకర్శిస్తోంది.

News December 11, 2024

HYD: GHMC ఎన్నికలు.. భారీ ప్లాన్!

image

GHMC ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా నేతలు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమదే మేయర్ పీఠం అని ఇటీవల బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. HYDలోని డివిజన్లలో భారీ ఎత్తున పాదయాత్రలు ఉంటాయని‌ ఓ మంత్రి పేర్కొన్నారు. BRS, MIM ఎన్నికలపై స్పందించకపోయిన నగరవాసులు తమవైపు ఉంటారన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, డివిజన్లు పెరిగే ఛాన్స్ ఉంది. పార్టీలు బలంగా ఉండడంతో చతుర్ముఖ పోరు తప్పేలా లేదు.

News December 11, 2024

HYD: ‘మళ్లీ మళ్లీ ఢిల్లీ.. ఇదే రేవంత్ లొల్లి’

image

HYD నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లటంపై ఎంపీ రఘునందన్ రావు విమర్శలు గుప్పించారు. ‘మళ్లీ మళ్లీ ఢిల్లీ.. ఇదే రేవంత్ లొల్లి. గల్లీలో అధికారం, ఢిల్లీలో బేరసారం. ప్రజలు వరదల్లో ఉన్నా, నిరుద్యోగులు రోడ్డెక్కినా, విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో ఆస్పత్రులపాలైనా, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా.. పదవులు నిలుపుకోవడానికి, కార్పొరేషన్ కమిషన్లకు ఢిల్లీ పోవాల్సిందే’ అంటూ మండిపడ్డారు.

News December 11, 2024

HYD: 5 రోజుల పాటు రాష్ట్రపతి పర్యటన

image

శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 17 నుంచి 21 వరకు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేయనున్నారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సీఎస్ శాంతి కుమారి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

News December 11, 2024

HYD: అధికారులతో సీఎస్ శాంతికుమారి సమీక్ష

image

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 17 నుంచి 21 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

News December 11, 2024

ఉప్పల్‌లో మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్

image

HYDలోని ఉప్పల్‌లో సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ ఇంక్యుబేటర్ కేంద్రాన్ని టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, క్రికెటర్ మిథాలీ రాజ్ సందర్శించారు. ఆమె ఈ పర్యటన తమకు ఎంతో ప్రోత్సాహం కలిగిస్తుందని శాస్త్రవేత్తలు, అసిస్టెంట్లు తెలిపారు. ప్రతి రంగంలో రాణించేందుకు చేయాల్సిన కృషి, పట్టుదల ఆమె మాటలు తెలిపాయన్నారు.

News December 11, 2024

‘గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో ఎమ్మెల్యే భేటీ’

image

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మతో చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ వివేకానంద భేటీ అయ్యారు. స్థానిక ప్రాంత అభివృద్ధికి సంబంధించిన అంశాలు తదితర విషయాల గురించి చర్చలు జరిపారు. ప్రజల్లో కలుస్తూ, సమస్యలు తీరుస్తూ ముందుకు వెళ్తామని ఎమ్మెల్యే వివేక్ అన్నారు. గవర్నర్ వర్మతో భేటీ తనకు సంతోషం కలిగించిందన్నారు.

News December 10, 2024

HYD: ఈనెల 14న దొడ్డి కొమురయ్య భవనం ప్రారంభం

image

ఈనెల 14న నార్సింగి పరిధి కోకాపేట్ వద్ద దొడ్డి కొమురయ్య కురమ సంఘ ఆత్మ గౌరవ భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు తెలిపారు. దానికి సంబంధించిన ఏర్పాట్లను డా.బీ.ఆర్ అంబేడ్కర్ సచివాలయంలో సంబంధిత అధికారులతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం భట్టి పాల్గొంటారని తెలిపారు.

News December 10, 2024

HYD: ఇదే నిలువెత్తు సాక్ష్యం: మాజీ మంత్రి

image

మాజీ సీఎం KCR ఎక్కడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఆవిష్కరించలేదని అంటున్న సీఎం, మంత్రులకు హుస్సేన్‌సాగర తీరాన అమరవీరుల స్మారక చిహ్నం ప్రాంగణంలోని పసిడి వర్ణపు తెలంగాణ తల్లి విగ్రహమే నిలువెత్తు సాక్ష్యం అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ HYDలో 2023 జూన్ 22న తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నంతో పాటు తెలంగాణ తల్లిని ఆవిష్కరించారన్నారు.

News December 10, 2024

వికారాబాద్: గ్రూప్-2 పరీక్షలకు సిద్ధం చేయాలి: కలెక్టర్

image

గ్రూప్-2 పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్‌జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో డిసెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించే గ్రూప్-2 పరీక్షల నిర్వహణపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పరీక్షల నిర్వహణకు జిల్లాలో 30 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. గ్రూప్-2 పరీక్షలకు జిల్లాలో 10,381 మంది హాజరుకానున్నట్లు తెలిపారు.